Panchayat Elections: తెలంగాణ పల్లె పోరు (Panchayat Elections) రెండో దశలోనూ (Second Phase Local Polls) కాంగ్రెస్ జోరు (Congress Party) కొనసాగుతోంది. అధిక స్థానాల్లో విజయకేతనం ఎగరవేస్తూ దూసుకెళుతోంది. ఆదివారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ ఫలితాలు వెలువడుతున్నాయి. తొలి దశ మాదిరిగా, రెండో దశలో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలతాలు వెలువడుతున్నాయి. హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక సర్పంచ్ స్థానాల్లో దూసుకుపోతున్నారు. 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, ఆదివారం (డిసెంబర్ 14) సాయంత్రం 5 గంటల సమయానికి 943 పంచాయతీల్లో కౌంటింగ్ పూర్తయ్యింది. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థులు అత్యధికంగా 543 చోట్ల గెలిచారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 174 మంది, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 51 స్థానాల్లో, ఇతరులు 175 స్థానాల్లో సర్పంచ్‌లు విజయం సాధించారు.
Read Also- MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!
అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ దూకుడు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు దూసుకెళుతున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఏర్పడిన సానుకూల దృక్పథం పంచాయతీ ఎన్నికల్లో నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు గ్రామీణ ఓటర్లను బలంగా ఆకర్షించాయని చెబుతున్నారు. అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలకు ఉన్న ఆశలు కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి దోహదపడ్డాయని అంటున్నారు.
రెండో స్థానంలో బీఆర్ఎస్
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇస్తున్నామని చెబుతున్న, విపక్ష బీఆఎస్ పార్టీ రెండో దశలోనూ రెండో స్థానానికే పరిమితమైంది. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కొన్ని చోట్ల మాత్రమే విజయాలు సాధిస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు స్థానిక స్థాయిలో బలమైన కేడర్ ఉన్నప్పటికీ, రాష్ట్ర స్థాయిలో అధికారం కోల్పోవడం, కొన్ని ప్రాంతాల్లో స్థానిక నాయకత్వ లోపం వంటివి ఆ పార్టీని దెబ్బతీస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తొలి దశలో వెల్లడైన ఫలితాల ప్రభావం కూడా రెండో దశ ఓటింగ్‌పై పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also- MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!
మళ్లీ చతికిలపడిన బీజేపీ
రెండో దశలోనూ బీజేపీ పరిస్థితి పేలవంగా తయారైంది. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థి అరకొర పంచాయతీల్లో మాత్రమే గెలుస్తున్నారు. కొన్ని చోట్ల బలంగా పోటీ పడినప్పటికీ, కాంగ్రెస్-బీఆర్‌ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొనడంతో బీజేపీ ప్రతికూలతలు ఎదుర్కొంటోంది. గ్రామీణ స్థాయిలో కమలనాథులకు ఇంకా పూర్తిస్థాయిలో బలమైన కేడర్ లేకపోవడం ఫలితాలపై ప్రభావం చూపింది. అయినప్పటికీ, తమ స్థాయికి తగిన విజయాలు సాధిస్తున్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, కాంగ్రెస్ నాయకులు పంచాయతీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. స్థానిక నేతలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, గ్రామంలో వ్యూహాత్మకంగా బలమైన అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం ఆ పార్టీకి కలిసొచ్చింది. పైగా అధికారంలో కూడా ఉండటంతో అభివృద్ధికి నిధులు వస్తాయనే భావన ఆ పార్టీ విజయానికి మరో కారణమవుతోంది.

