Gadwal District: గుర్రంగడ్డ బ్రిడ్జి నిర్మాణంలో కదలిక వచ్చేనా..!
Gadwal District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Gadwal District: గుర్రంగడ్డ బ్రిడ్జి నిర్మాణంలో కదలిక వచ్చేనా.. వరద లేకున్నా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్!

Gadwal District: ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కృష్ణా నది మధ్యలో ఏకైక దీవి గ్రామం గుర్రంగడ్డ(Gurramgadda). ఈ గ్రామానికి ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు హామీలు ఇస్తున్న నేటికీ వంతెన నిర్మాణం కార్యరూపం దాల్చడం లేదు. దీంతో వర్షాకాలంలో నదికి వరద ప్రవాహం పెరిగిందంటే ప్రజల రవాణా కష్టాలు వర్ణనానీతం. గ్రామం ఏర్పడినప్పటి నుంచి నేటికీ ఆ గ్రామానికి రవాణా సౌకర్యం లేక నదిలోనే పుట్టి సహాయంతో ప్రయాణం చేస్తూ మహిళలు, వృద్ధులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రవాణా కొనసాగిస్తున్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం గుర్రంగడ్డకు వంతెన నిర్మాణాన్ని చేపడతామని గద్వాల(Gadwal)లో జరిగిన ఎన్నికల సభలో కెసిఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు 2018లో 12 కోట్ల అంచనాలతో బీచ్ పల్లి మీదుగా రవాణా సౌకర్యం కల్పించేందుకు వీలుగా గుర్రంగడ్డ దివి గ్రామానికి బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టారు.

వరద తగ్గి మూడు నెలలు

నాటి నుంచి పనులు నత్తనడకన సాగుతుండగా ఆ కాంట్రాక్టర్ కు పనులు స్పీడ్ అప్ చేయాలని కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పన్నులపై దృష్టి సారించి పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ను మార్చి 60 సి కింద నోటీస్‌లు ఇచ్చి మరో కంపెనీ అయిన శ్రీనివాస డెవలప్ మెంట్(Srinivasa Development) అనే నిర్మాణ కంపెనీకి పనులు అప్పగించారు. దీంతో నిర్మాణ పనుల్లో వేగం పుంజుకోగా 34 పిల్లర్లకు గాను ఇప్పటికే నదిలో 26 పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. ఈ ఏడాది నాటికి పనులు పూర్తి చేసి రాకపోకలు ప్రారంభించాలని సంకల్పంతో ఉన్నారు. కానీ వరద తగ్గి మూడు నెలలు అవుతున్నప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్ పనులు తిరిగి ప్రారంభించకపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే నదీ ప్రవాహం తగ్గాక నవంబర్ నుంచి ప్రత్యామ్నాయంగా మట్టితో రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసుకొని నదిలో రాకపోకలను కొనసాగిస్తున్నారు. నది నేటి ప్రవాహం తగ్గు ముఖం పట్టాక నవంబర్ నెల నుంచి గతంలో గ్రామస్తులే స్వచ్ఛందంగా చందాలు వేసుకొని రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసుకోగా జిల్లా ఏర్పాటు అనంతరం కలెక్టర్ నిధులను రోడ్డు మార్గంకు నిధులు కేటాయిస్తున్నారు.

Also Read: Bunker Beds Scam: బంకర్ బెడ్స్‌లో రూ.100 కోట్ల స్కాం.. ఎంఎస్ఎంఈల వైపు అంటూ చక్రం తిప్పుతున్న అధికార ప్రతినిధి?

నీటి మద్యే జీవనం

గద్వాలకు 16 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నది మధ్యలో గుర్రంగడ్డ గ్రామం ఉంది. ప్రతి ఏటా వర్షాలు వస్తే ఆ గ్రామస్తుల కష్టాలు వర్ణనాతీతం. గ్రామంలో 600 కుటుంబాలు ఉండగా 480 మంది ఓటర్లు జీవనం సాగిస్తున్నారు. 2150 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న గుర్రంగడ్డ గ్రామంలో 1600 ఎకరాలకు పైగా భూమి సాగవుతోంది. గ్రామంలో సారవంతమైన భూమి పంటలు పండుతున్నప్పటికీ పండించిన పంటలు రవాణా చేసేందుకు, వివిధ పనుల నిమిత్తం రాకపోకలు కొనసాగించేందుకు గ్రామానికి నది నీటి ప్రవాహం కారణంగా రోడ్డు మార్గం లేక నది ప్రవాహం తగ్గాక నదిలో వేసుకున్న తాత్కాలిక మట్టి రోడ్డు ఏర్పాటు తర్వాతే సరుకు తరలింపు ప్రక్రియ మొదలవుతుంది.పంటలు పండించేందుకు అవసరమైన ఎరువుల బస్తాలను ఎండాకాలమే ఏకకాలంలో వ్యయ ప్రయాసాలకోర్చి సమకూర్చుకోవాల్సిన పరిస్థితి రైతులకు దాపురిస్తోంది. రేషన్ సరుకులు సైతం వర్షాకాలానికి సరిపడా నిల్వలను కలెక్టర్ అనుమతితో గ్రామంలో పంపిణీ చేస్తారు.

విద్యాబోధన జరగక తీవ్ర ఇబ్బందులు

విద్యార్థుల చదువుకు టీచర్ అందుబాటులో లేక చిన్నారులకు విద్యాబోధన జరగక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళలకు పౌష్టికాహారం పంపిణీ కోసం అంగన్వాడీ కేంద్రం సైతం నిర్వహించలేకపోతున్నారు. నిత్యవసర సరుకులు,అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు విధి లేక స్టీమర్ లో ప్రయాణం చేయాల్సి వస్తోందని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత గవర్నమెంటులోనైనా శాశ్వత వంతెన నిర్మాణాన్ని చేపట్టి తమ సమస్యను గట్టెక్కించాలని కోరుతున్నారు.

Also Read: Mukesh Ambani: రోజుకు రూ.5 కోట్లు ఖర్చు చేస్తే.. అంబానీ మొత్తం డబ్బు అయిపోవడానికి ఎన్నేళ్లు పడుతుందంటే

Just In

01

Seetha Payanam: ‘అస్సలు సినిమా’ ముందుందంటోన్న అర్జున్ కుమార్తె..

Megastar Chiranjeevi: రామ్ చరణ్‌కు ఏదయితే చెప్పానో.. సుస్మితకు కూడా అదే చెప్పా..

Chiranjeevi: సంక్రాంతి మనదే అంటే నాది ఒక్కడిదే కాదు.. అందులో వాళ్లంతా ఉన్నారు

Ravi Teja: జర్నలిస్ట్‌ని ఆ ప్రశ్న అడిగేసిన రవితేజ.. మాస్ రాజా మామూలోడు కాదండోయ్!

Chiru – Venky: పాటతోనే కాదు.. ఎంట్రీతోనూ అదరగొట్టారు. మెగా విక్టరీ మాస్ ఎంట్రీ!