Sr Ntr Habits
Viral, ఆంధ్రప్రదేశ్

Sr NTR: సీనియర్ ఎన్టీఆర్ గురించి రెండు షాకింగ్ విషయాలు.. ముక్కున వేలేసుకుంటారు!

Sr NTR: సీనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగు ప్రజలకు ఎంత చెప్పుకున్నా తక్కువే. సినీ రంగంలో, ప్రజాక్షేత్రంలో ఆయన చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. తెలుగుదేశం (Telugudesam) పార్టీని స్థాపించి అనతికాలంలోనే అధికారంలోకి వచ్చి చరిత్ర పుటల్లో నిలిచారు. అలా.. నటుడిగా, రాజకీయవేత్తగా రెండు రంగాల్లో ఘన విజయమే సాధించారు. అందుకే ఎన్టీఆర్‌ను తెలుగువారి ఆత్మగౌరవం, అన్నగారు అని కొనియాడుతుంటారు. ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే ఒకటి కాదు రెండు అనేక విషయాలు ఉన్నాయి.. అంతేకాదు కొన్ని రోజులే పడుతుంది. ఎన్టీఆర్ మంచి భోజన ప్రియుడు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవి? ఎక్కువగా ఏమేం తింటారు? ఏమేం తాగుతారు? అనే ఇంట్రెస్టింగ్, ఆశ్చర్యపోయే విషయాలు తెలుసుకుందాం. సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌కు సంబంధించిన రెండు షాకింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ విషయాలేంటి? ఎవరు చెప్పారు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

NTR

Read Also- Vijayashanti: రాములమ్మకు మంత్రి పదవి ఫిక్స్.. ఏరికోరి మరీ ఎందుకో?

పొద్దు పొద్దున్నే..
ఎన్టీఆర్‌ను చాలా దగ్గర్నుంచి చూసిన మనిషి పచ్చల ప్రకాష్. ఆయన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ దినచర్య, ఆహారపు అలవాట్లు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ‘ ఎన్టీఆర్‌కు ప్రతిరోజూ అల్పాహారంలో నాటు కోడి ఉండాల్సిందే. రాగి జావ, రాగి ముద్దతో ఉదయం 5 గంటల లోపే టిఫిన్ చేస్తారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో కూడా ముక్క (నాన్ వెజ్) ఉండాల్సిందే. ముక్క లేనిదే ఆయన భోజనం చేసేవారు కాదు. మటన్, కొరమేను ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన ఐటమ్స్. ఇవాళ భోజనంలోకి ఏమేం కావాలనేది ముందుగానే చెప్పి, మరీ వంట చేయిస్తారు. ఎన్టీఆర్ కోరిందల్లా మెనూలో సిద్ధంగా ఉండాలి. ఇంత బలమైన ఆహారం తీసుకుంటున్నప్పటికీ శరీరం మాత్రం చాలా అదుపులో ఉండేలా చూసుకునేవారు. ముఖ్యంగా పొట్ట రాకుండా జాగ్రత్త పడేవారు. తిండి కలిగితే కండ కలదోయ్.. కండ కలవాడే మనిషోయ్ అనే సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మేవారు. అది నిజం చేసి చూపించే వారు’ అని ప్రకాష్ తెలిపారు.

Sr Ntr Food

పది కాదు.. 100 బజ్జీలు..!
మామూలుగా మనం మిర్చి బజ్జీలు తింటే ఎన్ని తింటాం.. ఒకసారి 5 లేదంటే 10 తింటాం కదా. ఇక రోజంతా అంటే 20 అనుకోండి. కానీ ఒకేసారి పది కాదు పదిహేను కాదు ఏకంగా 100 బజ్జీలు తినాలంటే సాధ్యం అవుతుందా? అంటే అమ్మో.. ఆ మాట అంటుంటేనే షాకయ్యే పరిస్థితి. అలాంటిది సీనియర్ ఎన్టీఆర్ మాత్రం ఒక్కసారే 100 మిర్చి బజ్జీలు తినేస్తారు. అది కూడా గ్యాప్ లేకుండే తినేవారంటే మామూలు విషయం కానే కాదు కదా. ఈ మిర్చీ బజ్జీల కథను సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ పెద్దాయనుకు పచ్చి మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం. బుట్టలో తక్కువలో తక్కువ 100 గ్యారెంటీగా ఉంటాయి. ఆ బుట్ట ఇలా తీసుకొని టవల్‌లో వేసుకొని ఒడిలో పెట్టుకుని తినేశారు. చేతికి వచ్చినన్ని నాకు ఇచ్చి ఇదిగో తిను అనేవారు. ఒక్కోసారి ఇంతకుమించి కూడా తింటారు’ అని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. మరో ఇంటర్వ్యూలో నిర్మాత చిట్టి బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక్కసారే 40 మిర్చీ బజ్జీలు తిని, చెంబుడు నీళ్లు తాగి ఒక్క తేపు తేపుతారని చెప్పారు. హా.. అంతా ఓకే.. ఇక మొదలుపెడదామా? అని అనేవారని నిర్మాత తెలిపారు.

Mirchi Bujji

రోజుకు రెండు డజన్లు!
ఇప్పట్లో మనం ఒకసారి ఒకటి, లేదంటే రోజు మొత్తమ్మీద రెండు కూల్ డ్రింక్స్ తాగుదాం అంతేకాదు. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రోజు మొత్తమ్మీద 2 డజన్లు సోడాలు తాగడమంటే అంత ఆషామాషీ విషయం కాదు కదా. కానీ, అప్పట్లోనే సీనియర్ ఎన్టీఆర్ ఈ రేంజిలో సోడాలు తాగేవారని ఓ ఇంటర్వ్యూలో ఆయన్ను దగ్గర్నుంచి చూసిన ఓ వ్యక్తి చెప్పారు. రోజుకు రెండు డజన్లు సోడాలు.. అది కూడా గ్యాస్ సోడా, ఒక్కొక్కటి 300 ఎంఎల్ ఉంటుందని చెప్పారు. సోడా బాటిల్ ఎత్తితే ఒక్కటే గుక్కకే తాగేసేవారని చెప్పారు. చూశారుగా.. అప్పట్లోనే ఎన్టీఆర్ మిర్చి బజ్జీలు ఎలా తినేవారో? సోడాలు ఎలా తాగేవారో. ఇవేనండోయ్.. ఈ రెండు షాకింగ్ విషయాలు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వామ్మో.. ఈ రేంజిలో తినేవారా? అంటూ నెటిజన్లు కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.నందమూరి అభిమానులు, నెటిజన్లు, ఎవరికి తోచినట్లుగా వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. విమర్శలు చేసే వాళ్లు కూడా ఉన్నారు. అంతేకాదు.. ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకొని కొందరు యువకులు ఛాలెంజ్‌గా తీసుకుంటున్నారు.

Soda

అన్నగారిని ఆదర్శంగా తీసుకొని.. ఓ యువకుడు ఇలా..

Read Also- Sharmishta Panoli: ఒకే ఒక్క ట్వీట్‌తో జైలుపాలు.. ఎవరీ శర్మిష్ఠ పనోలి.. ఎందుకింత రచ్చ?

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం