Tummala Nageswara Rao (iMAGE credit; swetcha reporter)
తెలంగాణ

Tummala Nageswara Rao: కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టండి.. రామ్మోహన్ నాయుడుకు మంత్రి విజ్ఞప్తి

Tummala Nageswara Rao: కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టండని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ స్థాపనపై చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) విజ్ఞప్తి చేశారు.  డిల్లీలో రామ్మోహన్ నాయుడు ను కలిసి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం పై చర్చించారు. కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదన చేయగానే స్పందించి ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం సివిల్ ఏవియేషన్ తరపున ఫీజు బులిటీ సర్వే చేసినందుకు రాoమోహన్ నాయుడుకు మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు.

ఫీజుబులిటీ సర్వే లో ప్రతిపాదిత స్థలం ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం అనువుగా లేనందున మరో స్థలం రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదన చేశామని అక్కడ త్వరగా ఫీజుబులిటీ సర్వే చేసి, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ను మంత్రి తుమ్మల కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దక్షిణ అయోధ్య గా ప్రసిద్ధి చెందిన భద్రాచలం రామాలయం దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలిపారు.

 Alsob Read: JubileeHills Survey: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై సర్వే.. ఆ సామాజికవర్గానిదే కీలక పాత్ర!

జాతికి వెలుగులు అందించే సింగరేణి గనులు.. హెవీ వాటర్ ప్లాంట్..ఐటీసీ

బీ. పీ.ఎల్ సంస్థలతో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అరుదైన ఖనిజ నిక్షేపాలతో అటవీ ప్రాంతంతో ఎకో టూరిజం కు కేరాఫ్ గా నిలుస్తుందని చెప్పారు. దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెం లో ఏర్పాటు చేశామని వివరించారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం వల్ల పారిశ్రామికంగా విద్యా పరంగా, టూరిజం పరంగా జిల్లా ఎంతో పురోగతి చెందే అవకాశం ఉందని, దేశ విదేశాల నుంచి భద్రాద్రి రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం లో చొరవ తీసుకోవాలని రాంమోహన్ నాయుడు కు మంత్రి తుమ్మల సవివరంగా తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చేపట్టాల్సిన పనులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.  రామ్మోహన్ నాయుడు చొరవతో కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కల

సాకారం కానుందని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం 

ఢిల్లీ పర్యటన లో భాగంగా కేంద్ర భారీ పారిశ్రమల, ఉక్కు మంత్రి హెచ్. డి కుమారస్వామిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. బయ్యారం లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి మంత్రి తుమ్మల తీసుకెళ్లారు. ఈ అంశంపై త్వరలోనే సమావేశం అవుదామని కేంద్ర మంత్రి కుమార స్వామి తెలిపారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

 Also Read: Yashaswini Reddy: గాంధీజీ లక్ష విగ్రహాల ప్రదర్శన పోస్టర్‌ ఆవిష్కరణ

Just In

01

Allu Arjun: జక్కన్న, నీల్, వంగా.. బన్నీ లైనప్ చూస్తుంటే మెంటలొచ్చేస్తుంది! ఇక తగ్గే దే లే..

JubileeHills bypoll: జూబ్లీహిల్స్‌లో పవన్ చరిష్మా పనిచేస్తుందా?

Cold Wave Weather: తగ్గుతున్న ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న చలి

Ganja Smuggling: ఆలయం సమీపంలో గంజాయి విక్రయాలు.. ముగ్గురి అరెస్ట్​

Hesham Abdul Wahab: ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రానికి నాకు స్ఫూర్తినిచ్చిన అంశమదే!