Wife Murder Crime: ఘోరం భార్యను కసితీరా.. కొట్టి చంపిన భర్త
Wife Murder Crime (imagecredit:swetcha)
Uncategorized

Wife Murder Crime: రాష్ట్రంలో ఘోరం.. భార్యను కసితీరా.. కొట్టి చంపిన భర్త

Wife Murder Crime: కట్టుకున్న భర్తే తన భార్య పాలిట యముడు అయ్యాడు. జీవితాంతం తోడుంటాడని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి తన జీవితంలోకి వచ్చాక నిత్యం చిత్రహింసలతో జీవనం సాగిస్తుండగా తుదకు కర్రతో తీవ్రంగా కొట్టి హతమార్చిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)లోని ధరూర్ మండలం నెట్టెంపాడు(Nettempadu) గ్రామంలో చోటుచేసుకుంది. గద్వాల సీఐ టంగుటూరి శ్రీను(CI Tanguturi Srinu) తెలిపిన వివరాల ప్రకారం నెట్టెంపాడు గ్రామంలో కురువ గోవిందుకు అప్పటికే వివాహమై రద్దు కాగా అదే గ్రామంలోని జములమ్మతో రెండవ వివాహం జరిగిందన్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారన్నారు. గతంలో తండ్రి పైనే దాడి చేయగా కేసు నమోదు సైతం వెళ్లొచ్చాడన్నారు. మతిస్థిమితం సరిగ్గా లేదా ఎర్రగడ్డలోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడన్నారు. గత రాత్రి కొడుకుపై దాడి చేయగా తలకు రక్తస్రావం అయింది అన్నారు.

Also Read: Decoit Teaser Review: అడవి శెష్ ‘డెకాయిట్’ టీజర్ చూశారా.. ఇరగదీశాడుగా..

తన చెల్లిని హతమార్చాడని..

దీంతో తల్లి గమనించి మళ్లీ కొడతాడనే భావనతో బయటకు పరుగెత్తుతుండగా వెంబడిస్తుండడంతో మార్గమధ్యంలో ఆమె కింద పడగా కట్టేతో విచక్షణారహితంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తలపై తీవ్ర గాయాలు కావడంతో బాలుడు గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. ఆ కారణంగా తన చెల్లిని హతమార్చాడని, నిత్యం కొడుతుండడంతో గ్రామంలో పలుమార్లు పెద్దల దృష్టికి తీసుకెళ్లి పంచాయతీ నిర్వహించగా ఇకమీదట మంచిగా ఉంటాడని హామీనిచ్చారని, ఇప్పుడు మా పాపను చంపి, ఇద్దరి పిల్లలని అనాధ చేశారన్నారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని భాదితులు కోరారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లి మృతితో ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏమని, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మృత దేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనూ మార్చురీకి తరలించగా ఆమె కుటుంబ సభ్యులు, బంధువు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు.

Also Read: Government Job: ఆర్థిక ఇబ్బందులను లెక్కచేయని చదువు పోరాటం.. తల్లిదండ్రుల కలను నిజం చేసిన కుమారుడు!

Just In

01

Telangana BJP: తెలంగాణ బీజేపీ నేతల తీరుపై ప్రధాని మోడీ ఫైర్.. కమల దళంలో కలకలం..!

Parliament News: ‘టీ పార్టీ’లో అరుదైన దృశ్యం.. ప్రియాంక గాంధీ చెప్పింది విని స్మైల్ ఇచ్చిన ప్రధాని మోదీ, రాజ్‌‌నాథ్

Akhanda 2: ‘అఖండ 2’ థియేటర్లలో సౌండ్ బాక్సులు అందుకే ఆగిపోతున్నాయ్.. బాబోయ్ కాషన్ కియా..

India vs South Africa: చివరి టీ20లో టాస్ పడింది.. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏం ఎంచుకున్నాడంటే?

RTC Bus Accident: బస్సు రన్నింగ్‌లో ఫెయిల్ అయిన బ్రేకులు.. పత్తి చేనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..!