India Vs South Africa: టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?
India-Vs-SA (Image source X)
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

India Vs South Africa: హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా భారత్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడవ టీ20 మ్యాచ్‌ షురూ అయ్యింది. భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రత్యర్థి జట్టు దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ప్రస్తుతం ఈ సిరీస్ ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఈ మ్యాచ్ ఇరు జట్లకు ముఖ్యమైనది.

తుది జట్లు

దక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, టన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డొనొవాన్ ఫెరీరా, మార్కో యన్సెన్, కార్బిన్ బాష్, ఎన్రిక్ నోర్ట్జే, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్‌మన్.

భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

Read Also- Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

ఫస్ట్ బౌలింగ్ అందుకే..

టాస్ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ మాట్లాడుతూ, ‘‘ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ పిచ్ చాలా బాగుంది. పెద్దగా మార్పు ఉండదని అనుకుంటున్నాను. అయితే, ఇప్పుడే కొద్దిగా మంచు కనిపిస్తోంది. తర్వాత మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. సిరీస్‌లో ప్రతి మ్యాచ్ ముఖ్యమైనదే. దక్షిణాఫ్రికా ప్లేయర్లు రెండో మ్యాచ్‌లో ఆడిన విధానం క్రికెట్ అందాన్ని చాటిచెప్పింది. ఎలా పుంజుకున్నామనేది ముఖ్యం. ఈ రోజు మేము కూడా తిరిగి పుంజుకోవాలనుకుంటున్నాం. అత్యుత్తమ ఆటను ఆడాలి, ఆనందించాలి, ధైర్యంగా ఆడాలి. ఈ మూడు గంటలు పూర్తిగా ఏకాగ్రతతో ఇదే చేయబోతున్నాం. జట్టులో రెండు కీలకమైన మార్పులు చేశాం. అక్షర్ పటేల్ అనారోగ్యంతో, జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో ఆడటం లేదు. వారి స్థానాల్లో హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు’’ అని సూర్య చెప్పాడు.

Read Also- Xiaomi: ప్రీమియం ఫీచర్లతో త్వరలో లాంచ్ కానున్న రెడ్‌మి నోట్ 15 సిరీస్

Just In

01

VV Vinayak: ‘ఉస్తాద్‌ భగత్ సింగ్‌‌’లో వివి వినాయక్.. ఈ ఫొటోకి అర్థం అదేనా?

Jio New Year offers: హ్యాపీ న్యూఇయర్ ప్లాన్స్ ప్రకటించిన రిలయన్స్ జియో

Social Media Ban: ఆస్ట్రేలియా తర్వాత 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం విధించనున్న మరో దేశం

Panchayat Results: రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Missterious: సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న “మిస్టీరియస్”