Illegal Registrations: అక్రమాలకు ఉన్నతాధికారులు మద్దతు
–ప్రభుత్వంపై చెడ్డపేరు తెచ్చేందుకు కంకణం
–అనేక ఫిర్యాదులు చేసిన పట్టించుకోని వైనం
–సీఎం, మంత్రులైన కనికరించండీ
–నిబంధనలకు విరుద్దంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్
–చేతులు తడపకుంటే నిషేధిత పేరుతో ముప్పుతిప్పలు
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: ప్రజా పాలనలో అవినీతికి అవకాశం లేదని ప్రభుత్వ పెద్దలు చేబుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా విధులు నిర్వహించే అధికారులపై వేటు తప్పదని ఉన్నతాధికారులు, మంత్రులు పదే పదే ప్రజలకు వివరిస్తున్నారు. రంగారెడ్డి(Rangareddy) జిల్లాలో సాధ్యమైనంత వరకు ఫిర్యాదులోచ్చిన, ఆరోపణలు వచ్చిన సమయానుకూలంగా అధికారులు స్పందిస్తున్నారు. కానీ సబ్ రిజిస్ట్రార్(Sub-Registrar) కార్యాలయాల్లో అధికారులు చేసే తతంగాలపై ఫిర్యాదులు వస్తే పట్టించుకోకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఉన్న 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అదే పరిస్థితి కొనసాగుతుంది. సబ్ రిజిస్ట్రార్ నిబంధనలకు విరుద్దంగా డాక్యుమెంట్లు చేస్తూ రియల్ వ్యాపారులను ప్రోత్సహిస్తున్నారు. అనుకూలంగా ఉంటే ఒక విధంగా లేకపోతే మరోవిధంగా సబ్ రిజిస్ట్రార్లు వ్యవహారిస్తున్నట్లు చర్చ సాగుతుంది. ఫిర్యాదులు చేస్తే విచారణ చేసేందుకు ఉన్నతాధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు. సీఎం, మంత్రులకు ఫిర్యాదు చేస్తే వివరణ ఇవ్వాలని ఉన్నతాధికారులను అడిగితే తప్పుదోవ పట్టిస్తున్నట్లు బాధితులు వివరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓ సబ్ రిజిస్ట్రార్ పై ఆరోపణలు వస్తున్న ఉన్నతాదికారులు ఉపేక్షిస్తున్నారు.
నన్నే ఏమీ చేయలేరంటూ ధైర్యంగా అక్రమాలు
జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్లు ఎంతో ధైర్యంగా అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారు. ఫిర్యాదులు చేస్తే ఉన్నతాధికారులను మేనేజ్ చేస్తామని బహిర్గతంగా సబ్ రిజిస్ట్రార్లు చేప్పుకుంటున్నారు. వీరు చేసే తప్పులను కప్పిపుచ్చేందుకు కొంతమంది ఉన్నతాధికారులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు పనిచేస్తారు. అందులో ఒకరు అర్హత లేకున్న అవకాశమున్న చోట సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసేలా ఉన్నతాధికారుల ప్రోత్సహాం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సబ్ రిజిస్ట్రార్ ఉన్నతధాకారుల కనుసన్నంలో పనిచేయడంతో ఫిర్యాదులు వచ్చిన పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇప్పటికే అనేక మార్లు సబ్ రిజిస్ట్రార్ పై ఫిర్యాదులు చేసిన ఫలితం లేదు. సబ్ రిజిస్ట్రార్ పై హైకోర్టు న్యాయవాది, భూ పరిరక్షణ సమితి సభ్యులు ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు, సీఎం, మంత్రులకు ఫిర్యాదు చేశారు. అయితే సీఎం, మంత్రులు సంబంధిత అధికారులకు విచారణ చేసి నివేదిక పంపాలని ఆదేశాలిచ్చారు. కానీ ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆ ఉన్నతాధికారి చేతిలో ఉన్నందున్న తప్పుడు నివేదికలు ఇస్తున్నట్లు సమాచారం.
Also Read: Tamil Nadu: తమిళనాడు ప్రభుత్వ స్కూల్‌లో దారుణం.. జూనియర్ల దాడిలో ఇంటర్ విద్యార్థి మృతి
అనుకున్నట్టు ఇస్తే డాక్యుమెంట్ ముందుకు..
ఆ సబ్ రిజిస్ట్రార్ అడిగినంత ఇస్తే ఏలాంటి డాక్యుమెంట్ చేయడానికి వెనుకడగు వేయరని తెలుస్తోంది. అదే అడిగినంత నగదు దక్కకపోతే వివిధ కారణాలు చేబుతూ డాక్యుమెంట్ నిలిపివేయడం ఆలవాటైయింది. నిషేదిత జాబితాలో లేని భూమిని అడిగినంత ఇవ్వలేదని ఆ జాబితాలో చేర్చి చిత్రహింసలు పెడుతున్నట్లు మండలంలో ప్రచారం సాగుతుంది. యాచారం మండలం కురిమిద్ద గ్రామ సర్వే నెంబర్లో 332లో ఏలాంటి కోర్టు కేసులు లేవు, ఆప్లాట్లపై ఏలాంటి వివాదాలు లేవు. కానీ అడిగినంత చేయలేదనే దురుద్దేశ్యంతో నిషేదిత జాబితాలో పెట్టినట్లు స్ధానిక భూ పరిరక్షణ సమితి సభ్యులు సీఎం, మంత్రి పోంగిలేటిలకు ఫిర్యాదు చేశారు.
అక్రమ పద్దతిలో డాక్యుమెంట్ ఇలా..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్ రెవెన్యూ(Kongara Kalan Revenue) పరిధిలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్లు 31/పార్ట్, 32/పార్ట్, 33, 35, 36, 37, 38, 39/పార్ట్ లో 11 ఎకరాల 34 గుంటల భూమికి ముగ్గురు పట్టాదారులు. వీరు తమ అవసరాల కోసం రెండు ఎకరాల భూమిని నగరానికి చెందిన ఓ వ్యక్తిపై జీపీఏ(GPA) చేయడం జరిగింది. అయినప్పటికి నిబంధనలకు విరుద్దంగా రైతుల పేరుతో హెచ్ఎండీఏ(HMDA) అనుమతులు తీసుకున్నారు. అంతటితో ఆగకుండా కార్తీకేయ పేరుతో 42 ప్లాట్లు తో లేఅవుట్ చేయడం జరిగింది. ఈ ప్లాట్లు కొనుగోలు దారులకు రిజిస్ట్రేషన్లు పట్టాదారులైన రైతులు నేరుగా చేయాలి. అంతేకాకుండా నగరానికి చెందిన వ్యక్తికి చేసిన రెండు ఎకరాల భూమిని మాత్రమే జీపీఏ చేసిన పాపానికి చేసుకునే అవకావం ఉండోచ్చు. కానీ మిగిలిన 9 ఎకరాల 34 గుంటల పరిధిలోని భూమిలోని ప్లాట్లను రైతులే రిజిస్ట్రేషన్లు చేయాలి. ఈ నిబంధనలకు లోబడి సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లు చేయాలి. ఇలాంటి లోసుగులను ఎత్తిచూపకుండా రియల్ వ్యాపారులతో కుమ్మక్కై ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. వాస్తవానికి రైతులు, రియల్ వ్యాపారులు కలిసి ఓప్పందంలో భాగంగా నేరుగా రియల్ వ్యాపారులు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని అనుకోవచ్చు. కానీ ఐజీ స్టాంప్ డ్యూటీ నిబంధనల ప్రకారం వాళ్ల ఓప్పందం సబ్ రిజిస్ట్రార్ చేయోచ్చా అనేది అనుమానం. నిబందనలకు విరుద్దంగా అదనపు సంపదనకు కక్కుర్తిపడి నిబంధనలు తుంగలో తొక్కుత్తున్నారు.

