Decoit Teaser Review: వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘మేజర్’ వంటి హిట్ చిత్రాల తర్వాత ఆయన నటిస్తున్న తాజా పాన్-ఇండియా చిత్రం ‘డెకాయిట్’ (Decoit). ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ‘మ్యాడ్లీ ఇన్ లవ్’ (Madly in Love) అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఇందులో భావోద్వేగాలతో కూడిన గాఢమైన ప్రేమకథ కూడా ఉందని దర్శకుడు షానీల్ డియో టీజర్‌లో స్పష్టం చేశారు. ఇలాంటి ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ రివ్యూ ఇక్కడ తెలుసుకుందా.
గతంలో అడివి శేష్ చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో, ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి షానీల్ డియో మరియు అడివి శేష్ సంయుక్తంగా కథను అందించారు. తెలుగు సంభాషణలను ప్రముఖ రచయిత అబ్బూరి రవి రాశారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. టీజర్‌లో వినిపించిన నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ని పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేసింది. ధనుష్ భాస్కర్ అందిస్తున్న విజువల్స్ రా (Raw) మరియు డార్క్ థీమ్‌తో సినిమాకు భారీతనాన్ని తెచ్చాయి. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తుండగా, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. వీరితో పాటు ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కుల్కర్ణి వంటి నటులు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. తెలుగు మరియు హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ పాన్-ఇండియా చిత్రం మార్చి 19, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
విడుదలైన టీజర్ ను చూస్తుంటే.. అడవి శేష్ ఎప్పుడూ లేని విధంగా వేరే డిఫరెంట్ పాత్రలో కనిపించారు. చిన్న డైలాగ్ తో మెదలైన ఈ టీజర్ మాస్ యాంగిల్ లో హీరోను ఎలివేట్ చేస్తుంది. ఇందులో శేష్ ఒక దొంగ పాత్రలో కనిపించనున్నారు. జైలులో వచ్చే సాంగ్ అయితే వేరే లెవెల్ లో ఉంటుంది. నాగార్జున సినిమా హలో బ్రదర్ సినిమాలో కన్నెపెట్టరో కన్నుకొట్టరో.. అంటూ వచ్చే సాంగ్ టీజర్ కు మరింత మైలేజ్ తీసుకొచ్చింది. పాటకు తగ్గట్టుగా అడవి శేష్ చేసే పనులు కూడా ప్రేక్షకులను ఆధ్యాంతం కట్టిపడేశాలా ఉన్నాయి. పాత పాటను కలిపి ఇలా టీజన్ విడుదల చేయడం చాల కొత్తగా అనిపించింది. యాక్షన్ సీన్స్ కూడా చాలా వేరే లెవెల్ లో ఉన్నాయి. చివరిలో ఓ చిన్నపాప డాక్టర్వా అంటే కాదు దొంగను అంటూ తన స్టైల్లో టీజర్ను ముగిస్తాడు. ఈ టీజన్ ను చూస్తుంటే శేష్ మరో హిట్ సాధించేలా కనిపిస్తున్నాడు.

