Actress Mohini: చాలా కాలంగా ఆమె వెండి తెరకు దూరంగా ఉన్నప్పటికీ, మోహిని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మెరిసింది. అక్కడ ఆమె తన జీవితంలోని వివిధ ముఖ్యమైన అంశాలను చర్చించింది. అందులో ఆమె డిప్రెషన్ తో పోరాడి ఎలా గెలిచింది? ఆత్మహత్య వరకు వెళ్లిన మోహిని ఎలా బతికిందో ఇక్కడ తెలుసుకుందాం..
తాను చాలాసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించానని వెల్లడించిన నటి, ఒక జ్యోతిష్కుడు తనపై ఎవరో ఎదో చేశారని చెప్పాడని పేర్కొంది. తన భర్త బంధువులలో ఒకరు తనపై చేసిన మాయాజాలమే ఆ సమయంలో తాను ఎదుర్కొన్న అనేక సమస్యలకు కారణమని ఆరోపించింది. తాను దానిని ఎలా అధిగమించగలిగానో గుర్తుచేసుకుంటూ, మోహిని సంచలన కామెంట్స్ చేసింది.
Also Read: Telangana Tourism: హైదరాబాద్‌లో 12 వారసత్వ కట్టడాల అభివృద్ధికి ప్రణాళికలు.. అవి ఏమిటంటే..?
” ఆ సమయంలో, ఎవరో నాపై చేతబడి చేశారని ఒక జ్యోతిష్కుడు నాకు చెప్పాడు. మొదట, నేను దానిని చూసి నవ్వాను. కానీ తర్వాత, నేను ఎందుకు ఆత్మహత్యకు ధైర్యం చేశానో నేను కూడా ఆశ్చర్యపోయాను. ఆ అవగాహన తర్వాతే నేను దాని నుండి బయటపడటానికి ప్రయత్నించడం మొదలు పెట్టాను. నాకు నిజంగా బలాన్ని ఇచ్చింది నా యేసు ” బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మోహిని 2006లో క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. ” ఆ రోజు నేను చావు వరకు వెళ్లి వచ్చా.. నాకన్నీ ఉన్నప్పటికీ ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయని నేను ఆలోచిస్తూనే ఉన్నాను. నా భర్త బంధువు అయిన ఒక మహిళ చేసిన చేతబడి వల్ల నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. యేసుపై నాకున్న విశ్వాసమే నన్ను కాపాడింది” అంటూ ఆమె షాకింగ్ నిజాలు చెప్పింది.
ఈ ముద్దుగుమ్మ తన కెరీర్‌లో, మోహిని శివాజీ గణేషన్, నందమూరి బాలకృష్ణ, చిరంజీవి, మోహన్‌లాల్, మమ్ముట్టి, శివరాజ్‌కుమార్, విజయకాంత్, విష్ణువర్ధన్, విక్రమ్, రవిచంద్రన్, శరత్‌కుమార్, మోహన్ బాబు, సురేష్ గోపి వంటి దిగ్గజ తారలతో కలిసి పనిచేశారు. ఆమె డాన్సర్ (1991) అనే హిందీ చిత్రంలో కూడా నటించింది, ఇందులో ఆమె అక్షయ్ కుమార్ సరసన ప్రధాన పాత్ర పోషించింది.