HYD Water Supply: ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం
GHMC-Water (Image source X)
లేటెస్ట్ న్యూస్, హైదరాబాద్

HYD Water Supply: బీ అలర్ట్.. 8, 9 తేదీల్లో ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం

HYD Water Supply: సింగూరు ప్రాజెక్టు పైప్‌లైన్‌లో లీకేజీలకు మరమ్మతులు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టులో పెద్దపూర్ నుంచి సింగపూర్ వరకు ఉన్న 1600 ఎంఎం డయా ఫేజ్ – 3 మెయిన్ పైప్‌లైన్‌లో భారీ లీకేజీలకు అరికట్టడానికి అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టనున్నట్లు జలమండలి మంగళవారం పేర్కొంది. ఈ పనులతో పాటు టీఎస్ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో 132కేవీ కంది సబ్‌స్టేషన్ వద్ద పెద్దపూర్ ఫీడర్‌కు సంబంధించి ఏంఆర్టీ టెస్టింగ్, హాట్‌లైన్ రిమార్క్స్, సాధారణ నిర్వహణ పనులు చేపట్టనున్నట్టు వెల్లడించింది. ఈ పనుల కారణంగా ఈ నెల 8వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు 9వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల వరకు పనులు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ పనుల కారణంగా 18 గంటలపాటు హైదరాబాద్ నగరంలోని నిర్దేశిత ప్రాంతాల్లోని నీటి సరఫరాలో అంతరాయం (HYD Water Supply) ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు.

Read Also- Uttam Kumar Reddy: హైదరాబాద్‌ భవిష్యత్‌కు అత్యుత్తమం.. హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు

జలమండలి ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ డివిజన్ నెంబర్ 15 లోని మలేషియన్ టౌన్‌షిప్, మాదాపూర్, కొండాపూర్, డోయెన్స్ సెక్షన్, మాదాపూర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ( ఐఎస్బీ), ఓ అండ్ ఎం డివిజన్ 9లోని భరత్ నగర్, మూసాపేట సెక్షన్, గాయత్రీ నగర్ సెక్షన్, బాలానగర్ సెక్షన్, కేపీహెచ్ బీ కొంత భాగం, బాలాజీ నగర్ సెక్షన్ కొంత భాగం, డివిజన్ 6 లోని ఫతేనగర్, డివిజన్ 17 లోని గోపాల్ నగర్, హఫీజ్‌పేట్ సెక్షన్, మయూరి నగర్, మియాపూర్ సెక్షన్, డివిజన్ 22 లోని ప్రగతినగర్ సెక్షన్, మైటాస్, ట్రాన్స్‌మిషన్ డివిజన్ 2 లోని బీహెచ్ఈఎల్, ఎంఐజీ-1,2, రైల్ విహార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, చందానగర్ ప్రాంతాల్లోని నీటి సరఫరాలో అంతరాయమేర్పడనున్న విషయాన్ని గ్రహించి ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి కోరింది.

Read Also- Gadwal District: గుర్రంగడ్డ బ్రిడ్జి నిర్మాణంలో కదలిక వచ్చేనా.. వరద లేకున్నా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్!

Just In

01

Sankranthi 2026: కళ్యాణ్ పడాల, తనూజ కలిసి డ్యాన్స్.. బిగ్ బాస్ తర్వాత మళ్లీ ఈ వేడుకలోనే!

The Raja Saab: ‘ది రాజా సాబ్’ థియేటర్లో మొసళ్లు.. వీళ్లు మాములు ఫ్యాన్స్ కాదు బాబోయ్!

MP Kiran Reddy: రాయలసీమ రొయ్యలపులుసు తిన్న దొంగ ఎవరు?.. ఎంపీ చామల వ్యంగ్యాస్త్రాలు

Jana Nayagan: ‘అఖండ 2’కు ఆర్థిక ఇబ్బందులు.. మరి ‘జన నాయగన్’కు?

Newborn Dies: గుడిలో వదిలివేసిన శిశువు మృతి.. వైద్యులు తెలిపిన కారణాలివే