MLC Kavitha: వారికి నేను అండగా ఉంటా: ఎమ్మెల్సీ కవిత
MLC-Kavitha (Image source Swetcha)
Telangana News, లేటెస్ట్ న్యూస్

MLC Kavitha: వారికి నేను అండగా ఉంటా: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

MLC Kavitha: ట్రిపుల్ ఆర్ నిర్వాసితుల సమస్యలపై జనవరి 5న రౌండ్ టేబుల్ సమావేశం

గోకారం సమస్యలపై సీఎం, ‌ఇరిగేషన్‌‌ మంత్రి స్పందించాలి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

నాగర్‌కర్నూల్, స్వేచ్ఛ: ట్రిపుల్ ఆర్ నిర్వాసితులకు, గోకారం నిర్వాసితులకు అండగా ఉంటానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (MLC Kavitha) భరోసా ఇచ్చారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని జంగారెడ్డి గూడెంలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్వాసిత రైతులతో, గోకారంలో రైతులతో ఆమె ఆదివారం సమావేశం అయ్యారు. శనివారం రాత్రి‌ కొల్లాపూర్ మండలంలో పాలమూరు ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన ఆమె, ఆదివారం ట్రిపుల్ ఆర్,‌ గోకారం రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మూడు సార్లు ట్రిపుల్ అలైన్మెంట్ మార్చి పెద్దవాళ్ల భూములు కాపాడటానికి రైతుల భూములు లాక్కుంటున్నారని కవిత ఆరోపించారు. నిర్వాసిత రైతులకు అండగా ఉంటానని ఆమె హామీ ఇచ్చారు.

Read Also- Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్ నేతల హౌస్ అరెస్ట్.. ఓపెన్ మెరిట్ విద్యార్థుల ఆందోళనలో కొత్త మలుపు

ట్రిపుల్ ఆర్ కోసం మొదట శాటిలైట్ సర్వే చేసి కొండలు, సాగు యోగ్యంకాని భూముల నుంచి అలైన్మెంట్ ఖరారు చేశారని, కొందరు పెద్దల భూములను తప్పించడానికి మళ్లీ మళ్లీ సర్వే చేసి వారి భూములు తప్పించారని కవిత పేర్కొన్నారు. ట్రిపుల్ ఆర్ కోసం ఇది మూడో అలైన్మెంట్ అని,‌ ఇక్కడి చిన్న రైతులకు ఉన్న కొద్దిపాటి భూములను ట్రిపుల్ ఆర్ పేరుతో లాక్కున్నారని విమర్శించారు. ట్రిపుల్ ఆర్ భూముల సమస్య 8 జిల్లాల్లో ఉన్నదని పేర్కొన్నారు. జనవరి 5న ట్రిపుల్ ఆర్‌తో నిర్వాసితులయ్యే 8 జిల్లాల రైతులతో హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. ఆ తర్వాత 8 జిల్లాల రైతులను తీసుకొని ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుస్తామని కవిత పేర్కొన్నారు. ‘‘పట్టణాలను బైపాస్ చేస్తూ రింగ్ రోడ్డు వెళ్లాలి. కానీ బుద్ధిలేకుండా భువనగిరి మధ్య నుంచి చౌటుప్పల్ మధ్యలో నుంచి ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఖరారు చేశారు. అది ఎట్లా రింగ్ రోడ్డు అయితది. రాజకీయాలతో సంబంధం లేకుండా తప్పు ఎవరు చేసినా తప్పు అనే చెప్తాం,‌ మీ అందరితో కలిసి నడుస్తాం’’ అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

Read Also- KTR: కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయాలి.. నాగర్‌కర్నూల్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

గోకారం నిర్వాసితులతో మాట్లాడుతూ…

గోదావరి ప్రాజెక్ట్ మీద చాలా ప్రాజెక్ట్ లను కట్టుకుంటూ పోయామని, అదే విధంగా కృష్ణానది ద్వారా 25 లక్షల ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉందని గోకారం నిర్వాసితులతో మాట్లాడుతూ కవిత అన్నారు. ‘‘గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసినా చాలా ఎకరాలకు నీళ్లు వచ్చేవి. కానీ, కనీసం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు. సంపూర్ణంగా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంది. ఇబ్బందులు తగ్గాలంటే ఇంకా నీళ్లు ఎక్కువగా వాడుకోవాలి. కానీ డిండి ప్రాజెక్ట్ కింద ప్రతిపాదిత గోకారం చెరువు అంశంపై మాట్లాడుకోవాలి. గోకారం చెరువునే మరింత స్ట్రెంగ్త్ చేస్తే ప్రయోజనం ఉంటుంది. అవకాశం ఉన్నా సరే బీఆర్ఎస్ ప్రభుత్వం గానీ, కాంగ్రెస్ ప్రభుత్వం గానీ స్పందించలేదు. ఇక్కడి ప్రజలు తమ నిరసనగా సర్పంచ్ ఎన్నికలను బాయ్‌కాట్ చేసినా ఎమ్మెల్యే గానీ, ప్రతిపక్షాలు గానీ స్పందించలేదు. కనీసం ఎన్నికల కమిషనర్ కూడా స్పందించకపోవటం దారుణం. ఓటు హక్కు ఉన్న ప్రజలను పట్టించుకోలేదంటే ఎర్రవెల్లి వాసులు మనుషులు కాదా?. ఈ విషయాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వరకు కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తాను. జిల్లా కలెక్టర్ వచ్చి ఇక్కడ పరిస్థితిని పరిశీలించాలి. ఒకటి రెండు రోజుల్లో స్పందించకపోతే ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రిని కూడా నిలదీద్దాం. డిండి కచ్చితంగా కట్టాల్సిందే. కానీ అనవసర ముంపు వద్దు. ఎర్రవెల్లి గ్రామం, ఎర్రవెల్లి తండా ప్రజలు చేస్తున్న పోరాటానికి మీ సోదరిగా నా మద్దుతు ఉంటుంది’’ అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

Just In

01

KTR Praises PJR: పీజేఆర్‌పై కేటీఆర్ ప్రశంసలు.. ఏమన్నారంటే?

Home Remedies: కడుపు నొప్పితో బాధపడుతున్నారా.. అయితే, ఈ సహజ చిట్కాలతో చెక్ పెట్టేయండి!

Adulterated liquor: ఖాకీ ముసుగులో కల్తీ మద్యం వ్యాపారం… కాపాడే ప్రయత్నాలు?

Rare Frame: సల్మాన్ 60వ బర్త్‌డే బాస్‌లో దిగ్గజాలు.. ఫొటో వైరల్!

Bhatti Vikramarka: మధిర నుంచే దేశానికి దిశా నిర్దేశం.. డిప్యూటీ సీఎం భట్టి హామీ