Arya 2 Re-release: ప్రస్తుతం, తెలుగు సినీ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అప్పట్లో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఇప్పుడు హిట్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో జూ.ఎన్టీఆర్ , పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ , మహేష్ బాబు, రామ్ చరణ్ , మూవీస్ మళ్లీ విడుదలయ్యాయి. తాజాగా, మరో చిత్రం రీరిలీజ్ కు సిద్ధమవుతోంది. తొలిసారి థియేటర్లలో కలెక్షన్స్ కూడా రాని సినిమాలు ఇప్పుడు రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు కలెక్ట్ చేశాయి.
Also Read : BRS Leader Meet Rammohan Naidu: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో బీఆర్ఎస్ ఎంపీలు భేటి.. ఎందుకంటే?
ఇటీవలే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ చిత్రాన్ని కూడా రీ రిలీజ్ చేశారు. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు. అదే ‘ఆర్య2’. ఈ మూవీలో హీరో అల్లు అర్జున్, హీరోయిన్ కాజల్ అగర్వాల్, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులోని ‘ఉప్పెనంత ఈ ప్రేమకి.. గుప్పెడంత గుండె ఏమిటో’ అనే పాట సినిమాకే హైలెట్‌గా నిలిచింది.
దీనిలోని మరో పాట అప్పట్లోబాగా ట్రెండ్ అయింది. ‘మై లవ్ ఈజ్ గాన్’ అనే పాటకి ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. 2009లో థియేటర్లలో సందడీ చేసిన ఈ మూవీ ఇప్పుడు మరోసారి రిలీజ్ కు సిద్ధమైంది. ఈ నెల 5వ తేదీన ఈ ఆర్య 2 మూవీ థియేటర్లలో రీ రిలీజ్ అవ్వనుంది. ఈ క్రమంలోనే ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.
Also Read: SVSN Varma To Join YCP: పవన్ కు ఊహించని దెబ్బ.. వైసీపీలోకి వర్మ.. పిఠాపురంలో ఏం జరుగుతోంది?