Viral Video
Viral

Viral Video: అమ్మో జర్రుంటే సచ్చిపోతుంటిని రా.. గూస్‌బమ్స్ తెప్పించే వీడియో!

Viral Video: అవును.. ఈ వీడియో చూసిన తర్వాత ‘అమ్మో.. జర్రుంటే సచ్చిపోతుండే రా’ అనే మాట మీ నోట కూడా ఆటోమాటిక్‌గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ రేంజిలో ఉందీ వీడియో (Viral Video). ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే విషయంపై ఫుల్ క్లారిటీ లేదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) ఎక్కడ చూసినా ఈ వీడియోనే కనిపిస్తున్నది. జనాలంతా ఈ వీడియోను చూసి తెగ వైరల్ చేసేస్తున్నారు. ఇక కామెంట్స్ అంటారా బాబోయ్.. లెక్కలేనన్ని వచ్చేస్తున్నాయ్. ఇందులోనే పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.. వీడియో చూసి తీరాల్సిందే..

వామ్మో.. చూశారా!
ముగ్గురు ఫ్రెండ్స్ బైక్‌పై ఎంచక్కా ఎంజాయ్ చేద్దామని వెళ్తుండగా ఇంతలోనే షాకింగ్ ఘటన జరిగింది. బ్రిడ్జ్ దాటాల్సి ఉంటుంది. అయితే అటుగా వ్యాను వస్తుంటుంది. వ్యాన్‌ను ఢీ కొంటామని భయపడ్డారో లేకుంటే సరిగ్గా బైక్ నడిపే కుర్రాడికి నడపడం రాదో కానీ ఊహించని సీన్ జరిగిపోతుంది. ఓ రేంజిలో స్పీడ్‌తో బైక్ వెళ్లి కాలువలో పడిపోతుంది. బైక్‌పై ఉన్న ముగ్గురిలో చివర కూర్చున్న కుర్రాడు తప్ప.. మిగిలిన ఇద్దరూ బైక్‌తో పాటు అందులో పడిపోయారు. అయితే మరో కుర్రాడు మాత్రం బ్రిడ్జ్‌కు ఉన్న సపోర్టు రాడ్డు పట్టుకొని, కిందున్న తీగల తన్నుకొని క్షేమంగా బయటపడ్డాడు. గుండెలు జారిపోయినంతలా ఫీలై ‘దేవుడా’ అని మొక్కుకున్నాడు. ఈ వీడియో చూసిన వాళ్లంతా బతికి బట్టకట్టాడని అనుకుంటున్నారు. కానీ, ఆ పిల్లాడు మాత్రం హమ్మయ్యా ‘నా ఫోన్ సేఫ్’ అన్నట్లుగా ఫీలవుతుండటం గమనార్హం. ఇదే ఈ వీడియోలో అసలు సిసలైన ట్విస్ట్. అయితే మిగిలిన ఇద్దరి కుర్రాళ్ల పరిస్థితేంటన్నది పైనున్న దేవుడికే ఎరుక. ఈ వీడియో జస్ట్ నవ్వుకోవడానికే ఇలా చేశారో.. లేకుంటే అనుకోకుండా జరిగిన ఘటనో తెలియట్లేదు కానీ ఇప్పుడిదే నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Great Escape

ఎన్ని.. నక్కల తోకలు తొక్కాడో!
ఈ వీడియో చూసిన జనాలు చాలా వరకు షాకవుతుండగా.. ఒకటికి నాలుగైదు సార్లు చూసిన తర్వాతే అసలు విషయం అర్థమవుతోంది. నిజానికి ఇది సీరియస్, లైఫ్ అండ్ డెత్ ఇష్యూ అయినప్పటికీ ఒకట్రెండు సార్లు వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు అంతే. దీనికి తోడు మ్యూజిక్ కూడా నవ్వులు పూయించేలా ఉన్నది. ఇక కామెంట్స్ చూశారా? అబ్బో నవ్వు ఆపుకోలేరు అంతే.. ఆ రేంజిలో ఉన్నాయ్. ‘ చిత్ర గుప్తుడు వాటర్ సిప్ చేసే లోపు.. బ్రో ఎస్కేప్.. ఎన్ని నక్కల తోక తొక్కాడో…’ అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం హమ్మయ్యా.. ‘బ్రో, ఫోన్, స్లిప్పర్స్, అద్దాలన్నీ సేఫ్’ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వామ్మో.. ‘ఇంతవరకూ ఇలాంటి వీడియో చూడలేదు.. భవిష్యత్తులో కూడా చూడను బాబోయ్’ (నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్) అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ‘గ్రేటెస్ట్ ఎస్కేప్ ఆఫ్ ది సెంచరీ.. ఆయన గట్టెక్కడంతో పాటు ఫోన్‌ను కూడా కాపాడుకున్నాడు.. ఎంతైనా ఫోనే ముఖ్యం కదా?’ అని సిల్లీగా కూడా కామెంట్స్ చేస్తున్న వాళ్లు ఉన్నారు. వీడెవడో పనికట్టుకుని మరీ ఆ ఇద్దరినీ తోసేశాడు.. ‘పాపం ఇలాంటి మిత్రులు కూడా ఉంటారు తస్మాత్ జాగ్రత్త’ అని కొందరు నెటిజన్లు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఈ వీడియోను 1.9 మిలియన్స్ మంది చూడగా, ట్రెండింగ్‌లో ఉంది.

 

ఇదిగో వీడియో..

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు