Amazon Layoffs: అమెజాన్ ప్రస్తుతం అతిపెద్ద ఉద్యోగ కోతలను అమలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ తొలగింపుల్లో ఇంజినీరింగ్ విభాగం ఎక్కువగా ప్రభావితమవుతోంది. విడుదల చేసిన డేటా ప్రకారం, న్యూ యార్క్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, వాషింగ్టన్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే నిర్ధారించబడిన 4,700 ఉద్యోగ కోతల్లో దాదాపు 40 శాతం ఇంజినీరింగ్ ఉద్యోగాలవే. ఇది గత నెలలో అమెజాన్ ప్రకటించిన 14,000 కంటే ఎక్కువ లేఆఫ్స్‌లో ఒక చిన్న భాగం మాత్రమే. ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి వివరాలు వెలువడాల్సి ఉంది.
టెక్ రంగంలో లేఆఫ్స్ ఒక ట్రెండ్ లాగా అయిపొయింది. భారీ లాభాలు, రికార్డు నగదు నిల్వలు ఉన్నప్పటికీ, అమెజాన్ కూడా వరుసగా ఉద్యోగ కోతలు ప్రకటిస్తున్న టెక్ కంపెనీల జాబితాలో చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకు 230 కంటే ఎక్కువ టెక్ సంస్థలు 1.13 లక్షలకుపైగా ఉద్యోగాలను తగ్గించినట్లు డేటా చూపిస్తోంది.
ఇంజినీర్లకే భారీ దెబ్బ
WARN (Worker Adjustment and Retraining Notification) వర్కర్ అడ్జస్ట్మెంట్ అండ్ రెట్రైనింగ్ నోటిఫికేషన్ ఫైలింగ్స్ ఆధారంగా ప్రముఖ నివేదిక తెలుపుతున్నదేంటంటే.. నిర్ధారించబడిన 4,700 ఉద్యోగ కోతల్లో దాదాపు 40% ఇంజినీరింగ్ ఉద్యోగాలు. అన్ని రాష్ట్రాలు వివరాలను పబ్లిక్‌గా విడుదల చేయకపోవడంతో, ఇవి మొత్తం లేఆఫ్స్‌లో ఒక భాగం మాత్రమే.
“కంపెనీ మంచి పనితీరు చూపుతూ లాభాలు నమోదు చేస్తున్నప్పటికీ ఎందుకు ఉద్యోగాల కోతలు?” అని చాలామంది ప్రశ్నిస్తుంటారు. దీనికి అమెజాన్ వివరణ ఇలా ఉంది. “ ప్రపంచం వేగంగా మారుతోంది. ఈ తరం AI ఇంటర్నెట్ తర్వాత అత్యంత రూపాంతరం చేసిన టెక్నాలజీ. ఇది కంపెనీలను ఎన్నడూ లేని వేగంతో ఇన్నోవేట్ చేయగలిగేలా చేస్తోంది. అందుకే మేము మరింత వేగంగా, సమర్థంగా పనిచేయాల్సిన అవసరం ఉంది.” తెలిపింది.
AI ఆధారిత భవిష్యత్తుకు సిద్ధమవుతున్న అమెజాన్
అమెజాన్ భవిష్యత్తును AI ఆధారంగా పూర్తిగా పునర్‌వ్యవస్థీకరిస్తోంది. ఈ సంవత్సరం ఆండి జస్సీ స్పష్టంగా చెప్పిన ప్రకారం.. జెనరేటివ్ AI వినియోగం పెరగడం వల్ల కార్పొరేట్ ఉద్యోగాల్లో భారీగా తగ్గింపులు ఉండవచ్చు. జూన్‌లో ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, అమెజాన్ ఇప్పటికే 1,000 కంటే ఎక్కువ జెనరేటివ్ AI టూల్స్, అప్లికేషన్‌లను అభివృద్ధి చేస్తోందో? లేదా చూడాలి. సంస్థ ఇందుకు సంబంధించిన ప్రకటనలో తెలిపింది. “మన పనితీరును వేగవంతం చేయడానికి lean structure అవసరం. తక్కువ లేయర్లు, ఎక్కువ ఓనర్షిప్ (ownership) ఉండేలా సంస్థను మార్చుతున్నాం.”

