Medak Tragedy: వారంతా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అందరిలాగే గోవాకు వెళ్లాలని ఎన్నో కలలు కన్నారు. గోవా టూర్ కోసం ఎన్నో ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. ఇందుకోసం రూపాయి రూపాయి పోగుచేసుకున్నారు. తమ ప్లాన్స్ కు అనుగుణంగానే గోవాకు వెళ్లి.. 15 మంది స్నేహితులు ఎంతగానో ఎంజాయ్ చేశారు. ఎన్నో ఆనందాలు, సంతోషాలను పోగుచేసుకొని తమ స్వస్థలాలకు పయనమయ్యారు. ఈ క్రమంలోనే వారి ఆనందాలను మృత్యువు చెల్లాచెదురు చేసింది.
టైర్ పేలడంతోనే..
మెదక్ జిల్లా నర్సాపూర్ కు చెందిన 15 మంది యువకుల గోవా టూర్.. తీవ్ర విషాధాన్ని మిగిల్చింది. గోవా నుంచి తిరుగు ప్రయాణమైన మూడు కార్లలో ఒకటి రోడ్డు ప్రమాదానికి గురైంది. మహారాష్ట్రలోని షోలాపూర్ వద్ద యాక్సిడెంట్ జరగడంతో కారులోని నలుగురు స్నేహితుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. టైర్ పేలడంతో కారు ఒక్కసారిగా పల్టీ కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు గాయపడినట్లు సమాచారం. దీంతో బాధితుడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
Also Read: Sathupalli Medical Shops: సత్తుపల్లిలో అనధికార ‘సిండికేట్’ దందా!.. రెచ్చిపోతున్న మాఫియా..!
ఇద్దరు అమ్మాయిలు సైతం..
మరోవైపు ఇదే రీతిలో అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. వారు కూడా టూర్ కు వెళ్లి వస్తూ మృత్యువాత పడ్డారు. మృతులను మహబూబాబాద్ జిల్లాకు చెందిన మేఘన, భావనగా గుర్తించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల గ్రామానికి చెందిన పులఖండం మేఘనా రాణి (25), ముల్కనూరు ప్రాంతానికి చెందిన కడియా భావన (24) ఉన్నత చదువుల నిమిత్తం మూడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. కాలిఫోర్నియాలో ఎమ్మెస్ పూర్తి చేసుకొని ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్నారు. ఈ క్రమంలో కాలిఫోర్నియాలో టూర్ కు 8 మంది స్నేహితులతో రెండు కార్లలో వారు వెళ్లారు. రిటర్న్ లో వారి కారు అదుపుతప్పి అలబాబా హిల్స్ రోడ్డులోని లోయలోకి దూసుకెళ్లింది. మేఘన, భావన మృతితో వారి గ్రామాల్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ యువతులు మృతి
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన మేఘనారాణి, భావన కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి
ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణ రీత్యా కాలిఫోర్నియాలో ఉంటున్న యువతులు
స్నేహితులతో కలిసి వెకేషన్‌కి వెళ్లి వస్తుండగా… pic.twitter.com/axhBTHyUnA
— BIG TV Breaking News (@bigtvtelugu) December 29, 2025

