CM Revanth Reddy: ఈఎంఆర్ఎస్ 4వ నేషనల్ స్పోర్ట్స్ మీట్ 2025 ఓవరాల్ ఛాంపియన్ షిప్‌ను సాధించిన తెలంగాణ విద్యార్థులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9CM Revanth Reddy) అభినందించారు. ఈ స్పోర్ట్స్ మీట్‌లో తెలంగాణ రికార్డ్ స్థాయిలో మెడల్స్‌ను సాధించింది. అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, జూడో, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, టైక్వాండో, యోగా, షూటింగ్, చెస్ ఇతర ఈవెంట్లలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 230 పతకాలను సాధించింది.
714 పాయింట్లతో అద్భుతమైన ఛాంపియన్‌షిప్‌ను కైవసం
ఈ నెల 15న ఒడిశాలో ఈ 4వ ఈఎంఆర్ఎస్ నేషనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. ఈ పోటీల్లో 22 రాష్ట్రాల్లోని 499 ఈఎంఆర్ఎస్ సంస్థలకు చెందిన 5,500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలకు తెలంగాణలోని 23 సంస్థలకు చెందిన 580 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 22 ఈవెంట్లలో పోటీలు నిర్వహించగా ఇందులో వ్యక్తిగత ఈవెంట్లు 15, జట్టు ఈవెంట్లు 7 ఉన్నాయి. వ్యక్తిగత, జట్టు ఈవెంట్లలో తెలంగాణ అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచింది. మొత్తం 714 పాయింట్లతో అద్భుతమైన ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నది. రాష్ట్రానికి వచ్చిన క్రీడాకారులు శుక్రవారం ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారిని రేవంత్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: CM Revanth Reddy: తెలంగాణ మాదిరిగా దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణి చేయండి : సీఎం రేవంత్ రెడ్డి
25న మంత్రివర్గ సమావేశం
ఈ నెల 25న మంత్రివర్గ సమావేశం జరగనున్నది. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్, గ్లోబల్ సమ్మిట్‌తో పాటు విద్యుత్ పంపిణీ, లోకల్ బాడీ ఎన్నికలు, 42 శాతం రిజర్వేషన్ వంటి తదితర అంశాలపై చర్చించనున్నారు. దీంతో పాటు ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ అనుమతిపై కూడా డిస్కషన్ జరిగే అవకాశం ఉన్నది. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ సింబల్ లేనందున 42 శాతం రిజర్వేషన్ ఎలా పంపిణీ చేయాలనే దానిపై సంపూర్ణంగా క్యాబినెట్ చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
