Snake Gang Suspect: స్నేక్ గ్యాంగ్ సభ్యుడా?.. షాకింగ్ ఘటన
Snake Gang-Member (Image source X)
లేటెస్ట్ న్యూస్, హైదరాబాద్

Snake Gang Suspect: అతడు స్నేక్ గ్యాంగ్ సభ్యుడా?.. హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్‌ తనిఖీల్లో షాకింగ్ ఘటన

Snake Gang Suspect: సరిగ్గా తొమ్మిదేళ్లక్రితం, అంటే 2016లో హైదరాబాద్‌లోని పాత బస్తీని భయభ్రాంతులకు గురిచేసిన స్నేక్ గ్యాంగ్ గుర్తుందా?. ఆ ముఠాను గుర్తుకొచ్చేలా హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో శనివారం షాకింగ్ ఘటన జరిగింది. చాంద్రాయణ గుట్ట చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తుండగా, మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ పట్టుబడ్డాడు. పోలీసులు ఆటోను తమ ఆధీనంలోకి తీసుకోగా, తిరిగి ఇచ్చేయాలంటూ వాదులాటకు దిగాడు. ఆటోలోంచి సడెన్‌గా ఒక పాముని బయటకు తీశాడు. దానితో ట్రాఫిక్ ఎస్సైని భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఒక చేతికి పాముని చుట్టుకొని, తన బండిని ఇచ్చేయాలంటూ అటుఇటు తిరిగాడు. అయితే, నిందిత వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also- Mahesh Kumar Goud: 20 ఏళ్లుగా కోట్ల మంది ఆకలి తీర్చింది ఉపాధి హామీ చట్టం : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్!

2016లో హైదరాబాద్‌లో స్నేక్ గ్యాంగ్ సంచలన నేరాలకు పాల్పడిన విషయం తెలిసిందే. నగరంలోని ఓల్డ్ సిటీలో పాములతో బెదిరించి అమ్మాయిలపై మానభంగాలకు పాల్పడడంతో పాటు దోపిడీలు కూడా చేశారు. దీంతో, తాజాగా కలకలం రేపిన ఈ వ్యక్తి కూడా ‘స్నేక్ గ్యాంగ్’కు చెందిన వాడేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతడికి సంబంధించిన వివరాలన్నింటిపైనా దర్యాప్తు జరపాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆటోలో పాముని ఉంచడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డ్యూటీలో ఉన్న ఒక అధికారిని ఈ విధంగా బయటపెట్టడం ఏమిటి?, నిందితుడిని విచారించాలంటూ హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను కోరుతూ సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. కాగా, 2016 నాటికి స్నేక్ గ్యాంగ్‌ దోషులకు జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.

Read Also- Buddhavan: అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మెరవనున్న బుద్ధవనం.. అందుకు ప్లాన్ ఇదే..!

Just In

01

GHMC: జీహెచ్‌ఎంసీలో విలీన ప్రాంతాలకు మహర్దశ.. బడ్జెట్‌లో రూ.2,260 కోట్ల కేటాయింపు!

Vedire Sriram: పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతో ఏపీకి నీటిని తరలించింది.. పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు!

Akhanda 2: బోయపాటి ఇంటిని చుట్టుముట్టిన బయ్యర్లు.. నష్టాన్ని భరించేది ఎవరు?

Big Academy – Yuvraj Singh: వైఫల్యం చెందకపోతే ఎలా గెలవాలో తెలియదు.. బిగ్ అకాడమీ లాంఛింగ్‌లో యువరాజ్ సందేశం

HYD Water Supply: బీ అలర్ట్.. 8, 9 తేదీల్లో ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం