Actress Indraja: పబ్లిక్‌లో వల్గర్‌గా డ్రస్‌లు వేసే వారికి ఆ హక్కు లేదు
Indraja Kissik Talks with Varsha (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Actress Indraja: పబ్లిక్‌లో వల్గర్‌గా డ్రస్‌లు వేసుకునే వాళ్లకు ఆ మాట అనే అర్హత లేదు.. ఇంద్రజ షాకింగ్ కామెంట్స్

Actress Indraja: వర్ష హోస్ట్‌ చేస్తున్న ‘కిస్సిక్ టాక్స్ విత్ వర్ష’ (Kissik Talks With Varsha) కార్యక్రమానికి సీనియర్ నటి ఇంద్రజ (Actress Indraja) గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో.. ‘ఇప్పుడున్న జనరేషన్ కొంతమంది.. అందరూ కాదు, కొన్ని డ్రసెస్.. కొంచెం వేరేగా వేసుకుని.. ఇది నా ఇష్టం, ఇది నా స్టైల్.. ఎవరేమనుకుంటే నాకెందుకు? అని అంటూ ఉంటారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?’ అనే ప్రశ్న ఇంద్రజకు ఎదురైంది. దీనిపై ఇంద్రజ సమాధానమిస్తూ.. చాలా ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. నిజంగా ఆమె చెప్పిన మాటలు వింటే అందరూ ఫిదా అవ్వాల్సిందే. చాలా గొప్పగా ఆమె చెప్పారని నెటిజన్లు కూడా అంటుండటం విశేషం. ‘కొంచెం డీటెయిల్‌గా మాట్లాడాల్సిన సబ్జెక్ట్’ అంటూ.. ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజా జీవితంలో అనుసరించాల్సిన హద్దుల గురించి స్పష్టమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

ఆ హక్కు వాళ్లకీ ఉంటుంది

‘‘నా ఇష్టం, నేను డ్రస్ వేసుకున్నాను. నువ్వెవరు అడగడానికి, నువ్వెవరు కామెంట్ చేయడానికి.. అని అంటున్నారు కదా. ఒక డ్రస్ వేసుకుని పబ్లిక్‌లోకి తిరగడానికి లేదా, ఒక పబ్లిక్ ఫోరంలో ఫొటోలు, వీడియోలు కానీ పెట్టడానికి మీకెంత హక్కు ఉందో.. మీరు వేసుకున్న డ్రస్సు కరెక్ట్‌గా, సరిగ్గా లేనప్పుడు, అభ్యంతరకరంగా ఉన్నప్పుడు, కొంచెం వల్గర్‌గా ఉన్నప్పుడు.. దానిపై కామెంట్ చేసే హక్కు, దాని గురించి మాట్లాడే హక్కు కూడా వాళ్లకి ఉంటుంది కదా. ఒకటి ఏంటంటే.. పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలనే డెకారమ్ ఒకటి ఉంటుంది. మనం ఇంటిలో మాట్లాడినట్టు, ఫ్రెండ్స్‌తో మాట్లాడినట్టుగా.. పబ్లిక్‌లోకి వెళ్లి మాట్లాడము, మాట్లాడకూడదు. అక్కడ మనం ఒక డెకారమ్ మెయింటైన్ చేయాలి. అలాగే కాస్ట్యూమ్ విషయంలోగానీ, వేసుకునే డ్రస్ విషయంలోగానీ, ఒక కోడ్ అనేది ఉంటుంది. అలా కాకుండా.. ఇది నా ఇష్టం, ఇలానే వేసుకుంటాను.. అంత వరకు ఓకే. కానీ, నీవెవరు అడగడానికి? అని అనడానికి అక్కడ లేదు స్పేస్. ఆఖరికి మీ ఫ్యామిలీలో కూడా, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వారు ఉంటారు. ఈ డ్రస్సు బాలేదే, ఇంకో డ్రస్ వేసుకోవచ్చు కదా, ఏంటి మరీ ఇలా వేసుకున్నావని చెబుతారు. అలాంటి డిఫరెంట్ మైండ్‌సెట్ ఉన్నవాళ్లు బయట కూడా ఉంటారు.

Also Read- Bigg Boss Elimination: ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్.. ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసా?

ఛీ అనేలా డ్రస్సులు వేయకండి

నాకు ఏం అనిపిస్తుందంటే.. అంత అసభ్యకరంగా లేదా ఇంకొకరు చూసి ఛీ అనేటట్టు వేయకండి. వేసుకోవడం అంటే మీ పర్సనల్ స్పేస్‌లో మీరు ఏమైనా చేసుకోండి.. అది మీ ఇష్టం. అది ఎవరూ తప్పుబట్టడానికి లేదు. కానీ, పబ్లిక్‌లోకి వచ్చి మీరు ఒక విషయం చేస్తున్నారు అన్నప్పుడు కచ్చితంగా కామెంట్ చేస్తారు. అది తీసుకోవడానికి మీరు రెడీగా ఉంటేనే, అలాంటి డ్రస్‌లో వేసుకునే సాహసం చేయండి. అలా డ్రస్‌లు వేసుకుని నాకు కనిపించినప్పుడు కూడా నేను ఎవరికీ సలహాలు ఇవ్వను. ఎవ్వరికీ ఏం చెప్పను. నన్ను సొంత అక్కలా, అమ్మలా, ఇంటిలోని సొంత మనిషిలా చూసుకునే వారు అడిగితే మాత్రమే నేను చెబుతాను. లేకపోతే నేను నోరు విప్పను. నేను కొంత మంది డ్రస్సులు చూసి, చాలా సార్లు ఏంటి ఇలా వేసుకున్నారని అనిపించేది. ఒక్కోసారి ఎక్కడ జారి కింద పడిపోతుందో అని భయం కూడా వేస్తుంది. వేరే విధంగా కాదు కానీ, నా కళ్లు కూడా వారు వేసుకునే డ్రస్‌పైనే ఉంటాయి.

Also Read- Raj Samantha: పెళ్లి తర్వాత తొలిసారి బయటకు వచ్చిన రాజ్ నిడిమోరు.. ‘షాదీ ముబారక్ హో’ అంటున్న నెటిజన్స్..

ఆ ఫీల్ ఒక్కసారి అనుభవిస్తే..

నేను ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే.. అలాంటి కాస్ట్యూమ్‌లో కూడా వాళ్లంత కంఫర్టబుల్‌గా ఎలా ఉండగలుగుతున్నారా? అని. వాళ్లని చూసి ఎక్కడ వీళ్లు ఫాలో అవుతారో, దానిని స్ఫూర్తిగా తీసుకుని మన పిల్లలు ఎక్కడ పాడైపోతారో అనే భయమే తప్ప, వాళ్లమీద వీళ్లకి ధ్వేషమో, కోపమో వంటి వేవీ ఉండవు. ఒకరిని చూసి మళ్లీ మళ్లీ చూసేలా అందంగా ఉండాలి కానీ, అవయువాలను చూసేలా కాస్ట్యూమ్ మాత్రం ఉండకూడదు. ఈ విషయంలో సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, మిమ్మిలి చాలా మంది ఫాలో అవుతున్నారు. ఈ కాలానికి ఇలానే ఉండాలేమో, ఇలానే డ్రస్ వేసుకోవాలేమో.. అని యంగ్ జనరేషన్ మైండ్‌లో రిజిస్టర్ అయిపోయిందనుకోండి.. ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పేది ఒక్క ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లకు కూడా. పబ్లిక్ ఫోరంలో ఉన్నప్పుడు కాస్త డీసెంట్‌గా ఉండండి. మిమ్మిల్ని చూసి, చాలా డీసెంట్‌గా ఉన్నారు, రెస్పెక్టబుల్‌గా ఉన్నారని అంటే.. నిజంగా మీకు కూడా ఆ ఫీల్ చాలా బాగుంటుంది. ఆ ఫీల్ ఒక్కసారి అనుభవిస్తే.. మళ్లీ వెనక్కి వెళ్లాలనే ఆలోచన కూడా రాదు.’’ అని ఇంద్రజ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sarpanch Elections: సర్పంచ్ బరిలో నిండు గర్భిణీ.. బాండ్ పేపర్ పై హామీలతో ప్రచారం..!

KTR: బీఆర్ఎస్ వెంటే ప్రజలు.. సర్పంచ్ ఎన్నికలే నిదర్శనం.. కేటీఆర్ ధీమా

Harish Rao: ఫుట్‌బాల్ మీద ఉన్న శ్రద్ధ.. స్కూల్ విద్యార్థులపైన లేదా.. సీఎంపై హరీశ్ రావు ఫైర్

Gurram Papireddy: యువర్ హానర్ ‘గుర్రం పాపిరెడ్డి’ ట్రైలర్ వచ్చేసింది.. చూసి నవ్వుకోండి..

Event Organiser Arrest: కోల్‌కత్తాలో గందరగోళం.. మెస్సీకి సారీ చెప్పిన సీఎం.. ఈవెంట్ ఆర్గనైజర్ అరెస్ట్