Government Job: ఆర్థిక ఇబ్బందులను లెక్కచేయని
Government Job ( IMAGE CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Government Job: ఆర్థిక ఇబ్బందులను లెక్కచేయని చదువు పోరాటం.. తల్లిదండ్రుల కలను నిజం చేసిన కుమారుడు!

Government Job: కుటుంబ నేపథ్యం నుంచే విజయానికి బాటలుపేదరికం, కష్టాలు అడ్డంకులు కాకుండా సంకల్పబలంతో ముందుకు సాగితే విజయం తప్పకుండా వరిస్తుందనే సత్యానికి మరో ఉదాహరణగా ముష్టిబండ గ్రామానికి చెందిన ఒక యువకుడి జీవితం నిలిచింది. తల్లిదండ్రుల త్యాగం, స్వయంకృషితో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి గ్రామానికి గర్వకారణంగా మారిన ఈ యువకుడి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం..

అతనెవరు… ఏమిటా..కథ..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామానికి చెందిన ఎంట్రు శ్రీనివాసరావు గ్రూప్–3 ఉద్యోగాన్ని సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. తండ్రి సూర్య నారాయణ, తల్లి రమణ దంపతులకు జన్మించిన శ్రీనివాసరావు చిన్ననాటి నుంచే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదివారు. ఆయన కల ఇప్పుడు గ్రూప్–3 రూపంలో నెరవేరింది.

Also Read: Government Jobs: సంక్షేమ పథకాల్లో ఉద్యమకారులకు ప్రయారిటీ!

తెలంగాణ గ్రూప్–3 ఫలితాలు విడుదల

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC / TGPSC) గ్రూప్–III సేవల ఫలితాల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొత్తం సుమారు 1,370 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. విడుదలైన జనరల్ ర్యాంక్ లిస్ట్ (GRL)లో ముష్టిబండ గ్రామానికి చెందిన ఎంట్రు శ్రీనివాసరావు పేరు చోటు దక్కించుకోవడం విశేషంగా మారింది. హాల్ టికెట్ నంబర్: 2296415671. అత్యంత పేద కుటుంబ నేపథ్యంతో ఎదిగిన శ్రీనివాసరావు విద్యాభ్యాసంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ప్రతికూల పరిస్థితులకు లోనుకాకుండా పట్టుదలతో చదువును కొనసాగించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, స్వయంకృషి ఆయనను విజయం దిశగా నడిపించాయి.

కష్టానికి నేడు ఫలితం దక్కింది

కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే తండ్రి సూర్య నారాయణ, తల్లి రమణ దంపతులు తమ ఇద్దరు కుమారులు శ్రీనివాసరావు, నవీన్‌లను ప్రయోజకులను చేయాలనే ఆశయంతో ఎండనక వానక కష్టపడి చదివించారు. రోజువారీ కూలీ పనులు చేస్తూ పిల్లల విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. వారి కష్టానికి నేడు ఫలితం దక్కింది. గ్రూప్–3 ఫలితాల్లో విజయం సాధించడంతో ముష్టిబండ గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. గ్రామస్తులు, స్నేహితులు, బంధువులు శ్రీనివాసరావును ఘనంగా అభినందిస్తూ చరవాణి ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

శ్రీనివాస రావు గ్రామ యువతకు ఆదర్శం

పేద కుటుంబం నుంచి వచ్చి ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో శ్రీనివాస రావు గ్రామ యువతకు ఆదర్శంగా నిలిచారని గ్రామ పెద్దలు తెలిపారు. కష్టపడి చదివితే ఏ లక్ష్యమైనా సాధ్యమేనని నిరూపించిన ఈ విజయం ముష్టిబండ గ్రామ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఈ విజయంతో ఎంట్రు శ్రీనివాసరావు ముష్టిబండ గ్రామంతో పాటు దమ్మపేట మండలానికి గర్వకారణంగా నిలిచారు. పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర శ్రమ ఉంటే ఏ లక్ష్యమైనా సాధ్యమేనని మరోసారి నిరూపించిన ఈ విజయం గ్రామ యువతకు దిశానిర్దేశకంగా నిలిచింది. ఇలాంటి విజయాలు మరిన్ని యువతను ఉన్నత లక్ష్యాల వైపు ప్రోత్సహిస్తాయని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

Note: పరీక్ష రాసిన అభ్యర్థులు tspsc.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి లేదా నేరుగా వెబ్‌సైట్‌ను సందర్శించి తమ పేరు లేదా రోల్ నంబర్‌ను GRL / సెలెక్షన్ లిస్ట్‌లో తనిఖీ చేసుకోవాలని సూచించింది.అభ్యర్థులు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ లిస్ట్ PDFను TSPSC అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చని కమిషన్ తెలిపింది.

Also Read: Bhadrachalam: భద్రాచలం ఎమ్మెల్యే పిఏ నవాబ్ ఆగడాలు.. రూ.3.60 కోట్లు ఇవ్వాలని డిమాండ్!

Just In

01

Revenge Crime: రెండు కుటుంబాల మధ్య పగ.. ఇటీవలే ఒక హత్య.. పోస్టుమార్టం నిర్వహించగా…

IND vs SA 5th T20I: కొద్ది గంటల్లో ఐదో టీ20.. టీమిండియాలో భారీ మార్పులు.. ఈ ఇద్దరు స్టార్లు ఔట్!

BMW Teaser: రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ వచ్చేసింది.. మాస్‌కి ఫ్యామిలీ టచ్..

Huzurabad News: మిషన్ భగీరథకు తూట్లు.. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు..?

Wife Murder Crime: రాష్ట్రంలో ఘోరం.. భార్యను కసితీరా.. కొట్టి చంపిన భర్త