Chiranjeevi Movie: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మరశంకరవరప్రసాద్ గారు’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా విడుదలకు ఇంకా 25 రోజులే ఉండటంతో షూటింగ్ లో జరిగిన కొన్ని సంఘటనలను వీడియోగా చేసి మూవీ టీం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మెగాస్టార్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.. ఈ వీడియో చూస్తుంటేనే ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల్లో మెగాస్టార్ సినిమా హిట్ సాధించేలా కనిపిస్తుంది. దీంతో ఈ వీడియో చూసిన మెగాస్టార్ అభిమానుల సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులో మెగాస్టార్ గ్రేస్ అదిరిపోయేలా ఉంది. జనవరి 12, 2026 లో సంక్రాంతికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Read also-Nidhhi Agarwal: లూలూమాల్ ఘటనపై సీరియస్ అయిన పోలీసులు.. మాల్ యాజమాన్యంపై సుమోటో కేసు..

