Vi New Plans: భారతదేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ Vodafone Idea (VI) ప్రస్తుతం రూ. 200 లోపు మూడు బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను మన ముందుకు తీసుకొచ్చింది. ధరల్లో చిన్న తేడా ఉన్నప్పటికీ, ఈ ప్లాన్‌లు తక్కువ ఖర్చుతో మొబైల్ సేవలు వినియోగించాలనుకునే యూజర్లను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడ్డాయి. రూ.179, రూ.189, రూ.199 ధరల్లో లభించే ఈ ప్లాన్‌లలో ఏది వినియోగదారుకు ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
Vodafone Idea రూ.200 లోపు మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లు..
ఈ మూడు ప్లాన్‌లలో వ్యాలిడిటీ (Validity ) పరంగా చూస్తే రూ.199 ప్లాన్ 28 రోజుల సేవలను అందిస్తుంది. అయితే, రూ.179 ప్లాన్ 24 రోజుల validity, రూ.189 ప్లాన్ 26 రోజుల validity ఇస్తాయి. రోజువారీ ఖర్చుగా గణిస్తే వరుసగా రూ.7.11, రూ. 7.27, రూ. 7.46 అవుతుంది. ఈ తేడా చాలా స్వల్పం కావడంతో ఖర్చు పరంగా పెద్ద నిర్ణయం అవసరం లేదు. అసలు తేడా బెనిఫిట్స్ లోనే ఉంది.
డేటా పరంగా చూస్తే రూ.199 ప్లాన్‌లో 2GB మొత్తం డేటా లభిస్తుంది. అయితే రూ.179 , రూ.189 ప్లాన్‌లు కేవలం 1GB డేటానే అందిస్తాయి. మూడింటిలోనూ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, మొత్తం 300 SMSలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి డేటా పరంగా ఎక్కువ ప్రయోజనం కోరుకునేవారికి రూ.199 ప్లాన్ స్పష్టంగా మెరుగైన ఎంపిక అవుతుంది.
వినియోగదారులు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి మరింత డేటా, ఎక్కువ validity కోరుకుంటే, Vi యొక్క రూ.218 ప్లాన్ మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది. ఈ ప్లాన్ ఒక నెల పూర్తి validityతో వస్తూ 3GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 300 SMSలను అందిస్తుంది. రూ. 200 లోనే మంచి ప్రయోజనాలు కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.
మొత్తం రూ.199 ప్లాన్ validity, డేటా, ధర పరంగా మూడు ప్లాన్‌లలో అత్యుత్తమగా కనిపిస్తోంది. అయితే, పూర్తి నెల వ్యాలిడిటీ validity కోరుకునే యూజర్లకు రూ.218 ప్లాన్ బెటర్. వినియోగదారుల అవసరాల ఆధారంగా ఈ ప్లాన్‌లు మంచి బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్‌లుగా నిలుస్తున్నాయి.

