Allu Sirish Wedding Date: అల్లు శిరీష్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్
Allu Sirish Wedding Date (Image Source: twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Allu Sirish Wedding Date: అల్లు ఇంట పెళ్లి భాజాలు.. శిరీష్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. స్పెషల్ వీడియోతో డేట్ రివీల్

Allu Sirish Wedding Date: అల్లు కుటుంబంలో త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. అల్లు శిరీష్.. నయనికతో కలిసి పెళ్లి పీటలు ఎక్కేందుకు ముహోర్తం ఫిక్స్ అయ్యింది. ఈ విషయాన్ని అల్లు శిరీష్ స్వయంగా ప్రకటించారు. సోదరుడు అల్లు అర్జున్ (Allu Arjun) బిడ్డలైన అయాన్ (కుమారుడు), అర్హ (కూతురు)తో కలిసి పెళ్లి తేదీని రివీల్ చేశారు. దీంతో అల్లు అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. అల్లు శిరీష్ పెళ్లి తేదీని తెలుసుకొని బన్నీ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

పెళ్లి ఎప్పుడంటే?

అల్లు శిరీష్ విడుదల చేసిన స్పెషల్ వీడియోలో పెళ్లి తేదీని ప్రకటించారు. తొలుత అల్లు అర్జున్ బిడ్డలు.. బాబాయ్ నీ పెళ్లి ఎప్పుడని ప్రశ్నించడం వీడియోలో చూడవచ్చు. అప్పుడు శిరీష్.. సిగ్గుతో కళ్లు మూసుకుంటూ మార్చి 6వ తేదీ అని రివీల్ చేశాడు. మరీ సంగీత్ ఎప్పుడు అని ప్రశ్నించగా.. మనం సౌత్ ఇండియన్స్ సంగీత్ చేయము అంటూ అదే రీతిలో శిరీష్ సమాధానం ఇచ్చారు. దీన్ని బట్టి 2026 మార్చి 6న అల్లు శిరీష్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి ఎక్కడ జరుగుతుందన్న విషయాన్ని మాత్రం శిరీష్ రివీల్ చేయలేదు. కాగా పెళ్లి తేదీ ఫిక్స్ కావడంతో సినీ ప్రముఖులు అల్లు శిరీష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అల్లు అర్జున్ పెళ్లి రోజు కూడా..

ఇదిలా ఉంటే అల్లు శిరీష్ పెళ్లి తేదీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మార్చి 6వ తేదీనే అతడి సోదరుడు అల్లు అర్జున్ (Allu Arjun) కూడా స్నేహారెడ్డిని పెళ్లి చేసుకోవడం గమనార్హం. వారిద్దరి పెళ్లి 2011లో జరిగింది. ఇప్పుడు అదే తేదీని తన పెళ్లికి కూడా శిరీష్ ఎంచుకోవడం ఆసక్తిరేపుతోంది. శిరీష్ కావాలనే తన అన్న – వదిన పెళ్లి చేసుకున్న తేదీని కోరుకున్నారా? యాదృచ్చికంగా అలా సెట్ అయ్యిందా? అన్నది తెలియాల్సి ఉంది.

Also Read: Medak Tragedy: మూడు కార్లలో గోవా టూర్.. తిరిగొస్తుండగా బిగ్ షాక్.. ముగ్గురు స్పాట్ డెడ్

శిరీష్ ప్రేమ పెళ్లి..

ఇదిలా ఉంటే శిరీష్ – నయనికల ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు. వరుణ్ – లావణ్య పెళ్లి సమయంలోనే వీరిద్దరి లవ్ కు బీజం పడినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ హీరో నితీన్ భార్య షాలినికి నయనిక మంచి ఫ్రెండ్. వరుణ్ – లావణ్య పెళ్లికి షాలినితో పాటు నయనిక కూడా వచ్చారు. ఆ సమయంలో అల్లు శిరీష్ – నయనికల మధ్య తొలిసారి పరిచయం ఏర్పడింది. మనసులు, అభిప్రాయాలు, ఆలోచనలు కలవడంతో కొద్దిరోజుల్లోనే అది ప్రేమగా మారింది. కొద్ది రోజుల క్రితమే కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వాటికి సంబంధించిన ఫొటోలను అల్లు శిరీష్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతుండటంతో అల్లు ఫ్యామిలీలో ఆనందం నెలకొంది.

Also Read: Telangana Women Died: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు అమ్మాయిలు మృతి

Just In

01

UP Rampur Accident: అయ్యబాబోయ్.. భయంకరమైన యాక్సిడెంట్.. బొలెరోపై బోల్తాపడ్డ లారీ!

The Raja Saab Trailer: ‘ది రాజా సాబ్’ ట్రైలర్ 2.ఓ వచ్చేసింది. ఇది కదా కావాల్సింది!

Coldwave Update: మరో 2-3 రోజులు ఇదే స్థాయిలో తీవ్రమైన చలి.. రిలీఫ్ ఎప్పటినుంచంటే?

Realme Phone: 10,001mAh బ్యాటరీతో రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్?

Bank Loan News: ఓ వ్యక్తి రూ.1.7 కోట్ల లోన్ తీసుకుంటే 11 ఏళ్లలో రూ.147 కోట్లకు పెరిగింది.. ఎందుకంటే?