Kissik Talks With Varsha: బూతు వీడియోలు చూస్తా- జబర్దస్త్ నరేష్
Kissik Talks With Varsha (Image Source: Youtube)
ఎంటర్‌టైన్‌మెంట్

Kissik Talks With Varsha: స్ట్రెస్ తగ్గడానికి బూతులు మాట్లాడుకునే వీడియోలు చూస్తా.. జబర్దస్త్ నరేష్ షాకింగ్ కామెంట్స్

Kissik Talks With Varsha: నటి, యాంకర్ వర్ష హోస్ట్‌గా చేస్తున్న ‘కిస్సిక్ టాక్స్ విత్ వర్ష’ (Kissik Talks With Varsha) పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూకి జబర్దస్త్ నరేష్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఇప్పటికే ఎందరో సెలబ్రిటీల లైఫ్‌లోని ఎవరికీ తెలియని విషయాలను బయటకు తీస్తున్న వర్ష, ఈ షో మంచి పాపులర్ అయ్యారు. ప్రతి వారం బుల్లితెర, వెండితెరకు సంబంధించిన ఎవరో ఒక గెస్ట్‌తో సందడి చేస్తూ దూసుకెళుతున్న వర్ష, ఈ వారం ‘కిస్సిక్ టాక్స్ విత్ వర్ష’లో జబర్దస్త్ నరేష్‌ (Jabardasth Naresh) గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను, ఆయనతోనే బయటకు రప్పించారు. ఈ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై, వైరల్ అవుతోంది. ఈ ప్రోమోలో ఏముందంటే..

సంబంధాలు చూస్తున్నారు

అద్భుతమైన పరిచయం కార్యక్రమం తర్వాత నరేష్‌ను వర్ష ‘పెళ్లి కొడుకు’ అని పిలవడంతో, పెళ్లిడు వచ్చిందని నరేష్ నవ్వాడు. తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని, తనకూ ఫ్యామిలీ, పిల్లలు కావాలనే కోరికను నరేష్ తెలియజేశాడు. తాను ఇంకా ఏ ఇంటివాడిని కాలేదని, ఎవరైనా అమ్మాయి ఒప్పుకుంటే వారి ఇంటివాడిని అవుతానని సరదాగా చెప్పాడు. తనకు కాబోయే భార్య కోసం ఇంకా సంబంధాలు చూస్తున్నారని నరేష్ తెలిపాడు. కట్నం ఆశించడం లేదని, కావాలంటే ఎదురు కట్నం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని అసలు విషయం చెప్పాడు నరేష్.

Also Read- Tollywood: ట్రెండ్ మారింది.. సినిమా పబ్లిసిటీకి స్టార్స్ అవసరం లేదు.. ఆ పాత్ర కూడా జర్నలిస్ట్‌లదే!

వ్యక్తిగత కష్టాలు, కెరీర్

తాను తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని, అప్పటికే చాలా కష్టాలు ఉండడం వల్ల చదువు మానేయాల్సి వచ్చిందని నరేష్ తెలిపారు. తాను కష్టపడేదంతా కేవలం తన ఫ్యామిలీ బాగుండటం కోసమేనని పేర్కొన్నాడు. ఇండస్ట్రీకి రాకముందు తన హైట్ గురించి చాలా మంది హర్ట్ చేశారని, కొడుకు లైఫ్ ఏమవుతుందో అని తన తల్లి చాలా డిప్రెషన్‌లో ఉండేదని ఎమోషనల్ అయ్యాడు. నరేష్ కమర్షియల్ మైండ్‌సెట్ గురించి బుల్లెట్ భాస్కర్ గతంలో చేసిన వ్యాఖ్యల గురించి వర్ష అడగగా.. తాను కమర్షియల్‌గా ఉండనని, ఆ వ్యాఖ్యలు ఫ్లోలో భాస్కర్ చెప్పాడని వివరణ ఇచ్చాడు. దానికి.. ఇలాంటి స్నేహితులు ఉంటే కట్ చేయండి అని కొంతమంది ట్రోల్ కూడా చేశారని బాధపడ్డాడు.

Also Read- Amala Akkineni: రాత్రికి రాత్రి ఇల్లు, ఆస్తి మొత్తం వదిలేసి.. నాన్న పారిపోయారు.. అమల చెప్పిన ఆసక్తికర విషయాలివే!

టెన్షన్స్ తగ్గించుకోవడం కోసం..

నిత్యం బిజీగా ఉండే తనకు రిలాక్స్ అయ్యే మార్గం, టెన్షన్స్ తగ్గడానికి ఇంట్లో ఏం చేస్తారని వర్ష అడగగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రోలింగ్ వీడియోలు, బూతు మాటలు ఉండే వీడియోలు చూస్తానని సరదాగా చెప్పాడు. అలాగే, ప్రకాష్ రాజ్, రజినీకాంత్ వాయిస్‌లను అనుకరించి తన టాలెంట్ ప్రదర్శించాడు. తన తండ్రి తెలియక బూతు వీడియోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన సంఘటన గురించి కూడా నరేష్ చెప్పుకొచ్చాడు. మొత్తంగా అయితే.. నవ్వులతో పాటు ఎమోషనల్‌గా ఈ ఇంటర్వ్యూ సాగిందనేది ఈ ప్రోమో తెలియజేస్తుంది. ఫుల్ ఇంటర్వ్యూ శనివారం రాత్రి 7 గంటలకు బిగ్ టీవీలో ప్రసారం కానుంది.


స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ఆర్ మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలి : ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!