Mandhana-Palash: పెళ్లి రద్దుపై మందానకు పలాష్ కౌంటర్ పోస్ట్
Mandana-Palash (Image source X)
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

Mandhana-Palash: రూమర్లపై ఇంత తేలికగా స్పందించడం కష్టంగా ఉంది.. మందాన ప్రకటనకు పలాష్ ముచ్చల్ కౌంటర్ పోస్ట్

Mandhana-Palash: మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ పలాష్ ముచ్చల్‌తో (Palash Muchhal) జరగాల్సిన తన వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు (Mandhana-Palash) భారత మహిళా క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ సృతి మందాన (Smriti Mandhan) ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే పలాష్ ముచ్చల్ కూడా స్పందించాడు. తనకు అత్యంత పవిత్రమైన విషయంపై నిరాధారమైన రూమర్లను జనాలు ఇంత తేలికగా స్పందించడం చూస్తుంటే చాలా కష్టంగా ఉందని వ్యాఖ్యానించాడు. జీవితంలో ముందుకు సాగాలని, పర్సనల్ రిలేషన్‌షిప్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేశాడు.

‘‘ నా జీవితంలో ఇది అత్యంత సంక్లిష్టమైన దశ, అయినప్పటికీ నా విశ్వాసాలకు కట్టుబడి హుందాగా ఎదుర్కొంటాను. ఒక సమాజంలో బతుకుతున్నాం, కాబట్టి ఎలాంటి ఆధారాలు లేని, ధృవీకరించని ప్రచారాల ఆధారంగా ఒకరిని అంచనా వేయడానికి ముందు ఒకసారి ఆలోచించడం నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. మనం మాట్లాడే మాటలు, మనకు ఎన్నటికీ అర్థంకాని విధంగా గాయపరుస్తాయి’’ అని పలాష్ ముచ్చల్ భావోద్వేగంతో స్పందించాడు.

చట్టపరమైన చర్యలు..

‘‘మనం ఈ విషయాల గురించి ఆలోచిస్తున్నప్పటికీ, ప్రపంచంలో చాలా మంది దారుణమైన ఈ పరిణామాలను ఎదుర్కొంటూనే ఉన్నారు’’ అని పలాష్ పేర్కొన్నాడు. కాగా, తప్పుడు ప్రచారం, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను వ్యాపింపజేస్తున్న వారిపై తన బృందం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ముచ్చల్ హెచ్చరించాడు. సంక్లిష్టమైన ఈ సమయంలో తనకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నాడు.

Read Also- Smriti Mandhana: సస్పెన్స్‌కు తెర.. పెళ్లిపై సంచలన ప్రకటన చేసిన స్మృతి మందాన

మందాన ప్రకటన ఇదే

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మందాన తన వ్యక్తిగత జీవితంపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ ఆదివారం కీలక ప్రకటన చేసింది. పలాష్ ముచ్చల్‌తో జరగాల్సిన తన వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. వారాల తరబడి సాగిన ఊహాగానాలు, వదంతులకు ముగింపు పలుకుతూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ ప్రకటన చేసింది. పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టుగా స్మృతి మందాన సుదీర్ఘంగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని రాసుకొచ్చింది. గత కొన్ని వారాలుగా తన జీవితంపై అనేక వదంతులు ప్రచారంలో ఉన్నాయని, తన వ్యక్తిగత విషయాలపై జరుగుతున్న ఈ ప్రచారంపై బహిరంగంగా స్పందించాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నానని, తన వివాహం రద్దు అయ్యిందని ఆమె తెలిపింది.

వ్యక్తిగతంగా తాను చాలా గోప్యతను పాటించే వ్యక్తినని, అలానే ఉండాలని కోరుకుంటాను, కానీ పెళ్లి రద్దయిందనే విషయాన్ని తాను ఖచ్చితంగా తెలియజేయాలని ఆమె వివరించింది. ‘‘పెళ్లి విషయాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నాను. ఈ విషయంపై చర్చించడాన్ని అందరూ ఆపివేయాలని నేను కోరుకుంటున్నాను. కీలకమైన ఈ సమయంలో దయచేసి ఇరు కుటుంబాల గోప్యతను గౌరవించాలని కోరుతున్నాను. ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడి ముందుకు సాగడానికి మాకు తగినంత సమయాన్ని ఇవ్వాలని నేను అభ్యర్థిస్తున్నాను’’ అని మందాన కోరింది.

Read Also- Viral News: బిజినెస్ ట్రిప్‌కి వెళ్తున్నా అని చెప్పి.. థాయ్‌లాండ్‌లో ప్రేయసితో పట్టుబడ్డ భర్త!

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు