Jio Annual Plans: 2025 చివరి నెలలోకి వచ్చి రాగానే.. చాలా మంది జియో యూజర్లు వచ్చే ఏడాది మొత్తానికి ఒకేసారి రీఛార్జ్ చేసుకుని టెన్షన్ లేకుండా ఉండాలని చూస్తున్నారు. నెలనెలా రీచార్జ్ చేసుకోవడం ఇష్టంలేని వారికి జియో ప్రస్తుతం రెండు బలమైన వార్షిక ప్లాన్‌లను అందిస్తోంది. ఈ రెండు ప్లాన్‌లు 365 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజువారీ డేటా, OTT యాక్సెస్, 5G సర్వీసులు వంటి మంచి బెనిఫిట్స్‌తో వస్తున్నాయి. 2026 చివరి వరకు కూడా వ్యాలిడిటీ పొడిగించుకునేలా ఈ ప్లాన్‌లు ఎలా పని చేస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
జియో రూ.3,999 వార్షిక ప్లాన్
డేటా ఎక్కువగా వాడేవాళ్ల కోసం డిజైన్ చేసిన ప్లాన్ ఇది. 365 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2.5GB డేటా ఇస్తుంది. అంటే, వర్క్ ఫ్రం హోం కోసం, సోషల్ మీడియా కోసం.. ఇలా ఏది చేసినా సరిపోతుంది. ఈ ప్లాన్ స్పెషల్ ఏమిటంటే ఫ్యాన్ కోడ్ తో పాటు మరో రెండు OTT యాప్‌ల యాక్సెస్ కూడా ఇస్తోంది. స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ రెండూ ఇష్టపడేవాళ్లకు ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. అదనంగా, అన్‌లిమిటెడ్ 5G కూడా అందుబాటులో ఉంటుంది.
జియో రూ.3,599 వార్షిక ప్లాన్
ఈ ప్లాన్ కూడా రోజుకు 2.5GB డేటా, 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అయితే, ఇక్కడ డిజిటల్ బెనిఫిట్స్ మాత్రం కొంచెం భిన్నంగా ఉంటాయి. ఈ ప్లాన్‌లో ఫ్యాన్ కోడ్ స్థానంలో ప్రో గూగుల్ జెమిని యాక్సెస్ ఇస్తారు. ఇది సాధారణంగా సుమారు రూ.3,500 విలువ చేసే సర్వీస్. AI టూల్స్ ఉపయోగించి చదువు, పని, క్రియేటివ్ ప్రాజెక్ట్స్ చేస్తే ఇది మంచి విలువ ఇస్తుంది. రెండు OTT యాప్‌లు, అన్‌లిమిటెడ్ 5G వంటి ప్రయోజనాలు ఈ ప్లాన్‌లో కూడా ఉంటాయి. అంటే, స్ట్రీమింగ్‌తో పాటు ప్రొడక్టివిటీ టూల్స్ కూడా కావాలనుకునే యూజర్లకు ఇది బెస్ట్ ఆప్షన్.
ఎప్పుడు రీఛార్జ్ చేస్తే బెటర్?
మీరు 2026 మొత్తం సంవత్సరాన్ని ఈ ప్లాన్‌తో కవర్ కావాలని చేయాలనుకుంటే, డిసెంబర్ 31, 2025న రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. ఆ విధంగా 2026లో ఒక్క రోజుకూడా గ్యాప్ లేకుండా ప్లాన్ కొనసాగుతుంది. 2025 చివరి నెలల్లో ఎప్పుడైనా రీఛార్జ్ చేసినా వ్యాలిడిటీ సులభంగా 2026 చివరి వరకు ఉంటుంది.

