Vote Money Controversy: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థుల వ్యవహార శైలిపై విస్తృత చర్చ జరుగుతున్నది. తొలి విడుత ఎన్నికల్లో గెలుపు కోసం ఓటర్లను ఆకట్టుకునేందుకు ఓటు వేయండి అని అభ్యర్థిస్తూ కొంత నగదును అభ్యర్థులు పంపిణీ చేశారు. అయితే, ఓడిన వారు కొన్ని గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ తాము ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ శైలి ఇప్పుడు ఆయా గ్రామాల ప్రజలకు తలనొప్పిగా మారింది. కొంతమంది ఇదేం పద్ధతి అంటూ నిలదీస్తున్నారు.
పురుగు మందు డబ్బాతో బీఆర్ఎస్ మద్దతుదారుడు
తొలి విడుత పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు తాము ఇచ్చిన డబ్బులు తమకి ఇవ్వాలని తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నల్గొండ(Nalgonda) జిల్లా నార్కెట్‌పల్లి మండలం ఔరవాణి గ్రామ పంచాయతీకి తొలి విడుతలో ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్(BRS) పార్టీ మద్దతుతో పోటీ చేసిన కల్లూరి బాలరాజు 448 ఓట్లతో ఓడిపోయారు. దీంతో తన డబ్బులు తనకు ఇవ్వాలని కోరుతూ దేవుడి పటంతో పిల్లలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ వసూలు చేస్తున్న వీడియో వైరల్ అయింది. అంతేకాదు మరో చేతిలో పురుగు మందు డబ్బా పట్టుకొని కన్నీరు పెట్టుకుంటూ తిరగడం చర్చనీయాంశమైంది.
Also Read: Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..
మహిళా అభ్యర్థి కూడా..
మహబూబాబాద్ మండలం సోమ్లా తండాకు చెందిన భూక్య కౌసల్య సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఆమె సేవాలాల్ జెండా పట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని లేకుంటే తనకు ఓటు వేసినట్లు ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఆమె వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు పలు గ్రామాల్లో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఓడిపోయిన అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ తాము ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో రాజకీయ వర్గాల్లోనూ విస్తృత చర్చకు దారి తీసింది.
ఓడిన వార్డు సభ్యుడు.. ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగివ్వాలని..!
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామంలో ఘటన
సర్పంచ్ ఎన్నికల సందర్భంగా వార్డు సభ్యుడిగా పోటీ చేసిన వ్యక్తి రూ.2 లక్షలు పంపిణీ
కాగా, అతడికి కేవలం ఆరు ఓట్లు మాత్రమే రావడంతో.. అతను ఇచ్చిన డబ్బులు వెనక్కి… pic.twitter.com/1fGA3ZMyO0
— BIG TV Breaking News (@bigtvtelugu) December 14, 2025
Also Read: Panchayat Elections: ఓట్ల పండుగకు పోటెత్తుతున్న ఓటర్లు.. పల్లెల్లో రాజకీయ వాతావరణం

