Local Body Elections: పల్లెల్లో మొదలైన రెండో విడత పోలింగ్..!
Local Body Elections (imagecredit:twitter)
Telangana News

Local Body Elections: తెలంగాణ పల్లెల్లో మొదలైన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..!

Local Body Elections: తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు మోదలయ్యాయి. దీనికి అన్ని ఎర్పాట్లను అధికారులు పూర్తిచేసారు. నేటితో రాష్ట్రంలో రెండోవిత ఎన్నికలు నేటితో ముగియనున్నాయి. రెండవ విడతగా అందోలు నియోజకవర్గంలోని మండలాల్లో ఎన్నికలను నేడు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసారు. శనివారం సాయంత్రానికే పోలింగ్‌ కేంద్రాలకు అధికారులు, బ్యాలెట్‌ బాక్స్‌లతో చేరుకున్నారు. అందోలు నియోజకవర్గంలోని రెండవ విడత పోలింగ్‌ అందోలు, పుల్కల్, వట్‌పల్లి, చౌటకూర్, మునిపల్లి, రాయికొడ్‌ మండలాల్లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్దం చేశారు. ఆయా మండలాల్లోని ప్రజలు ఓటును వినియోగించుకునేందుకు 1212 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఎన్నికల నిర్వహణకు 2710 మంది సిబ్బందిని నియమించారు. ఆయా పోలింగ్‌ కేంద్రాలలో ఏలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా పోలీసు నిఘా ఉంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి.

ఓట్ల లెక్కింపు

నేడు పోలింగ్‌ ఉండడంతో గ్రామాల వారీగా ఎన్నికల నిర్వహణకు అధికారులను కేటాయించి, వారికి ఎన్నికల సామాగ్రీని శనివారం అందజేశారు. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్‌ ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ ఉంటుంది. ఏ గ్రామానికి సంబంధించిన ఓట్ల లెక్కింపును ఆదే గ్రామంలో ఆదే రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రారంభమవుతుంది. ముందుగా గ్రామంలోని వార్ఢు స్థానాలకు, తర్వాత సర్పంచ్‌ స్థానానికి ఓట్ల లెక్కింపును నిర్వహిస్తారు. అప్పటికప్పుడు గెలిచిన సర్పంచ్‌ అభ్యర్థితో పాటు ఉప సర్పంచ్‌ ఎన్నికను నిర్వహించి అధికారికంగా ప్రకటిస్తారు.

Also Read: Sarpanch Elections: సర్పంచ్ బరిలో నిండు గర్భిణీ.. బాండ్ పేపర్ పై హామీలతో ప్రచారం..!

134 సర్పంచ్‌.. 1168 వార్డులకు ఎన్నికలు

అందోలు నియోజకవర్గంలోని రెండో విడత అందోలు, పుల్కల్, వట్‌పల్లి, చౌటకూర్, రాయికొడ్, మునిపల్లి మండలాల్లో 134 సర్పంచ్, 1168 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా మండలాల్లోని 143 గ్రామ పంచాయతీలకు గాను 9 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవం కాగా, 1252 వార్డులకు గాను 86 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 134 సర్పంచ్‌ స్థానాలకు 377 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 1166 వార్డులకు గాను 2580 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

తేలనున్న అభ్యర్థుల భవితవ్వం

స్థానిక పోరులో బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్వం నేడు తేలిపోనుంది. పోటీలో ఉన్న అభ్యర్థులకు గెలుపు, ఓటముల టెన్షన్‌ కూడా పోలింగ్‌ రోజునే తెలిసిపోతుంది. గత రోజులలలో నామినేషన్‌లు వేసి పోటీలో ఉన్న అభ్యర్థులు నువ్వా.. నేనా అన్నట్లుగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఓటర్లను అకట్టుకునేందుకు గత వారం రోజులుగా ఎవరి ప్రయత్నాలే చేశారు. కానీ ఓటర్లు మాత్రం ఏవర్ని గెలిపిస్తారు. ఎవర్ని ఓడిస్తారన్నది నేటీ పోలింగ్, ఓట్ల లెక్కింపుతో తెలిపోతుంది. అధికారులు గెలిచిన అభ్యర్థితో పాటు ఉప సర్పంచ్‌ ఎన్నికను నిర్వహించి అక్కడే ప్రకటిస్తారు.

సంగారెడ్డి జిల్లాలో 10 మండలాల్లో…

సంగారెడ్డి జిల్లాలోని 10 మండలాల్లో పోలింగ్ నిర్వహింస్తున్నారు. 10 ఆందోళ్, చౌటకూర్, పులకల్, వట్పల్లి, రాయకోడ్, జరసంగం, జహీరాబాద్, మొగుడంపల్లి, కొహీర్, మునిపల్లి, మండలాల్లోని 243 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 14 గ్రామపంచాయితీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన, 229 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. 2164 వార్డు స్థానాలకు గాను, 222 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 1941 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.

సిద్దిపేట జిల్లా 10 మండలాల్లో..

సిద్దిపేట జిల్లాలో 10 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్బర్ పేట బూంపల్లి, దుబ్బాక, మీరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట, సిద్దిపేటరూరల్, సిద్దిపేట అర్బన్, తొగిట, హుస్నాబాద్, బెజ్జంకి, మండలాల్లో 2 వ విడత, సర్పంచ్ వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 10 మండలాల్లో 182 గ్రామ పంచాయతీలు, 1644 వార్డులకు, ఎన్నికలు జరగాల్సి ఉండగా, 10 సర్పంచ్ స్థానాలు, 278 వార్డు స్థానాలకు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన సర్పంచ్, వార్డు స్థానాలకు, ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

Also Read: Telangana DGP: ఉప్పల్‌లో సీఎం – మెస్సీ మ్యాచ్.. కీలక సూచనలు చేసిన డీజీపీ శివధర్ రెడ్డి

Just In

01

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి

Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై ప్రియాంక గాంధీ ఫైర్!

Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

VH Hanumantha Rao: బీసీ రిజర్వేషన్లపై.. బీజేపీ ఓబీసీ ఎంపీలు మౌనమేల: వీహెచ్ ఫైర్

Lipstick: మీ స్కిన్ టోన్‌కి అద్భుతంగా కనిపించే లిప్ స్టిక్ షేడ్స్.. డే-టు-డే నుండి పార్టీ లుక్ వరకు