Shocking Crime: చున్నీతో కట్టుకున్నోడికి ఉరి బిగించి చంపింది
Shocking Crime (imagecredit:swetcha)
క్రైమ్, హైదరాబాద్

Shocking Crime: చున్నీతో కట్టుకున్నోడికి ఉరి బిగించి చంపి.. చిన్న పిల్లాడితో డ్రామా చేయబోయింది..?

Shocking Crime: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియునితోపాటు మరో వ్యక్తితో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ మహిళ. ఆ తరువాత సహజ మరణంగా చిత్రీకరించింది. అయితే, మృతుని ఒంటిపై గాయాలు కనిపించటంతో అనుమానించిన పోలీసులు కేసులోని మిస్టరీని ఛేధించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

ప్లే స్కూల్​ నడుపుతూ..

బోడుప్పల్ ప్రాంతంలోని ఈస్ట్ బృందావన్​ కాలనీ వాస్తవ్యులైన పూర్ణిమ (36), అశోక్​ (45)లు భార్యాభర్తలు. వీరికి పదకొండేళ్ల కుమారుడు ఉన్నాడు. అశోక్​ శ్రీనిధి యూనివర్సిటీలో లాజిస్టిక్ మేనేజర్​ గా ఉద్యోగం చేస్తుండగా పూర్ణిమ ఇంటి వద్దనే ప్లే స్కూల్​ నడుపుతోంది. ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లాకు చెంది ప్రస్తుతం బోడుప్పల్​ లో ఉంటున్న పటేల్ మహేశ్​ (22) గతంలో ఈస్ట్ బృందావన్​ కాలనీలో ఉండేవాడు. ఆ సమయంలో అతనికి పూర్ణిమతో పరిచయం అయ్యింది. ఇది ఇరువురి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలియటంతో అశోక్ పలుమార్లు పూర్ణిమతో గొడవ పడ్డాడు. మహేశ్​ ను కలవటం మానుకోవాలని చెప్పాడు. దాంతో పూర్ణిమ తన ప్రియుడు మహేశ్​ తో కలిసి భర్తను అంతం చేయాలని పథకం వేసింది.

Also Read: GHMC: డీలిమిటేషన్‌ పై ముగిసిన స్టడీ.. సర్కారుకు నివేదిక సమర్పించిన జీహెచ్ఎంసీ!

చున్నీలతో ఉరి బిగించి హత్య

ఈ క్రమంలో మహేశ్​ తన స్నేహితుడైన భూక్యా సాయికుమార్​ (22)ను కుట్రలో భాగస్వామిగా చేశాడు. చేసిన కుట్ర ప్రకారం ఈనెల 11న మహేశ్​, భూక్యా సాయికుమార్​ లు సాయంత్రం సమయంలో అశోక్​ ఇంటికి చేరుకున్నాడు. ఉద్యోగం ముగించుకుని 6.15గంటల ప్రాంతంలో అశోక్ ఇంటికి రాగానే అతనిపై దాడి చేశారు. పూర్ణిమ కదలకుండా అశోక్(Ashock) రెండు కాళ్లు పట్టుకోగా మహేశ్(Mahesh), భూక్యా సాయికుమార్(sai Kumar)​ కలిసి చున్నీలతో ఉరి బిగించి హత్య చేశారు. అనంతరం అశోక్ మృతదేహంపై ఉన్న దుస్తులను మార్చేశారు. మృతదేహాన్ని ఇంటి మొదటి అంతస్తులో ఉన్న బాత్రూంలోకి చేర్చారు. అనంతరం మహేశ్​, భూక్యా సాయికుమార్​ లు హత్యకు ఉపయోగించిన చున్నీలతో మహేశ్​, భూక్యా సాయికుమార్ అక్కడి నుంచి ఉడాయించారు. ఆ తరువాత పూర్ణిమ తన కొడుకుతో మీ నాన్నను పిలుచుకురా అని చెప్పి మొదటి అంతస్తుకు పంపించింది. పైకి వెళ్లి వచ్చిన బాలుడు బాత్రూంలో అశోక్​ కింద పడి ఉన్నాడని చెప్పగా పూర్ణిత ఇరుగుపొరుగుతో అదే విషయాన్ని తెలిపింది.

అశోక్ మరణంపై అనుమానాలు

అనంతరం అశోక్ మృతదేహాన్ని మల్కాజిగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే అశోక్ చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించటంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకు వచ్చింది. అశోక్ మరణంపై అనుమానాలు వ్యక్తం కావటంతో ఇరుగుపొరుగువారు మేడపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో సీఐ గోవిందరెడ్డి, ఎస్​ఐలు నర్సింగరావు, ఉదయ భాస్కర్ తోపాటు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. పూర్ణిమను విచారించగా తన భర్త గుండెపోటుతో చనిపోయాడని చెప్పింది. మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని చెప్పింది. అయితే, అశోక్ గొంతు, చెంపలపై కొట్టినట్టుగా గాయాలు కనిపించటంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం జరిపిన ఫోరెన్సిక్​ వైద్యులు ఉరి బిగించటం వల్లనే అశోక్​ చనిపోయినట్టుగా నిర్ధారించారు. ఈ క్రమంలో పూర్ణిమను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించింది. ఈ క్రమంలో పోలీసులు ఆమెతోపాటు మహేశ్, భూక్యాసాయికుమార్ లను కూడా అరెస్ట్​ చేశారు.

Also Read: Seethakka: ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకునే బాధ్యత అందరిపై ఉంది : మంత్రి సీతక్క

Just In

01

Crime News: ఆర్టీసీ సిబ్బందిని టార్గెట్ చేస్తున్న మోస్ట్ వాంటెడ్​ క్రిమినల్ అరెస్ట్..!

Tanuja Interview: దానికోసం ఎప్పుడూ పనిచేయలేదు.. బిగ్‌బాస్ రన్నర్ తనూజ..

Gold Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!

BJP Telangana: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ హైకోర్టులో పిటిషన్..!

Vivo Smartphones 2026: 2026లో వివో ప్రభంజనం.. మార్కెట్‌లోకి రాబోతున్న.. టాప్ మెుబైల్స్ ఇవే!