Seethakka: ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకునే బాధ్యత అందరిపై ఉన్నదని మంత్రి సీతక్క తెలిపారు. ఆమె గాంధీభవన్ లో సీడబ్ల్యూసీ సభ్యులు కొప్పుల రాజుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలని గ్రామాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు. ఈ నెల 27 ,28 తేదీల్లో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. వలసలు తగ్గించేందుకు, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం జాతీయ ఉపాధి హామీ చట్టం తెచ్చారన్నారు. ఉపాధిహామీ చట్టానికి బీజేపీ ఊరేసిందన్నారు.ఉపాధి హామీ చట్టానికి గాంధీ పేరు తీసేసి గాంధీని మరోసారి బీజేపీ హత్య చేసిందన్నారు.
Also Read: Seethakka: గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలి : మంత్రి సీతక్క
ఊర్లో పని హక్కు లేకుండా బీజేపీ చేస్తోంది
ఉపాధి హామీ చట్టాన్ని తీసేసి మళ్ళీ వెట్టి చాకిరి విధానాన్ని తేవాలని బీజేపీ ఆలోచిస్తోందన్నారు. ఉపాధి హామీ పథకంలో కేంద్రం ప్రతి సంవత్సరం పని దినాలను తగ్గిస్తూ వస్తోందన్నారు. సొంత ఊర్లో పని హక్కు లేకుండా బీజేపీ చేస్తోందని మండిపడ్డారు. అదానీ, అంబానీ వంటి కార్పోరేట్ల మైనింగ్ తవ్వకాలకు కూలీలను సరఫరా చేసేందుకు ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తున్నారన్నారు. ఉపాధి చట్టాన్ని రద్దు చేస్తే గ్రామాల్లో కూలీలకు పని ఉండదన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం లో గాంధీ పేరు తొలగింపు బాధాకరమని సీడబ్ల్యూసీ సభ్యులు కొప్పుల రాజు తెలిపారు. పేద ప్రజలకు ఆసరా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అన్నారు. దాదాపుగా 20 సంవత్సరాల క్రితం 2006 ఫిబ్రవరి 2 న అనంతపురం లోమహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం మొదలెట్టారన్నారు.
Also Read: Seethakka: గ్రామపంచాయతీ యువ నాయకత్వంతో గ్రామాభివృద్ధి జరగడం ఖాయం : మంత్రి ధనసరి సీతక్క

