MP Mallu Ravi: గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన అహంకారాన్ని చాటుకుందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి (MP Mallu Ravi) విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, లోక్‌సభలో తమకు ఉన్న మెజార్టీని అడ్డం పెట్టుకుని, ప్రతిపక్షాల అభ్యర్థనలను ఏమాత్రం వినకుండా ఈ బిల్లును ఆమోదించుకున్నారని మండిపడ్డారు. పథకం నుంచి గాంధీ పేరును తీసివేయవద్దని తాము చేసిన డిమాండ్‌ను కేంద్రం బేఖాతరు చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: MP Mallu Ravi: ఇండియా కూటమి ఎంపీల అరెస్టుపై ఎంపీ మల్లు రవి ఆగ్రహం!
60:40 నిష్పత్తిలో నిధులు చెల్లించాలి
కాంగ్రెస్ హయాంలో ఈ పథకానికి సంబంధించిన పూర్తి నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించేదని, కానీ ఇప్పుడు 60:40 నిష్పత్తిలో నిధులు చెల్లించాలని కొత్త బిల్లులో నిబంధన పెట్టడం సరికాదని రవి పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రాలపై అదనపు భారం పడుతుందని, ఫలితంగా పేదలకు అందే ఉపాధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీకి మహాత్మా, జాతిపిత అనే బిరుదులను ప్రజలే ఇచ్చారు. ఆయన పేరును బీజేపీ రికార్డుల నుంచి తీసివేయవచ్చు కానీ, ప్రజల హృదయాల నుంచి చెరిపేయలేరని ఎంపీ స్పష్టం చేశారు. నాడు గాడ్సే గాంధీని భౌతికంగా చంపితే, ఈరోజు బీజేపీ ఆయన ఆత్మను చంపే ప్రయత్నం చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ ఆత్మ ప్రతి భారతీయుడిలో ఉందని, ఇలాంటి చర్యలను ప్రజలు క్షమించరని రవి హెచ్చరించారు.
Also Read: Mallu Ravi: గద్వాల్ భవిష్యత్తుకు బలమైన హామీలు.. ఎంపీ మల్లురవి కీలక నిర్ణయాలు

