Khammam Crime ( image credit: swetcha reporter)
క్రైమ్, నార్త్ తెలంగాణ

Khammam Crime: ఖమ్మం జిల్లా ఖమ్మం దారుణ హత్య.. కుటంబ కలహలే కారణమా?

Khammam Crime: ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెంలో  ఉదయాన్నే గ్రామం లో హత్య (Khammam Crime:0 జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తగూడెం గ్రామానికి చెందిన మోటపోతుల వెంకన్న కుమార్తె అఖిలను ఇదే గ్రామానికి చెందిన గునిగంటి మహేష్ కు గత మూడు సంవత్సరాల క్రితం ఇచ్చి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేశారు. గత సంవత్సరం నుంచి మహేష్–అఖిలకు మనస్పర్థల కారణంగా తరుచు గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్దమనుషులు పంచాయతీ చేసిన ఫలితం కనిపించలేదు. దీంతో మహేష్ విడాకులకు అప్లై చేసి కోర్టు నుంచి విడాకులు తీసుకున్నట్లు తెలిసింది.

Also Read:khammam crime: భర్తను చంపేందుకు సుపారీ.. అడ్వాన్స్ కూడా.. ఎంతంటే! 

కల్లుగీసే కత్తులతో దాడి

పిల్లనిచ్చిన మామ వెంకన్న ఉదయం తన కుమార్తె అఖిలను కొడుకు మనోజ్, బావమరిది మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం దేవునిసంకీస గ్రామానికి చెందిన యల్ది వెంకన్నలు మహేష్ ఇంటికి తీసుకవచ్చారు. మా అమ్మాయిని భార్యగా అంగీకరించాలని అడగడంతో అక్కడ స్వల్ప వాగ్వివాదం జరిగింది. అక్కడి నుంచి వెనుదిరిగిన పై వ్యక్తులు ఇంటికి వెళ్లి మోటపోతుల వెంకన్న, మహేష్, యల్ది వెంకన్నలు రెండు ద్వీచక్రవాహనాల మీద కర్రలు, కల్లుగీసే కత్తులతో వచ్చి మహేష్ పై దాడి చేశారు.

అప్పటికే మహేష్ కడుపులో, వెనుక నుంచి కత్తితో పోడిచారు. రక్తపుమడుగులో కొట్టుకుంటున్న కుమారున్ని చూసి తల్లి నాగమణి(50) అడ్డుపోగా ఆమె పోట్టలో కూడ పోడవడంతో అక్కడిక్కడే మరణించింది. స్థానికులు సహాయంలో మహేష్ ను చికిత్స నిమిత్తం హస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ హెచ్ వో సీఐ ఎం. రాజు సంఘటన స్థలానికి చెరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ హస్పిటల్ కు తరలించి విచారణ చేపడుతున్నారు.

నిందితులు పోలీసుల ఎదుట లోంగుబాటు..?

హత్య చేసిన నిందితులైన మొటపోతుల వెంకన్న, మనోజ్, యల్ది వెంకన్నలు రూరల్ పోలీస్ స్టేషన్లో లోంగిపోయినట్లు తెలిసింది. కావాలనే పక్కా ప్లాన్ తో హత్య చేసి పోలీసుల ఎదుట లోంగిపోయారని గ్రామస్థులు అరోపిస్తున్నారు.

Also Read: Khammam Crime: సీపీఎం నేత గొంతు కోసి చంపిన దుండగులు.. ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన

Just In

01

Android Vs iPhone: ఐఫోన్ యూజర్లు షాక్‌కు గురయ్యే విషయాన్ని వెల్లడించిన గూగుల్

MLA Sanjay Kumar: హృదయ విదారక ఘటన.. డబ్బులు లేక తల్లిని మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లిన కొడుకు

Bigg Boss Telugu 9: టార్గెట్ తనూజ.. నెక్ట్స్ వీక్ వెళ్లిపోయేది తనేనా?

Land Auction: ప్రారంభ ధర ఎకరం రూ.99 కోట్లు.. హైదరాబాద్‌లో మరోసారి భూవేలానికి వేళాయె!

Sai Srineeth: మెరిసిన ముత్యం.. వెయిట్ లిఫ్టింగ్‌లో జమ్మికుంట విద్యార్థికి రెండవ స్థానం