Drug Awareness: మాదక ద్రవ్యాలతో యువత దూరంగా ఉండాలని, వాటిని సేవించడం వల్ల యువత జీవితాలు నాశనమవుతాయని టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి(Gatla Mahender Reddy) అన్నారు. బుధవారం రాత్రి తన సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి స్థానిక ఓసి క్లబ్ దగ్గర కొంతమంది యువకులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్దులు, యువత మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచించారు. ప్రతీ ఒక్కరు మద్యం, గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు.
Also Read: Municipal Elections: మున్సిపాలిటీలకు రిజర్వేషన్ల ఖరారు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించారు
తెలంగాణ పోలీస్ చేపట్టిన “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా వాహనదారులను ఉద్దేశించి ద్విచక్ర వాహనం నడిపే ప్రతీ ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, ఫోర్ వీలర్ నడిపే వారు తప్పకుండా సీటు బెల్ట్ ధరించాలని వాహనదారులనకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ పాటించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. అంతేకాకుండా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని వివరించారు. తమ కాలనీలు ప్రశాంత వాతావరణంలో ఉండాలంటే అక్రమ వ్యాపారాలు, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపేందుకు యువత తమ వంతు సహకారం అందించాలని చెప్పారు. దేశ భవిష్యత్తు మొత్తం యువత చేతుల్లోనే ఉందని యువత ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. జీవితంలో లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా ప్రయత్నాలు సాగించాలని సూచించారు. దేశ భద్రత కోసం అసాంఘిక శక్తులపై దృష్టి సారించి వారి సమాచారాన్ని పోలీసులకు అందించాలని తెలిపారు.
Also Read: Naveen Polishetty: ‘అనగనగా ఒక రాజు’ మొదటి రోజు ఎంత వసూలు చేశాడంటే?.. రికార్డ్ బ్రేక్..

