Illegal Land Registration: కోర్టు ఆదేశాలు బేఖాతర్…!
–ఓఆర్సీలు లేకుండా ఇనామ్ భూమికి పట్టా హక్కులు
–ఫోర్జరీ పత్రాలతో శ్రీసాయిరాం నగర్ లేవుట్కు హెచ్ఎండీఏ అనుమతి
–లావాదేవీలను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు
–కాసులకు కక్కుర్తిపడి రిజిస్ట్రేషన్లు చేస్తున్న అధికారి
–సబ్ రిజిస్ట్రార్ సోనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: ప్రభుత్వ అధికారుల, కోర్టులు ఇచ్చిన ఆదేశాలతో తమకు పనిలేదని, తమకు నచ్చినట్లు వ్యవహారిస్తానని ఓ సబ్ రిజిస్ట్రార్(Sub-Registrar) ధైర్యంగా అక్రమ డాక్యుమెంట్లు చేస్తున్నారు. గతంలో ఈ అధికారిపై ఆదారాలతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసిన ఫలితం లేదని తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) నియోజకవర్గంలోని ప్రతి మనిషి నోట ఆ అధికారిపై ఆరోపణలు వినిపిస్తున్న స్ధానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. ఒకటి, రెండు ఫిర్యాదులు కావు.. పదుల సంఖ్యలో ఫిర్యాదులు ఆఅధికారిపై వస్తున్న పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. విలువైన భూముల్లో క్రయవిక్రయాలు జరుగుతున్నప్పుడు భూ పూర్వపరాలు పరిశీలించాల్సి ఉంటుంది. భూ వినియోగదారుడికి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. కానీ అవేమి తమకు అవసరం లేదనట్టుగా డాక్యుమెంట్కు ఓ రేటు ఫీక్స్ చేసుకోని వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం.ఈ తతంగమంతా రంగారెడ్డి(Rangareddy) జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతుంది.
లావాదేవీలు నిలివేయాలి..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఇబ్రహీంపట్నం ఖాల్సా రెవెన్యూ పరిధిలోని 377, 405, 405, 407 సర్వే నెంబర్లో శ్రీ సాయిరాం నగర్ వెంచర్(Sri Sairam Nagar Venture) నిర్మాణం చేశారు. అయితే ఇనామ్ భూమికి ప్రభుత్వం తప్పనిసరిగా ఓఆర్సీ (అక్యూపేన్సీ రెగ్యూలరైజ్ సర్టిఫికేట్) తీసుకోవాలి. కానీ ఓఆర్సీ(ORC) ప్రభుత్వం ఇచ్చినట్లుగా నకిలీ ధృవపత్రాలను సృష్టించి వెంచర్ అనుమతికి ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అదనపు కలెక్టర్ వద్ద వివాదం నడుస్తుంది. అయినప్పటికి శ్రీ సాయిరాం నగర్ వెంచర్ యాజమాన్యం ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ తో చేతులు కలిపి ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ కోర్టులో కేసు నడుస్తున్నప్పటికి క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. అయితే అక్టోబర్ 11న అడీషనల్ కలెక్టర్ క్రయవిక్రయాలు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్(Sub-Registrar), తహశీల్ధార్(MRO) కు ఆదేశాలిచ్చినప్పటికి పట్టించుకోవడం లేదు. ఈ అక్రమ లావాదేవీలను ఇప్పటికి కొనసాగిస్తున్నారు.
నాకు నచ్చితే చాలు..
వివాద భూములపై ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా సబ్ రిజిస్ట్రార్ వ్యవహారం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అక్రమాలకు అడ్డగా మారిపోయింది. ఆదారాలతో సహా పిర్యాదులు చేసిన ఉన్నతాధికారులు విచారణ చేయకుండా మౌనంగా ఉంటున్నారు. కలెక్టర్, రెవెన్యూ కోర్టు ఆదేశాలను సబ్ రిజిస్ట్రార్ బేఖాతర్ చేస్తుంది. గత నెల రెవెన్యూ కోర్టు లావాదేవీలు నిలిపివేయాలని ఆదేశాలిచ్చిన 2025 నవంబర్ 10వ తేదీన సబ్ రిజిస్ట్రార్ 16650 డాక్యుమెంట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారుల ఆదేశాలతో పనిలేకుండా నాకు నచ్చితే చాలు అంటూ సబ్ రిజిస్ట్రార్ వ్యవహారిస్తున్నారు.
సబ్ రిజిస్ట్రార్ పై చర్యలు తీసుకోవాలి
అక్రమ పద్దతిలో రిజిస్ట్రేషన్ల చేస్తున్న ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ సోనిపై చర్యలు తీసుకోవాలని మ్యాడం గోవర్ధన్(Madam Govardhan) కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి 9 రోజులైన ఇప్పటి వరకు ఏలాంటి విచారణ చేయకపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనేక మార్లు ఫిర్యాదులు చేసిన ఫలితం లేదని వివరించారు. తక్షణమే అక్రమాలకు పాల్పడుతున్న సబ్ రిజిస్ట్రార్ సోనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

