CM revanth Reddy: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి దిగ్విజయ్ సింగ్ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై ఆయన ప్రశంసలు కురిపించడాన్ని కాంగ్రెస్ నేతలు, శ్రేణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వివాదంలోకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎంట్రీ ఇచ్చారు. సోనియా గాంధీ పక్షాన నిలబడి.. దిగ్విజయ్ సింగ్ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా చురకలు అంటించారు. సీఎం రేవంత్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన అంశాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?
సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) పై ప్రశంసలు కురిపించారు. 1991, 2004, 2014 సంవత్సరాల్లో పీవీ నరసింహారావు, డా. మన్మోహన్ సింగ్ (Dr. Manmohan Singh)లను ప్రధాన మంత్రులుగా ఎంపిక చేయడంలో ఆమె పాత్రను గుర్తు చేశారు. వారి నేపథ్యాలను పక్కన పెట్టి.. వారి ప్రతిభకు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టిందని ఎక్స్ వేదికగా కొనియాడారు. ప్రజాస్వామ్యాన్ని నిర్మిస్తూ విభిన్న భారతాన్ని ఏకం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
CONGRESS…A force for people of #India was born 140 years ago on this day.
The story of the Indian National Congress is the story of Indian democracy in motion.
When one reflects on the leadership of Smt #SoniaGandhi Ji, we find service, commitment, ethics and values.
Under… pic.twitter.com/kSq1wajRWH
— Revanth Reddy (@revanth_anumula) December 28, 2025
ఆ ఘనత సోనియాదే..
సోనియా గాంధీ నాయకత్వాన్ని పరిశీలిస్తే సేవ, నిబద్దత, నైతిక విలువలు స్పష్టంగా కనిపిస్తాయని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో పోస్టు చేశారు. తెలంగాణలోని మారుమూల ప్రాంతానికి చెందిన పీవీ నరసింహారావు (P.V Narasimha Rao).. సోనియా నాయకత్వంలోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దేశ ప్రధానిగా ఎదిగారని గుర్తుచేశారు. అలాగే ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ ను దేశానికి ప్రధానిని చేసిన ఘనత సోనియాకే దక్కుతుందన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించడం నుంచి రాజ్యాంగ నిర్మాణం వరకు.. ప్రజాస్వామ్య సంస్థల స్థాపన నుంచి విభిన్న భారతాన్ని ఏకం చేయడం వరకు ఆధునిక భారతదేశంలోని ప్రతి కీలక అధ్యాయాన్ని భారత జాతీయ కాంగ్రెస్ మలిచిందని రేవంత్ వెల్లడించారు.
దిగ్విజయ్ వివాదం ఏంటంటే?
శనివారం (డిసెంబర్ 27) కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం జరుగుతున్న వేళ ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) సోషల్ మీడియాలో ఘాటైన పోస్ట్ పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక పాత ఫోటోను షేర్ చేశారు. ఈ ఫొటో 1990వ దశకానిది. నాడు నరేంద్ర మోదీ (Narendra Modi) ఒక సామాన్య కార్యకర్తగా ఉండగా, గుజరాత్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ (BJP) దిగ్గజం ఎల్‌కే అద్వానీ (LK Advani) ఒక కుర్చీలో కూర్చొని ఉండగా, నాడు యువకుడిగా ఉన్న మోదీ… అద్వానీ ముందు నేలపై కూర్చొని కనిపించారు. ఈ ఫొటో ప్రభావవంతమైనదంటూ దిగ్విజయ్ సింగ్ రాసుకొచ్చారు.
Also Read: Telangana Assembly 2025: సీఎం రేవంత్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్
చెప్పకనే చెప్పిన దిగ్విజయ్
తాను ఈ ఫొటోను కోరాలో (Quora) చూశానని, ఇది చాలా ప్రభావవంతంగా ఉందని ప్రశంసించారు. ‘క్షేత్రస్థాయిలో ఉండే ఆర్ఎస్ఎస్‌కు చెందిన ఒక స్వయంసేవక్, జనసంఘ్ లేదా బీజేపీ కార్యకర్త.. ఒకప్పుడు నేతల పాదాల చెంత నేలపై కూర్చున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశానికి ప్రధానమంత్రిగా ఎలా ఎదిగారో చూడండి. ఇదీ ఒక సంస్థ బలం. జై శ్రీరామ్’’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఈ పోస్టును కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ట్యాగ్ చేశారు. దీంతో, తాను చెప్పదలచుకున్న సందేశాన్ని నేరుగా కాంగ్రెస్ అధిష్టానానికి దిగ్విజయ్ సింగ్ చేరవేసే ప్రయత్నం చేసినట్టుగా ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషించారు.

