Free Bus Controversy: ఆంధ్ర ప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వచ్చింది. అయితే దీంతో ఆ రాష్ట్ర మహిళలు సంతోషం వ్యకం చేశారు. ఈ పథకం వలన మహిళలకు మంచి జరిగినప్పటికి కొందరికి మాత్రం తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు. అలాంటి సంఘటనే ఏపి(AP)లో చోటుచేసుకుంది. ఉచిత బస్సు ప్రయాణం వలన కండక్టర్లకు చుక్కలు కనబడుతున్నాయని ఒ మహిళా కండక్టర్ చేసిన వ్యాక్యలు ఇప్పుడు ఏపిలో దుమారం రేపుతున్నాయి. ఉచిత బస్సువలన మేము తీవ్ర ఇబ్బదులు ఎదుర్కుంటున్నామని మహిళా కండక్టర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రయానికులు వాగ్వాదం
రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం(Free bus scheme) మొదలైనప్పటినుండి చాలా మంది ప్రయాణికులు డబ్బులు చెల్లించకపోవడం చేస్తున్నారు. కానీ కొంతమంది ప్రయాణికులు కండక్టర్లతో దరురుసుగా ప్రవర్తిస్తున్నారని కండక్టర్లు వాపోతున్నారు. మరికొంత మంది ప్రయానికులు వాగ్వాదానికి దిగుతున్నారని తెలిపారు. ఉచిత ప్రయాణం కాబట్టి మేము ఎలాంటి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని భావించి కండక్టర్లను ప్రయాణికులు పట్టించుకోవడం లేదని కొంతమంది మహిళా సిబ్బంది వాపోయారు.
Also Read: Turakapalem: డేంజర్ బెల్స్.. తురకపాలెం ప్రాంతంలో మట్టి పరీక్షలు వెలుగులోకి సంచలనాలు.. ?
మహిళా కండక్టర్ ఆవేదన
సోషల్ మీడియాలో ఓ మహిళా కండక్టర్ తమ బాదను తెలుపుతూ వీడియో పోస్ట్ చేసింది. ఉచిత బస్సు పథకం పెట్టి మా జీవితాలతో ఎందుకు ఆటలు ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. బస్సులో ప్రయాణికులు మా మాట వినడం లేదు దీంతో డ్యూటీ చేయడమే మాకు కష్టంగా మారిందని తెలిపింది. ఇంత మంది ప్రయానికుల మద్యలో మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలాగా ఉందిని, మాకు కొంచెం కూడా గౌరవం ఇవ్వడం లేదని మహిళా కండక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.
హామీ ఇస్తున్నప్పటికి ఫలితం
ఆర్టీసీలో కొందరు సిబ్బంది మాట్లాడుతూ.. ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ప్రభుత్వం ఇచ్చింది. కానీ దాన్ని నడిపించే బారం మాత్రం ఆర్టీసీ ఉద్యోగుల మీద తీవ్రంగా పడుతుందని ఆరోపించారు. క్రమ క్రమంగా బస్సులో ప్రయాణికులు కండక్టర్లను పట్టించుకోకపోవడం వల్ల మా డ్యూటీలు మేము సక్రమంగా చేయలేకపోతున్నామని, దీంతో మాకు సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఒ పక్క ఆర్టీసీ అధికారులు ప్రయాణికులు కండక్టర్లను గౌరవించాలని, ఎవరూ కూడా ఆర్టీసీ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించరాదని హెచ్చరిస్తున్నారు. మరియు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నప్పటికి ఫలితం లేకుండా పోతుందని తెలిపారు. ప్రభుత్వం అందించిన ఈ పథకం మహిళలకు మంచి చేసినప్పటికి ఆర్టీసీ సిబ్బందికి మాత్రం కొంచెం కష్టం అని అంటున్నారు.
Also Read: Gurramgadda Village: మా గ్రామానికి ఉపాధ్యాయుడ్ని నియమించండి.. కలెక్టర్ కు విద్యార్థులు మొర!
ఏపీలో మహిళా కండక్టర్ ఆవేదన
ఉచిత బస్సు పెట్టి మా జీవితాలతో ఎందుకు ఆటలు ఆడుతున్నారు
కండక్టర్లతో దురుసుగా మాట్లాడుతున్నారు
మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలాగా ఉంది
జనాలు మా మాట వినడం లేదు pic.twitter.com/DDAqJDu3tR
— BIG TV Breaking News (@bigtvtelugu) September 16, 2025