Meenakshi Chaudhary : శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. గురువారం వేకువజాము సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా..
ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీనాక్షి చౌదరిని చూసేందుకు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. అనంతరం మీనాక్షి చౌదరి మీడియాతో మాట్లాడుతూ.
Also read: Gold Rate Today : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన గోల్డ్ రేట్స్..
తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుమల మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుందని తెలిపారు. నాగ చైతన్య, నవీన్ పోలిశెట్టి లతో సినిమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. మరికొన్ని చిత్రాలు త్వరలో ప్రకటిస్తానని తెలియజేశారు.