Vijay Deverakonda: టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మేనరిజంతో ‘రౌడీ’ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). సినిమాల్లో ఎంత అగ్రెసివ్‌గా కనిపిస్తారో, నిజజీవితంలో తన కుటుంబానికి, ముఖ్యంగా తన తల్లికి ఆయన ఇచ్చే గౌరవం అంత సాఫ్ట్‌గా ఉంటుంది. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా విజయ్ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ‘మ్యాటర్ చిన్నదైనా.. అందులో ఉన్న ఎమోషన్ మాత్రం కొండంత’ అని విజయ్ మరోసారి నిరూపించారు. విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన మొదటి ఫోటోలో దేవరకొండ ఫ్యామిలీ (Vijay Deverakonda Family) అంతా పక్కా ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోతున్నారు. తెల్లటి పంచె కట్టులో విజయ్, ఆనంద్ దేవరకొండ, వారి తండ్రి గోవర్ధన్ రావు గంభీరంగా కనిపిస్తుంటే, ఆకుపచ్చని పట్టుచీరలో వారి తల్లి మాధవి నిండైన పండుగ కళతో వెలిగిపోతున్నారు. వీరితో పాటు ఆ ఫ్రేమ్‌లో వారి ముద్దుల పెట్ డాగ్స్ కూడా ఉండటం విశేషం. ఈ ఫోటో చూస్తుంటే సంక్రాంతి (Sankranthi Wishes)కి ఒక కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజీలా అనిపిస్తోంది.
Also Read- The Raja Saab: ముగ్గురు భామలతో రాజా సాబ్.. పోస్టర్ అదిరిపోలా..!
అమ్మే సర్వస్వం
మరో ఫోటోలో విజయ్ తన తల్లిని ఎంతో ప్రేమగా హగ్ చేసుకుని ఉండటం అందరి మనసులను గెలుచుకుంటోంది. పండుగ పూట పొయ్యి మీద పాలు పొంగుతున్న వేళ, ఆ పొగ మధ్యలో అమ్మ ఒడిలో తలవాల్చిన విజయ్‌ని చూస్తుంటే.. కోట్లు సంపాదించినా, పాన్ ఇండియా స్టార్ అయినా.. అమ్మ దగ్గర ఎప్పుడూ చిన్నపిల్లాడే అనిపిస్తోంది. ఆ ఫోటోలో వారిద్దరి ముఖాల్లో ఉన్న చిరునవ్వు ఈ పండుగకు అసలైన అర్థాన్ని ఇస్తోంది. ఇంటి ముంగిట వేసిన ముగ్గులు, బొమ్మల కొలువు, సంప్రదాయబద్ధంగా వండుతున్న వంటలు.. ఇవన్నీ చూస్తుంటే విజయ్ తన మూలాలను ఎప్పటికీ మర్చిపోరని అర్థమవుతోంది. విజయ్ షేర్ చేసిన ఫొటోలు, వీడియోలతో ఆయనపై, ఆయన కుటుంబంపై మరింత రెస్పెక్ట్ పెరుగుతోంది. ఇంటిలో ఆడపిల్ల ఉండాలని అంతా అనుకుంటారు. కానీ, విజయ్ పేరేంట్స్ వారిద్దరి మగపిల్లలని పెంచిన తీరు చూస్తే.. ఎవరైనా మురిసిపోవాల్సిందే.
Also Read- Yellamma Glimpse : పూనకాలు తెప్పిస్తున్న‘ఎల్లమ్మ’ గ్లింప్స్.. డీఎస్పీని చూస్తే గూస్‌బంప్సే..
అమ్మకు రౌడీ ప్రామిస్
ఈ సంక్రాంతి సంబరాల ఫోటోలను షేర్ చేస్తూ విజయ్ తన ఫ్యాన్స్‌కు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. ‘‘ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా కుటుంబం తరపున మీ కుటుంబ సభ్యులందరికీ పండుగ శుభాకాంక్షలు. వచ్చే ఏడాది పండుగను పల్లెటూరిలో సెలబ్రేట్ చేసుకుంటామని అమ్మకు ప్రామిస్ చేశాను’’ అంటూ రాసుకొచ్చారు. సాధారణంగా సెలబ్రిటీలు పండుగ వచ్చిందంటే విదేశాల్లో వెకేషన్స్ ప్లాన్ చేస్తారు. కానీ విజయ్ మాత్రం తన అమ్మ కోరిక మేరకు, మన సంస్కృతికి అద్దం పట్టేలా పల్లెటూరి వాతావరణంలో వచ్చే సంక్రాంతిని జరుపుకోవాలని నిర్ణయించుకోవడం గొప్ప విషయం. ఈ ఒక్క ప్రామిస్‌తో విజయ్ తన ఫ్యాన్స్ మనసుల్లో మరోసారి హీరో అయిపోయారు. ఇక ఇదే అదనుగా.. నెక్ట్స్ ఇయర్ రష్మిక వదినతో కలిసి ఈ పండుగను జరుపుకుంటానని అమ్మకు ప్రామిస్ చేసుంటావ్‌లే అన్న.. అని విజయ్‌పై సరదాగా ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తుండటం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

