TG Assembly Session 2025: తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. సమావేశం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10:30గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. సమావేశ ప్రారంభం కాగానే సభ మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మృతికి సంతాపం తెలుపనుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ఇరిగేషన్ పై చర్చ నిర్వహిస్తారని సమాచారం. మధ్యాహ్నం బీఏసీ ( బిజినెస్ అడ్వైజరీ కమిటీ ) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలి.. అనే దానిపై స్పష్టత రానుంది. జనవరి 2, మూడవ తేదీలో కృష్ణ, గోదావరి జలాల్లో వాటా, తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. సభను నాలుగో తేదీన నిర్వహిస్తారా లేదా అనేది చూడాలి.
సమావేశాల్లో 42% రిజర్వేషన్లు..
ఈ అసెంబ్లీ సమావేశాల్లో 42% రిజర్వేషన్లు అంశం, జిహెచ్ఎంసి విస్తరణ సంబంధించిన అంశాలపై సైతం చర్చించబోతున్నట్లు సమాచారం. అయితే ఏ అంశాలు చర్చిస్తారు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్. ఏది ఏమైనా శీతాకాల సమావేశాలు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. కృష్ణ గోదావరి జలాలపై.. ఒకరిపై ఒకరు విమర్శ.. ప్రతి విమర్శలు చేసుకోబోతున్నారు. శీతాకాల సమావేశాలు వేడిని రగిలించబోతున్నాయి.
MLC Kavitha: వారికి నేను అండగా ఉంటా: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
తెలంగాణ ఆడిట్ నివేదిక
అసెంబ్లీలోని టేబుల్ మీద… రాజ్యాంగంలోని ఆర్టికల్ 213 లోని క్లాస్ 2(ఎ) ప్రకారం.. తెలంగాణ వస్తు సేవలు – సేవల పన్ను ( సవరణ) ఆర్డినెన్స్, 2025( తెలంగాణ ఆర్డినెన్స్ నెంబర్ 6 ఆఫ్ 2025), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్( సవరణ) ఆర్డినెన్స్, తెలంగాణ మున్సిపాలిటీల( రెండవ సవరణ) ఆర్డినెన్స్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( రెండవ సవరణ ) ఆర్డినెన్స్, 2023-24 సంవత్సరానికి తెలంగాణ సమగ్ర శిక్ష ఆడిట్ నివేదిక కాపీ, 2023-24 సంవత్సరానికి పీఎం స్కూల్ ఫర్ రైసింగ్ ఇండియా ( పీఎం శ్రీ ) తెలంగాణ ఆడిట్ నివేదిక కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో పెట్టనున్నారు. తెలంగాణ( ప్రజాసేవలకు నియామకాల నియంత్రణ – వేతన నిర్మాణం యొక్క హేతుబద్ధీకరణ ) సవరణ ఆర్డినెన్స్ కాపీని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సభలో పెట్టమన్నారు. తెలంగాణ( ప్రజా సేవలకు నియామకాల నియంత్రణ, సిబ్బంది నమూనా, వేతన నిర్మాణం హేతుబద్ధీకరణ ) రెండవ సవరణ ఆర్డినెన్స్ ను భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ ( మూడవ సవరణ ) ఆర్డినెన్స్ను, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ( ఎంపీపీ, జడ్పీ పి అడ్మిన్ ) 2024ఆగస్టు4 న జీవో ఎంఎస్ నెంబర్ 35 ద్వారా జారీ చేయబడిన సాధారణ గెజిట్ నెంబర్ 29 సాధారణ గేజిట్లో ప్రచురించబడిన గెజిట్ నోటిఫికేషన్ల కాపీని మంత్రి సీతక్క సభలో ఉంచనున్నారు. 2022-23 నుంచి 2023-24 సంవత్సరాలకు తెలంగాణ హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదికలు, వార్షిక ఖాతాల కాపీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సవల ఉంచనున్నారు.
రెండు సంతాప తీర్మానాలు
మాజీ మంత్రి, సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మృతిపై సభ సంతాప తీర్మానం ప్రవేశపెట్టింది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేయునది.
Also Read: Lorry Hits Bike: అక్కడికక్కడే అక్కాతమ్ముడి మృతి.. సత్తుపల్లిలో ఘోర ప్రమాదం

