KTR: కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయాలి.. కేటీఆర్ హాట్ కామెంట్స్
KTR (Image source Swetcha)
Telangana News, లేటెస్ట్ న్యూస్

KTR: కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయాలి.. నాగర్‌కర్నూల్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

KTR: రైతుబంధు పాలన పోయి.. రాబందుల పాలనొచ్చింది

త్వరలో కేసీఆర్ సభ ఉంటుంది
నాగర్‌కర్నూల్‌‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నాగర్‌కర్నూల్, స్వేచ్ఛ: కేసీఆర్‌ను (KCR) మళ్లీ సీఎం చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కాంగ్రెస్, బీజేపీ (Congress, BJP) చీకటి దొంగల్లా కలిసిపోయారని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మంచి ఫలితాలు వచ్చాయని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఎవరిని నిలబెట్టినా ఎమ్మెల్యేలుగా గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ నేతల కళ్లు నెత్తిమీదకు ఎక్కాయని, ఎవరు అధైర్యపడవద్దని గులాబీ శ్రేణులకు ఆయన చూపించారు. ‘‘అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే మనకు రక్షణ. బీఆర్ఎస్ సర్పంచుల ఎవరూ బాధపడొద్దు. గ్రామపంచాయితీలకు ఫైనాన్స్ కమీషన్ ద్వారా నేరుగా నిధులు వస్తాయి. రాబోయే కాలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ప్రతి గ్రామంలో నాయకులను వార్డుల వారీగా ఇంఛార్జులుగా పెట్టండి. తెలంగాణ తిరిగి పట్టాల మీదకు రావాలి. తిరిగి పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని పట్టాలెక్కించాలి. త్వరలో కేసీఆర్ సభ ఉంటుంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ కార్యాలయంలో నూతన సర్పంచులకు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యి, కేటీఆర్ మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి అధ్యక్షతన ఈ సభ జరగగా, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, జైపాల్ యాదవ్, బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఇంతియాజ్ ఇసాక్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read Also- Indian Army Alert: జమ్మూ కశ్మీర్‌లో యాక్టివ్ అయిన 30 మంది ఉగ్రవాదులు.. ఇంటెలిజెన్స్ బిగ్ అలర్ట్

రాబందుల పాలన

రాష్ట్రంలో కేసీఆర్ రైతుబంధు పాలన పోయి, రాబందుల పాలన వచ్చిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు వేశారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలుపుతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకతను చూపించారని, మళ్లీ కేసీఆర్ పాలన కావాలనుకుంటున్నారని అన్నారు. యూరియా కోసం రైతులు పోలీసుల కాళ్ల‌మీద పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. యూరియా దుకాణాల ముందు చెప్పులు వచ్చాయని విమర్శించారు. కాంగ్రెస్ ఉంటే‌ అభివృద్ధి ఉండదని కేటీఆర్ విమర్శించారు. ‘‘కేసీఆర్ ఉంటేనే పల్లెలు అభివృద్ధి అవుతాయి. కేసీఆర్ వల్లే హైదరాబాద్ భూములు బంగారు అయ్యాయి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

‘‘పాలకులకు రైతులపై ప్రేమ లేదు. మార్పు పేరుతో ఊదరగొట్టారు. అడ్టగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. రెండేళ్లలో సీఎం నోటి నుంచి ఒక్క మంచి మాట రాలేదు. మహాలక్ష్మి, నెలకు 2,500, తులం ‌బంగారం ఇవ్వడం లేదు. పాలమూరు పథకంపై పగబట్టారు. కేసీఆర్ 70 టీఎంసీలతో పాలమూరు ప్రాజెక్టు కట్టారు. రోజుకు 2టీఎంసీల నీళ్లుతోడే 145 మెగావాట్ల పంపులను ఏర్పాటు చేశారు. ఇలా 90 శాతం పనులు పూర్తయ్యాయి. 1952లో బూర్గుల రామకృష్ణారావు 150 టీఎంసీలతో 14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా ఈ ప్రాజెక్టుకు ప్రణాళిక చేశారు. 1956లో ఏపీ ఏర్పడినప్పటి నుంచి ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. ఇక రెండేళ్ల నుంచి ప్రాజెక్టు పనులు అలాగే ఉన్నాయి. పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేయకపోవడంతో పాలమూరుకు కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ విలన్. 17 ఏండ్లు దత్తత పేరుతో బాబు పాలమూరును ఎంటబెట్టారు. ఈ ప్రాజెక్టును రూ.29 వేల కోట్ల ఖర్చుతో 90 శాతం పనులు చేశాం. కానీ, సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు పనుల టెండర్ల రద్దు చేసి ఇంకా చేపట్టడం లేదు. చంద్రబాబుకు కోపం వస్తుందని, కేసీఆర్‌కు మంచిపేరు వస్తుందని రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదు’’ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

Read Also- Telangana BJP: బీజేపీలో పూర్తిస్థాయి కమిటీల నియామకమెప్పుడు?.. నిరాశలో క్యాడర్!

Just In

01

Home Remedies: కడుపు నొప్పితో బాధపడుతున్నారా.. అయితే, ఈ సహజ చిట్కాలతో చెక్ పెట్టేయండి!

Adulterated liquor: ఖాకీ ముసుగులో కల్తీ మద్యం వ్యాపారం… కాపాడే ప్రయత్నాలు?

Rare Frame: సల్మాన్ 60వ బర్త్‌డే బాస్‌లో దిగ్గజాలు.. ఫొటో వైరల్!

Bhatti Vikramarka: మధిర నుంచే దేశానికి దిశా నిర్దేశం.. డిప్యూటీ సీఎం భట్టి హామీ

Instagram: యూఎస్‌లో ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం