Sharmishta Panoli: సోషల్ మీడియా (Social Media) అనేది ఓ శక్తివంతమైన వేదిక. ఎందుకంటే ఒక్క నైట్‌లోనే ఎంతో మందిని సెలబ్రిటీలను చేసింది.. అదే సెలబ్రిటీలను పాతాళానికి తొక్కిపడేసింది కూడా. పనికొచ్చే పనికి వాడుకుంటే సరే, లేకుంటే అంతే సంగతులు. పరిణామాలు ఎటు నుంచి ఎక్కడికి తీసుకెళ్తాయో కూడా ఊహించలేం. ఇక ట్రోలింగ్ అంటారా? అసలు మాటల్లో చెప్పలేం.. రాతల్లో రాయలేనంతగా ఉంటుంది. మరీ ముఖ్యంగా.. ఇదే మీడియం వ్యక్తిత్వాన్ని అభివ్యక్తి చేసే మార్గమైతే, అదే వేదిక భావోద్వేగాలను ద్రవించే, చట్టపరమైన చర్యలకు దారితీసే వేదికగా కూడా మారుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదేమో..! ఇందుకు చక్కటి ఉదాహరణే పశ్చిమ బెంగాల్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, 22 ఏళ్ల లా స్టూడెంట్ శర్మిష్ఠ పానోలి అరెస్ట్.
Read Also- YS Jagan: పేదలకు మళ్లీ రేషన్ కష్టాలా.. సబబేనా చంద్రబాబు?
ఎవరీ ‘లా’ బ్యూటీ?
కోల్‌కతాలోని ఆనందపుర్‌కు చెందిన పుణెలోని ‘లా’ యూనివర్శిటిలో నాలుగో సంవత్సరం చదువుతున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్ కావడంతో సమాజంలో జరిగే విషయాలపై స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి, కాంట్రవర్సీ విషయాలపైన ఎక్కువ తలదూరుస్తుంటారు. ఎవరైనా సరే తనకు న్యాయం జరగాలని కోరినా, సాయం కోరినా సరే వెనుకాడకుండా తనవంతు ప్రయత్నం చేస్తుంటారు. అలా ప్రతి విషయంపైనా తనదైన శైలిలో స్పందిస్తూ, తన అభిప్రాయాలను జోడిస్తూ బలంగా చెబుతూ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారారు. ఇందుకే ఈమెను ట్విట్టర్‌లో 85 వేల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 95వేల మంది ఫాలో అవుతున్నారు. అటు న్యాయ విద్య చదువుతూ.. ఇటు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా సాఫీగా జీవితం సాగిపోతోంది అనుకునే సమయంలో ఊహించని సంఘటన చోటుచేసుకున్నది.
ఎందుకు అరెస్ట్?
పహల్గాం దాడికి ప్రతిఘటనగా పాక్, ఉగ్రవాదులపై ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సింధూర్’ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. సైన్యం ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ, మోదీ-షా ద్వయాన్ని శభాష్ అంటూ కొనియాడారు. సామాన్యుడు మొదలుకుని రాజకీయ, సినీ, పలు రంగాల ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా, వీడియో రూపంలో, ఎక్స్‌లో ఇలా పలు మాధ్యమాల్లో స్పందించారు. అయితే ఈ ఆపరేషన్‌పై బాలీవుడ్ ప్రముఖులు ‘ఖాన్ త్రయం’లతో పాటు పలువురు కనీసం స్పందించలేదు. సరిగ్గా ఇదే విషయంపైన స్పందిస్తూ బాలీవుడ్ ప్రముఖులు మౌనంగా ఎందుకున్నారు? అంటూ ప్రశ్నించారు. అంతేకాదు.. కొన్ని తీవ్రమైన పదాలు వాడటంతో, ఆ వ్యాఖ్యలు కొందరి మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. మరోవైపు మే-14న ఎంఐఎం జాతీయ ప్రతినిధి వారిస్ పఠాన్.. శర్మిష్ఠ వీడియోను పంచుకుంటూ ఇది ఇస్లాం మతాన్ని అవమానించేలా ఉందని మండిపడ్డారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర హోం మంత్రులను ట్యాగ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సారీ చెప్పినా.. జడ్జి తీవ్ర వ్యాఖ్యలు!
ఈ అభియోగాల నేపథ్యంలో తీవ్ర విమర్శలు రావడంతో ఆమె సోషల్ మీడియా వేదికగా ‘ నా భావనలు అన్నీ వ్యక్తిగతం. ఎవ్వరినీ బాధించాలనే ఉద్దేశం నాకు లేదు. ఎవరికైనా బాధపెట్టి ఉంటే క్షమించండి’ అని క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదం ఏమాత్రం చల్లారలేదు. ఓ వైపు అరెస్ట్ చేయాలనే డిమాండ్ పెరగడం, మరోవైపు విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో చివరికి మే-31న కోలకతా పోలీసులు పనోలిని గుర్గావ్‌లోని నివాసంలో అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అంతకు మునుపు నోటీసులు ఇవ్వాలని పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వీలుకాలేదు. ఇక చేసేదేమీ లేక కోర్టు వారెంట్ తీసుకుని మరీ శరిష్ఠను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు మీడియాకు వివరించారు. అరెస్ట్ తర్వాత అలీపూర్ కోర్టులో హాజరుపరచగా, జూన్-13 వరకు రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా కోర్టులో ప్రభుత్వ న్యాయవాది సౌరిన్ ఘోషాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లా విద్యార్థిని అయినప్పటికీ ఇలా మాట్లాడటం ఎంతవరకు సబబు? ఆమెపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఉన్నందను అరెస్ట్, విచారణ అవసరం అని ఘోషాల్ వ్యాఖ్యానించారు. యూనివర్శిటీ వీసీ సైతం ‘యూనివర్శిటీ కోడ్ ఆఫ్ కండక్ట్’ ప్రకారం తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
Read Also- Opal Suchata: ప్రామిస్ ప్రభాస్ సినిమా చూస్తా.. మిస్ వరల్డ్ చెప్పిన మూవీ ఏంటో తెలుసా?
పవన్ ఎందుకొచ్చినట్లు?
ఈ అరెస్టుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ‘ దైవదూషణ ఎవరు చేసినా ఖండించాల్సిందే. లౌకికవాదం రెండువైపులా ఉండాలి. సెక్యులరిజం అనేది కొంతమందికి మాత్రమే కవచం కాదు. ఇదే సమయంలో మరికొంత మందికి ఖడ్గం కూడా కాదు. శర్మిష్ఠ పనోలి అప్పట్లో చేసిన వ్యాఖ్యలు కొంతమందికి బాధ కలిగించి ఉండొచ్చు కానీ తప్పును అంగీకరించారు. వీడియోను డిలీట్ చేయడమే కాకుండా క్షమాపణలు కూడా చెప్పారు. అయినా పోలీసులు చర్యలు చేపట్టడం ఎంతవరకు సబబు? టీఏంసీ ఎంపీలు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు, హిందువుల మనోభావాలు గాయపడినప్పుడు ఎందుకు చర్యలు చేపట్టలేదు. అప్పుడు వారు క్షమాపణలు ఎందుకు చెప్పలేదు? దైవదూషణలను ఎప్పుడూ ఖండించాలి. లౌకికవాద స్ఫూర్తి ఇరువైపులా ఉండాలి’ అని ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు శర్మిష్ఠను విడుదల చేయాలని నెదర్లాండ్స్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ కూడా సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.
Read Also- Vijayashanti: రాములమ్మకు మంత్రి పదవి ఫిక్స్.. ఏరికోరి మరీ ఎందుకో?
సోషల్ మీడియా వర్సెస్ చట్టం!
ఈ ఘటనతో సోషల్ మీడియాలో వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఎంతవరకూ పరిమితం కావాలి? అనేదానిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఓ వైపు భావప్రకటన స్వేచ్ఛకు మద్దతు పలుకుతూనే, మరోవైపు మతపరమైన సామరస్యాన్ని కాపాడే బాధ్యత అంటూ భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఈ రెండింటి మధ్య సమతౌల్యం వందకు వెయ్యి శాతం అవసరం అనే సందేశాన్ని ఈ సంఘటన గుర్తు చేస్తుందని న్యాయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు.. రాష్ట్ర ప్రభుత్వంపై సైతం పెద్ద ఎత్తునే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ప్రశ్నిస్తూ, పోలీసుల తీరును ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున నెటిజన్లు మండిపడుతున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే బంగ్లాదేశ్‌లో హిందూ సన్యాసి చిన్నోయ్ దాస్‌ను అరెస్ట్ చేసిన సంఘటనను గుర్తు చేస్తూ.. నాడు అక్కడ.. నేడు ఇక్కడ శరిష్ఠ అరెస్ట్ అంటూ పోలుస్తున్నారు. ప్రస్తుతం ఎక్స్ వేదిగా #IStandwithSharmishta, #ReleaseSharmistha, #FreeSharmishta అనే హ్యాష్ టాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రంలోని మోదీ.. రాష్ట్రంలోని మమతా సర్కార్‌లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి మరి.
Read Also- Viral Video: అమ్మో జర్రుంటే సచ్చిపోతుంటిని రా.. గూస్‌బమ్స్ తెప్పించే వీడియో!
During Operation Sindoor, Sharmistha, a law student, spoke out, her words regrettable and hurtful to some. She owned her mistake, deleted the video and apologized. The WB Police swiftly acted, taking action against Sharmistha.
But what about the deep, searing pain inflicted… pic.twitter.com/YBotf34YYe
— Pawan Kalyan (@PawanKalyan) May 31, 2025