Panchayat Elections: మహబూబాబాద్ జిల్లాలో జరిగే తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల (Panchayat Elections)కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం (4110) పోలింగ్ స్టేషన్లు కాగా, మొదటి విడత సర్పంచ్ (146), వార్డు మెంబర్ (1072) స్థానాలకు గురువారం ఎన్నికలు జరుగుతాయని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. మొదటి, రెండవ, మూడవ విడతలలో 43 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, 789 వార్డ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మొదటి విడత గూడూరు, మహబూబాబాద్, నెల్లికుదురు, కేసముద్రం, ఇనుగుర్తిలో ఎన్నికలకు సంబంధించి 200 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రానికి 1 పి.ఓ 1 ఓపిఓ బృందంగా ఉంటారు.
మొదటి విడతలో 1753 కేటాయించినట్లు
201 నుండి 400 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రానికి 1 పి.ఓ 2 ఓపిఓ లు, 401 నుండి 650 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రానికి 1 పి.ఓ 3 ఓపిఓ లు పోలింగ్ సిబ్బంది ఉంటారని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. అదేవిధంగా 20% అదనంగా మొదటి విడతలో (1621) పి.ఓ లు, (1853) ఓపిఓ లు విధులు నిర్వహిస్తారు. (10) మoది మైక్రో అబ్జర్వర్ల తో పాటు ఐదుగురు రిజర్వు అబ్జర్వర్లు ఎన్నికల ప్రక్రియను గమనిస్తారు. (122) సీసీ కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. బ్యాలెట్ బాక్సులు మొదటి విడతలో 1753 కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. మొదటి విడతలోని అయిదు మండలాలకు 49 రూట్ అధికారులు, 15 జోనల్ అధికారులను నియమించారు.
Also Read: Panchayat Elections: రాష్ట్రంలో నేడు తొలి విడత ప్రచారం సమాప్తం.. ఇక మిగిలింది..!
పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల వరకు ప్రచారం
మొదటి విడతలు జరిగే ఐదు మండలాలు గూడూరు మహబూబాబాద్ నెల్లికుదురు కేసముద్రం ఇనుగుర్తిలో సర్పంచ్, వార్డు మెంబర్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మొత్తం 1000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు ఎస్పీ డాక్టర్ పి శబరిష్ తెలిపారు. ఇందులో ఐదుగురు డిఎస్పీలు, 16 మంది సీఐలు, 60 మంది ఎస్సైలతో పాటు మొత్తం వెయ్యి మంది పోలీసులతో పందోబస్తు నిర్వహించనున్నట్లు ఎస్పీ శబరిష్ తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఉదయం నుంచి పోలీసులు తమ స్థానాల్లో చేరి ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేయడానికి అన్ని రకాల సౌకర్యాలు, భద్రత చర్యలను చేపట్టనున్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల వరకు ప్రచారం, పార్టీ గుర్తులు, గుంపులుగా గుమి కూడకుండా పూర్తిగా నిషేధించినట్లు చెప్పారు. అవసరం లేకుండా తిరిగి వ్యక్తులను పర్యవేక్షిస్తూ అనుమానస్పద వ్యక్తులు కనబడితే వెంటనే పోలీసులు స్పందించి అదుపులోకి తీసుకుంటారని వివరించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
సెన్సిటివ్, హై సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లలో పికెటింగ్
సెన్సిటివ్, హై సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లలో పోలీసులు అదనపు పీకేటింగ్, వీడియో రికార్డింగ్ చేస్తారని తెలిపారు. పోలింగ్ స్టేషన్లలో ప్రచార సామాగ్రి, మొబైల్ ఫోన్లు, పార్టీ గుర్తులు తీసుకురావడం అనుమతించడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు అమల్లో ఉంచేలా చర్యలు చేపట్టామన్నారు.
Also Read: Panchayat Elections: ఎన్నికల నిర్వహణకు ప్రతిష్ట బందోబస్తు.. 112 సమస్యాత్మక గ్రామాలలో ప్రత్యేక నిఘా!

