New Business Survey: ఇ-కామర్స్ వినియోగంపై ప్రభుత్వం ఫోకస్
Business Survey ( Image Source: Twitter)
జాతీయం

New Business Survey: చిన్న వ్యాపారాల డిజిటల్ మార్పుపై ప్రభుత్వం దృష్టి.. 2026 నుంచి ఈ-కామర్స్, సోషల్ మీడియా డేటా ట్రాక్

New Business Survey: భారత ప్రభుత్వం ప్రథమంగా చిన్న వ్యాపారాల్లో డిజిటల్ వినియోగాన్ని సిస్టమాటిక్‌గా కొలవడానికి సిద్ధమవుతోంది. కొత్త ఫ్రేమ్‌వర్క్ తో ఈ వ్యాపారాల ఈ-కామర్స్ కార్యకలాపాలు, సోషల్ మీడియా వినియోగం, UPI చెల్లింపులు, డిజిటల్ అకౌంట్స్ నిర్వహణ వంటి అంశాలను ట్రాక్ చేయనుంది. ఇది అన్‌ఇన్‌కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ యొక్క వార్షిక సర్వే (Annual Survey of Unincorporated Sector Enterprises) (ASUSE)లో, 2026 జనవరి నుంచి ప్రారంభం కానుంది.

Also Read: Panchayat Elections: గ్రామపంచాయతీ ఎన్నికలకు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్!

MoSPI విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఈ సర్వే దేశంలోని ఇన్ ఫార్మల్ వ్యాపారాల సాంకేతిక, లావాదేవీలను సిస్టమాటిక్‌గా లెక్కిస్తాయి. ఇవి భారతంలో వ్యవసాయేతర ఆర్థిక కార్యకలాపాల్లో పెద్ద భాగం కాబట్టి, ప్రభుత్వానికి ఈ డేటా అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. పాత సర్వేలలో ఎక్కువగా ఉద్యోగం, స్థిర ఆస్తులు, ఆపరేషనల్ మెట్రిక్స్ నే దృష్టిలో పెట్టేవి, డిజిటల్ వినియోగంపై పరిమిత ప్రశ్నలు మాత్రమే ఉండేవి.

Also Read: Srilatha Shobhan Reddy: సీఎం దృష్టికి ఓయూలోని బస్తీల సమస్యలు.. రూ. 20 కోట్లు కేటాయించాలని డిప్యూటీ మేయర్ దంపతుల వినతి

ఈ సర్వేలో డిజిటల్ చెల్లింపుల విభాగం విస్తరించబడింది. UPI, PoS డివైసులు, ఇతర ఎలక్ట్రానిక్ చెల్లింపులు ఉపయోగిస్తున్నారా, ఆన్‌లైన్ ఆర్డర్లు వస్తున్నాయా, డిజిటల్ అకౌంట్స్ నిర్వహిస్తున్నారా, యాప్-ఆధారిత మార్కెట్‌ప్లేస్‌లను ఉపయోగిస్తున్నారా అనే అంశాలను రికార్డ్ చేస్తారు. ఈ డేటా తో చిన్న వ్యాపారాలు ఫార్మల్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఎలా చేరుకుంటున్నాయో ప్రభుత్వం స్పష్టంగా తెలుస్తోంది.

త్వరలో రాబోతున్న కొత్త  ఫ్రేమ్‌వర్క్ విధానం 

కొత్త ASUSE ఫ్రేమ్‌వర్క్ వ్యాపార నిర్మాణాన్ని మరింత లోతుగా కొలుస్తుంది. వ్యాపారాలు యాజమాన్య రకం, GST రిజిస్ట్రేషన్ స్థితి, శాశ్వత కార్యకలాపాలు, వర్కింగ్ క్యాపిటల్ మూలాలు, ఇన్‌పుట్ అవుట్ ఫుట్ వివరాలు అందించాల్సి ఉంటుంది.

Also Read: Ponguleti Srinivas Reddy: ప్రతి కుటుంబానికి సొంతిల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

గత జూలై–సెప్టెంబర్ 2025 త్రైమాసికంలో, రెండు వ్యాపారాల్లో ఒక్క వ్యాపారం ఆన్‌లైన్ టూల్స్‌ను ఉపయోగిస్తున్నట్టు రికార్డ్ అయ్యింది. ఇది సంవత్సర ప్రారంభంలో ఉన్న 34% కంటే పెరిగింది. 2025 నుండి MoSPI కూడా ఇన్ఫార్మల్ వ్యాపారాలపై త్రైమాసిక డేటా విడుదల చేస్తోంది, దీని వల్ల ఈ రంగాన్ని త్వరితంగా, సమయోచితంగా విశ్లేషించవచ్చు.

Just In

01

KTR: పోగు బంధంతో ఫోన్ బంధం.. సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి..!

DekhLenge Saala Released: ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘దేఖ్ లెంగే సాలా’ వచ్చేసింది.. పవర్ స్టార్ స్వాగ్ పీక్స్!

Uttam Kumar Reddy: పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

Bigg Boss9 Telugu: ఈ వారం ఎలిమినేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. ఒకరు కన్ఫామ్!

Sarpanch Elections: సర్పంచ్ బరిలో నిండు గర్భిణీ.. బాండ్ పేపర్ పై హామీలతో ప్రచారం..!