TDP Slams GHMC: జీహెచ్ఎంసీ వార్డుల పెంపు కుట్ర
TDP Slams GHMC ( image credit: swtcha reporter)
హైదరాబాద్

TDP Slams GHMC: జీహెచ్ఎంసీ వార్డుల పెంపు కుట్ర.. హైదరాబాద్‌ను విడదీసే ప్రయత్నం.. టీడీపీ నేతలు తీవ్ర విమర్శ!

TDP Slams GHMC: జీహెచ్ఎంసీ పరిధిలోని మున్సిపల్ వార్డు సంఖ్యను 150 నుంచి 300 వరకు పెంచటం కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల రాజకీయ కుట్రలో భాగమేనని హైదరాబాద్ సిటీ తెలుగు తమ్ముళ్లు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షులు సాయిబాబా, సీనియర్ నాయకులు నల్లెల్ల కిశోర్‌లు తీవ్ర స్థాయిలో విమర్శించారు.  టీడీపీ సిటీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ వార్డులు పునర్విభజించి ఎంఐఎంకు అధికారం కట్టబెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నదని దుయ్యబట్టారు.

Also Read: TDP And BJP: కమలంతో జోడీకి టీడీపీ ప్రయత్నాలు.. వర్కవుట్ అయ్యేనా?

27 పట్టణ స్థానిక సంస్థల విలీనం

వార్డుల డీలిమిటేషన్‌కు ముందు రాష్ట్ర ప్రభుత్వం సిటీలోని ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీల నేతలను సంప్రదించకుండానే పునర్విభజనకు సంబంధించి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటాన్ని వారు తప్పుబట్టారు. అలాగే గ్రేటర్‌కు బయట, ఔటర్ రింగ్ రోడ్డుకు లోపలనున్న 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం కూడా ఆగమేఘాలపై ఎంతో హడావుడి చేసిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సిటీలో ఒక్క సీటు రాకపోవటంతో ప్రజాభిప్రాయాన్ని, తీర్పును పక్కనబెట్టి తన అభిప్రాయం, రాజకీయ లబ్దే ప్రధానమన్నట్టు కాంగ్రెస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. మతకలహాల్లేకుండా సమైఖ్య నగరంగా పేరుగాంచిన హైదరాబాద్ నగరంలో మతకలహాలను రగిలించి మంటలు మండించాలనే కుట్రతోనే కాంగ్రెస్ ఏకపక్షంగా పునర్విభజన చేపట్టిందని మండిపడ్డారు.

Also Read: TDP Vs YSRCP: సభ్య సమాజం తలదించుకునేలా ఎందుకీ మాటలు?

Just In

01

KTR: పోగు బంధంతో ఫోన్ బంధం.. సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి..!

DekhLenge Saala Released: ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘దేఖ్ లెంగే సాలా’ వచ్చేసింది.. పవర్ స్టార్ స్వాగ్ పీక్స్!

Uttam Kumar Reddy: పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

Bigg Boss9 Telugu: ఈ వారం ఎలిమినేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. ఒకరు కన్ఫామ్!

Sarpanch Elections: సర్పంచ్ బరిలో నిండు గర్భిణీ.. బాండ్ పేపర్ పై హామీలతో ప్రచారం..!