Bigg Boss Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 91వ రోజైన (Bigg Boss Telugu Season 9 Day 91) ఆదివారం ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎలిమినేషన్ ఉంటుందనే విషయం తెలియంది కాదు. ఈ వారం హౌస్‌లో షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్లుగా తాజాగా వచ్చిన ప్రోమోస్ హింట్ ఇచ్చేస్తున్నాయి ఈ ప్రోమోలను గమనిస్తే.. ‘సండే ఫన్ డే’ అంటూ వచ్చిన ప్రోమోలో కింగ్ నాగ్ (King Nagarjuna) ఎంట్రీ అదిరింది. అనంతరం మ్యాథమ్యాటిక్స్‌పై ఓ స్పెషల్ వీడియోను ప్లే చేశారు. అందులో రీతూ చౌదరి మ్యాథ్స్ టాలెంట్‌ని మరోసారి చూపించి, అందరినీ ఎంటర్‌టైన్ చేశారు. ‘రీతూ.. లైఫ్‌లో లెక్కలు రాకపోయినా పర్లేదు.. ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండు’ అని నాగ్ అనగానే రీతూ థ్యాంక్స్ చెప్పింది. ఈ కామెడీ తర్వాత ‘ఒక క్లిప్ చూపిస్తాను.. అందులో రెండు సినిమాలు ఉంటాయి. అవేంటో చెప్పాలి’ అని నాగ్ ఓ గేమ్ ఆడించారు. ఒక క్లిప్ చూపించగా, కళ్యాణ్ ‘మగధీర, హృదయ కాలేయం’ అని చెప్పేశాడు. ‘మగధీర’ సినిమాలోని జోర్ సే సాంగ్‌కు సుమన్ శెట్టి, సంజన డ్యాన్స్ చేస్తున్నారు. సుమన్ డ్యాన్స్‌కు నాగ్ ఫిదా అయ్యారు.
పనిష్మెంట్స్ పట్టిక
ఫన్ మోడ్ అంటూ వచ్చిన రెండో ప్రోమోలో.. ‘ఈ హౌస్‌లో ఒక్క పనిష్మెంట్ ఎవరికి ఇవ్వాలి’ అని ఒక బోర్డు మీద కొన్ని పనిష్మెంట్స్ పట్టికను నాగ్ చూపించారు. బాల్ తీసి గ్లాస్‌లో పడేట్లు వేయాలి. గ్లాస్ పడితే.. వారు అనుకున్న కంటెస్టెంట్‌కు ఆ పనిష్మెంట్ ఉంటుంది. లేదంటే, వారే ఆ పనిష్మెంట్ అనుభవించాలని నాగ్ చెప్పారు. 6 గ్రీన్ చిల్లీస్ అని సంజన అనగానే, ఒక వేళ బాల్ గ్లాస్‌లో పడకపోతే.. నీకే ఆ పనిష్మెంట్ అనగానే.. వద్దు వద్దు అని సంజన అంటోంది. ఇమ్ము లేచి మీసాలు సార్ అని రీతూ పేరు చెప్పాడు. అంతేకాదు, బాల్ గ్లాస్‌లో వేసి, రీతూకి మీసాలు కూడా పెట్టాడు. లిప్‌స్టిక్ అని ఇమ్ము పేరుని తనూజ చెప్పింది. బాల్ వేసి ఇమ్మూకి లిప్‌స్టిక్ పెట్టింది. డిమోన్ పవన్ పేరు చెప్పి లెమన్ అని అన్నాడు సుమన్ శెట్టి. కానీ బాల్ వేయలేకపోవడంతో, ఆ లెమన్ తనే తినాల్సి వచ్చింది. ప్రైజ్ సమ్‌వన్ వన్ మినిట్ అని సంజన పేరు చెప్పాడు పవన్. కానీ బాల్ వేయలేక, సంజననే పొగిడాడు. దీనిపై నాగ్ ఓ కౌంటర్ వదిలారు.
రెండు ఫాల్స్, ఒకటి ట్రు
ఫన్ జోన్ అంటూ వచ్చిన మూడో ప్రోమోలో.. ‘ప్రతి ఒక్కరి గురించి మూడు స్టేట్‌మెంట్స్ ఉన్నాయి. ఇందులో రెండు ఫాల్స్, ఒకటి ట్రు. ఏది ట్రు స్టేట్‌మెంటో గెస్ చేసి, అది ఈ హౌస్‌లో ఎవరు చేసి ఉంటారో గెస్ చేయాలి. కరెక్ట్‌గా గెస్ చేస్తే.. అక్కడ ఫోమ్ ప్లేట్స్ ఉన్నాయి కదా.. అది వాళ్లకి కొట్టాలి. రాంగ్‌గా గెస్ చేస్తే.. మీకు మీరే కొట్టుకోవాలి’.. అని కింగ్ నాగార్జున స్టేట్‌మెంట్స్ చదువుతున్నారు. పవన్ ట్రు స్టేట్‌మెంట్ చెప్పలేక ప్లేట్ ముఖానికి కొట్టుకున్నాడు. రీతూ కూడా ఫెయిలైంది. ఇమ్ము, తనూజల మధ్య కామెడీ పండించారు నాగ్.
ఎలిమినేషన్‌లో సంజన అండ్ రీతూ
ఇక ఎవిక్షన్ డే అంటూ వచ్చిన ప్రోమోలో అసలు సిసలు ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటి వరకు టాప్ 5 కంటెస్టెంట్ అని చెప్పుకుంటున్న రీతూ ఎలిమినేషన్స్‌లో ఉన్నట్లుగా చూపించారు. ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్ పేర్లు నాగ్ చెప్పారు. ‘సంజన అండ్ రీతూ.. నేను చెప్పినప్పుడు వైర్లు కట్ చేయడం మొదలు పెట్టాలి. ఎవరు వైర్లు కట్ చేస్తున్నప్పుడు బాంబ్ బ్లాస్ట్ అవుతుందో.. వాళ్లు ఎలిమినేట్ అవుతారు’ అని నాగ్ చెబుతున్నారు. సంజన ఫస్ట్ వైర్ కట్ చేసింది. రీతూ తర్వాత వైర్ కట్ చేసింది. ఇలా వైర్లు కట్ చేయిస్తూ.. ఫైనల్‌గా వీరిలో ఒకరు కట్ చేసినప్పుడు బాంబ్ పేలినట్లుగా చూపించారు. ఎవరనేది చెప్పలేదు కానీ, యూ ఆర్ ఎలిమినేటెడ్ అని నాగ్ అన్నారు. హౌస్‌లోని వారంతా ఆశ్చర్యపోతున్నారు. మరీ ముఖ్యంగా డిమోన్ పవన్ ఎమోషనల్ అవుతున్నారు. అతని ఎమోషన్ చూస్తుంటే.. ఈ వారం రీతూ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. నిజంగా రీతూ అయితే మాత్రం.. ఇది షాకింగ్ ఎలిమినేషనే అని చెప్పుకోవాలి. సంజన మరోసారి సేవ్ అయినట్టే. అసలేం జరిగిందనేది తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

