RTC Officer Death: గుండెపోటుతో ఆర్టీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ కొత్త వెంకట్ రెడ్డి మృతి
మెదక్ బ్యూరో, స్వేచ్ఛ: ఆర్టీసీ జూబ్లీ బస్‌స్టేషన్ డిపో డిప్యూటీ జనరల్ మేనేజర్ కొత్త వెంకట్ రెడ్డి (RTC Officer Death) చనిపోయారు. 60 ఏళ్ల వయసున్న ఆయన ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన కొత్త వెంకట్ రెడ్డి గతంలో మెదక్, సంగారెడ్డి ఆర్టీసీ డిపోల్లో విధులు నిర్వహించారు. మృతుడికి భార్య మంజులతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఏప్రిల్ నెలలో వెంకట్ రెడ్డి రిటైర్మెంట్ కావాల్సి ఉంది. వారం రోజుల క్రితం వెంకట రెడ్డి కి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మృతి చెందారు.
కొత్త ప్రభాకరరెడ్డి రెడ్డి నివాళులు…
వెంకట్ రెడ్డి మరణ వార్త తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకరరెడ్డి రెడ్డి నివాసానికి చేరుకొని నివాళులు అర్పించారు. ఆర్టీసీ కార్మిక విభాగం నేతలు రాధాకిషన్ రావు, పీఎస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కాగా, సోమవారం నాడు అంత్యక్రియలు జరగనున్నాయి. హైదరాబాద్‌లోని వెంకట్ రెడ్డి నివాసం సమీపంలోని మల్కాజిగిరి స్మశాన వాటికలో అంత్యక్రియలు జరుతాయని వెంకట్ రెడ్డి సోదరులు జీవన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తెలిపారు.
Read Also- PhonePe Fake Links: సంక్రాంతి కానుక.. ఉచితంగా రూ.5 వేలు.. ఇలాంటి లింక్ కనిపిస్తే జాగ్రత్త!
భూ వివాదంతో వ్యక్తిపై రాయితో దాడి
దుబ్బాక, స్వేచ్ఛ: భూతగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తిపై రాయితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన దౌల్తాబాద్ మండలం శౌరీపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. శౌరీపూర్ గ్రామానికి చెందిన తిరుమల రెడ్డి ఆనందరెడ్డికి (60) అదే గ్రామానికి చెందిన తుమ్మ జోసెఫ్ రెడ్డి, తుమ్మ వినయ్ రెడ్డిలతో భూమి విషయంలో గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం అకారణంగా ఇద్దరూ కలిసి ఆనందరెడ్డిపై రాయితో దాడి చేశారు. దాడిలో ఆనందరెడ్డి తలకు గాయం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
Read Also- Bandla Ganesh: తిరుమలకు బండ్ల గణేష్ పాదయాత్ర.. ఎందుకో తెలుసా?

