Yellamma Glimpse: బలగం వేణు ‘ఎల్లమ్మ’ గ్లింప్స్ చూశారా..
Ellamma-Glimpse
ఎంటర్‌టైన్‌మెంట్

Yellamma Glimpse : పూనకాలు తెప్పిస్తున్న‘ఎల్లమ్మ’ గ్లింప్స్.. డీఎస్పీని చూస్తే గూస్‌బంప్సే..

Yellamma Glimpse: ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (DSP) ఇప్పుడు నటుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ‘బలగం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు యెల్దండి ‘ఎల్లమ్మ’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో దేవి శ్రీ ప్రసాద్ ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఇందులో దేవి శ్రీ ప్రసాద్ ‘పార్షి’ అనే పాత్రలో కనిపించనున్నారు. వీడియోలో చూపించిన విజువల్స్, ముఖ్యంగా గొర్రెలు, ప్రకృతి నేపథ్యం, దేవి శ్రీ ప్రసాద్ రగ్గడ్ లుక్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. వర్షంలో సాగే సన్నివేశాలు గ్లింప్స్ చివరలో చూపించిన ఇంటెన్స్ షాట్స్ సినిమా ఎంత ఎమోషనల్‌గా ఉండబోతుందో సూచిస్తున్నాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దేవి శ్రీ ప్రసాద్, నటుడిగా ఈ చిత్రంతో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read also-Shambala OTT Release: ఆది ‘శంబాల’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్‌లో కొన్నాళ్లుగా వినిపిస్తున్న పేరు ‘ఎల్లమ్మ’ (Yellamma). ‘బలగం’ (Balagam) సినిమాతో ఓ సామాన్యమైన కథను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన దర్శకుడు వేణు యెల్దండి (Venu Yeldandi), తన రెండో ప్రయత్నంగా ఎల్లమ్మను తెరకెక్కిస్తున్నారు. చాలా కాలంగా ఈ సినిమా గురించి రకరకాల చర్చలు నడుస్తున్నప్పటికీ, ఎట్టకేలకు ఈ సంక్రాంతి పండుగ వేళ మేకర్స్ ఒక బిగ్ అప్‌డేట్‌తో ముందుకు వచ్చారు. ఈ సినిమాలో అనౌన్స్ చేసినప్పటి నుంచి హీరో ఎవరనే విషయంపై ఇండస్ట్రీలో పెద్ద యుద్ధమే నడిచింది. నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ చివరికి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఫిక్స్ అయ్యారు. ఇది దేవి శ్రీ ప్రసాద్ (DSP) హీరోగా వెండితెర అరంగేట్రం చేస్తున్న మొదటి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకున్నాయి.

Read also-Naveen Polishetty: ‘అనగనగా ఒక రాజు’ మొదటి రోజు ఎంత వసూలు చేశాడంటే?.. రికార్డ్ బ్రేక్..

గ్లిప్స్ చూస్తుంటే..

విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే.. బలగం వేణు ఏదో పెద్ద ప్లాన్ తోనే ఈ సారి రంగంలోకి దిగుతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పటి వరకూ సంగీత దర్శకుడిగా ఉన్న దేవీ శ్రీ ప్రసాద్ ను ఈ సినిమాలో డిఫరెండ్ గా చూపించబోతున్నారు.  అసలు ఈ గ్లింప్ మొదలవడంతోనే సంగీతం పూనకాలు తెప్పిస్తుంది. మన సాంప్రదాయాలు మూలాల్లోంచి కథ రాసుకున్నారు వేణు. మనం ప్రతి రోజు చూసేవాటి చుట్టూనే మొత్తం తిరుగుతుంది. పేరులోనే చెప్పేశారు ఎల్లమ్మ అని అంటే రూట్స్ మొత్తం చాలా లోతుగా ఉండబోతున్నాయని అనుకోవచ్చు. పొట్టేలు, వేపాకు, గజ్జెలు డప్పు, మట్టి.. ఇవన్నీ చూస్తుంటే టాలీవుడ్ నుంచి కాంతార లాంటి స్టోరీ ఒకటి రాబోతున్నట్లుగా అంచనా వేయవచ్చు. మ్యూజిక్ తో అయితే దేవీ శ్రీ పూనకాలే తెప్పించారు. ఇదంతా చూస్తుంటే.. టాలీవుడ్ రేంజ్ మరింత పెరుగనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలుసు సినిమాలు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఇది కూడా అదే స్థాయిలో ఉండబోతున్నట్లు గా తెలుస్తోంది. నిర్మాణ పరంగా కూడా సినిమా బలంగానే కనిపిస్తుంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే మరిన్నిరోజులు ఆగాల్సిందే.

Just In

01

Vijay Deverakonda: అమ్మకు ప్రామిస్ చేశా.. నెక్ట్స్ సంక్రాంతికి పక్కాగా..!

Drug Awareness: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: గట్ల మహేందర్ రెడ్డి

The Raja Saab: ముగ్గురు భామలతో రాజా సాబ్.. పోస్టర్ అదిరిపోలా..!

Mahabubabad News: మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీలో.. ప్రభుత్వం పై బీసీ నేతలు గుర్రు..!

Temple Theft Gang: ఆలయాలే ఆ గ్యాంగ్ టార్గెట్.. వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ..!