లైఫ్‌స్టైల్

Ugadi 2025: ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్.. వీరికి గుడ్ టైమ్.. మీ రాశి ఎందులో ఉంది?

Ugadi 2025: జ్యోతిష్య నిపుణులు గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా రాశి ఫలాల గురించి చెబుతుంటారు. 12 రాశులు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యమైన విషయాలను పరిగణనలోకి తీసుకొని ఏయే రాశి వారికి రోజు సానుకూలంగా ఉంటుందో లేక ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అంచనా వేస్తుంటారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. 2025 మార్చి 30వ తేదీ ఉగాది పండగను జరుపుకోనున్నారు. అయితే, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాశి ఫలాలు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయం 2 వ్యయం 14
రాజపూజ్యాలు 5 అవమానాలు 7

మేష వారికి కొత్త ఏడాది ప్రతి కూలంగా ఉంటుంది. కాబట్టి, పని చేసిన బాగా లోచించి చేయండి. ముఖ్యంగా, స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఇచ్చి మోసపోకండి. కొన్ని ఎదురుదెబ్బలు తగులుతాయి. అయిన కూడా కలిసి వస్తుంది. ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది. స్టాక్ మార్కెట్లో మనీ పెట్టె వారికి మంచి లాభాలొస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయం 11 వ్యయం 5
రాజపూజ్యాలు 1 అవమానాలు 3

వృషభ రాశి వారికి కొత్త సమస్యలు వస్తాయి. మీరు వివాహం చేసుకోవాలనుకుంటారు. కానీ, ఆ కల నెరవేరదు. మీ కలల రాణి ఈ ఏడాదిలో కనిపిస్తుంది. చూడగానే ఆమెతో ప్రేమలో పడతారు. కానీ, కొన్ని కారణాల వలన విడిపోతారు. వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయం 14 వ్యయం 2
రాజపూజ్యాలు 4 అవమానాలు 3

మిథున రాశి వారికి  కొత్త ఏడాది సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఆరు నెలలు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం 8 వ్యయం 2
రాజపూజ్యాలు 7 అవమానాలు 3

కర్కాటక రాశి ఉగాది నుంచి ఆదాయ పరంగా అనేక లాభాలు పొందుతారు. ఈ సమయంలో మొదలు పెట్టె పనులు పూర్తి చేస్తారు.  మీరు అంతక ముందు కొన్న భూములకు రేట్లు పెరుగుతాయి. అలాగే,  మీ ఆస్తి పెరిగే అవకాశం ఉంది. మీరు కొత్త ఇల్లు కూడా కొనుగోలు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆదాయం 11 వ్యయం 11
రాజపూజ్యాలు 3 అవమానాలు 6

సింహ రాశి వారికి ఉగాది తర్వాత స్లో స్లో గా ఉంటుంది.  మీరు మొదలు పెట్టిన పనులు మధ్యలోనే ఆగిపోవచ్చు. దీని వలన మీరు ప్రశాంతతకు దూరం అవుతారు. మూడు నెలల తర్వాత, మీరు ఆర్థిక పరమైన రంగాల్లో అద్భుతమైన విజయాలను మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆదాయం 14 వ్యయం 2
రాజపూజ్యాలు 6 అవమానాలు 6

కన్య రాశి వారికి కొత్త ఏడాది కలిసి వస్తుంది.  ఆర్ధిక  సమస్యలన్నీ తొలగి పోతాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా   పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టె వారికి డబ్బు కొరత అస్సలు ఉండదు. కొత్త ఇల్లు కొనాలనే మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులతో సఖ్యత కారణంగా మీ ఆదాయం పెరుగుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయం 11 వ్యయం 5
రాజపూజ్యాలు 2 అవమానాలు 2

తులా రాశి వారికి కొత్త ఏడాది ప్రారంభం బాగా కలిసి వస్తుంది. ఒక్కసారిగా మొత్తం మారిపోతాయి.  ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా ఇట్టే తొలగిపోతాయి. వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతం పెరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆదాయం 2 వ్యయం 14
రాజపూజ్యాలు 5 అవమానాలు 3

వృశ్చిక రాశి వారికి కొత్త ఏడాదిలో ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం లభిస్తుంది. పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి, రెండు సార్లు ఆలోచించుకుని పెట్టండి.. లేదంటే పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. మీరు ఈ రోజు ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. దాని వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది. అలాగే, ఈ ఏడాది మద్యానికి దూరంగా ఉండటం  మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయం 5 వ్యయం
రాజపూజ్యాలు 1 అవమానాలు 5

ధనుస్సు  రాశి వారికి ఈ ఏడాది కష్టంగా ఉంటుంది .  పాత వివాదాల వలన గొడవలు పెరిగే అవకాశం ఉంది. మీ పిల్లలు మీరు చేసే పనుల్లో సాయం చేస్తారు.  ఆరు నెలలు మీరు ఏ పనులు కూడా సరిగా చేయలేరు. మీ మనసులో కొంత ఆందోళనకరంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామికి, మీకు గొడవలు జరిగే అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆదాయం 8 వ్యయం 14
రాజపూజ్యాలు 4 అవమానాలు 5

మకర రాశి వారికి ఈ ఏడాది ప్రారంభం కలిసి వస్తుంది. ఆరోగ్య సమస్యల విషయంలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు  గిఫ్ట్ ని ఇచ్చి మిమ్మల్ని  సర్‌ప్రైజ్ చేయోచ్చు. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలుంటే, అది ఈ రోజుతో ముగుస్తాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఆదాయం 8 వ్యయం 14
రాజపూజ్యాలు 3 అవమానాలు 5

కుంభ రాశి వారి మీద ఈ ఏడాది ఏలి నాటి శని ప్రభావం తప్పక చూపిస్తుంది. దీని వలన భార్య భర్తలు విడిపోయే అవకాశం ఉంది. తరచూ మీకు, మీ కుటుంబ సభ్యులకు గొడవలు జరుగుతుంటాయి. మీ పాత స్నేహితులను కలుసుకుని మీ బాధలు షేర్ చేసుకుంటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం 5 వ్యయం 5
రాజపూజ్యాలు 3 అవమానాలు 11

మీన రాశి వారికి ఈ ఏడాది  ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. దీని వలన ప్రతి సారి  చిరాకు పడుతుంటారు. అంతక ముందు దాచిన ధనం మీ అవసరాలకు  ఉపయోగపడుతుంది. మీ నిర్లక్ష్యం వల్ల వ్యాపారాల్లో నష్టాలు చూస్తారు.  మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. లేదంటే వారి వలన చాలా కోల్పోతారు.

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్