Panchayat Elections: ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో దసరా దివాళి సంక్రాంతి ఉగాది లాంటి ప్రధాన పండుగలకు ఎక్కడో సుధీర ప్రాంతాలలో ఉన్న ప్రజలు సొంత ఊర్లకు రావడానికి అభ్యర్థులు నిత్యం టచ్ లో ఉంటున్నారు. సాధారణంగా ఏడాదికి వచ్చే అనేక వేడుకలు, శుభకార్యాలకు గ్రామాలకు వస్తారు. బంధువులను పలకరించి, స్థానికంగా ఉండే కుటుంబ సభ్యులతో హాయిగా గడిపి వెళతారు. అలాంటి పండగే ఐదేళ్ల కు ఒక సారి వచ్చే గ్రామ ప్రథమ పౌరుడు ఎన్నికకు ప్రజలు మరోసారి రానున్నారు. ఇప్పటికే మొదటి విడత ఈనెల 11న పూర్తి కాగా రెండవ విడత నేడు జరగనుండగా, మూడో విడత 17న జరగనున్న ఎన్నికలకు ప్రజలు మరోసారి వారి స్వగ్రామాలకు పోటెత్తనున్నారు.. ఓటు అనే వజ్రాయుధాన్ని గ్రామాభివృద్ధికి ఉపయోగించుకునేలా ఓటర్ల సిద్ధమై పల్లెలకు బాట పట్టనున్నారు. దీంతో గ్రామాలలో పండగ వాతావరణం నెలకొంది.
ప్రతి ఓటు కీలకమే
ప్రతి ఎన్నికలో ప్రతి ఓటు కీలకమే కావడంతో పంచాయతీలలో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు ప్రతి ఓటర్ను ప్రత్యక్షంగా దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్లు చేస్తూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తప్పనిసరిగా రావాలని కోరుతున్నారు. కొన్నిచోట్ల ఒక ఓటుతో గెలిచిన సందర్భాలు సైతం ఉన్నాయి. తాజాగా మొదటి విడుదల జరిగినా ఎన్నికలలో గట్టు మండలం గంజి మాన్ దొడ్డి గ్రామంలో పద్మమ్మ అనే మహిళ జయమ్మ పై ఒక ఓటు తేడాతో విజయం సాధించింది.
ప్రలోభాలకు లొంగొద్దు
ఇప్పుడు పలు రాజకీయ పార్టీలు ఇతర ప్రాంతాలలో ఉంటున్న ఓటర్లపై దృష్టి పెట్టాయి. ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడానికి బూత్ కమిటీలతో ఆరా తీసి ఇప్పటికే ఫోన్ చేశారు. దారి ఖర్చులతో పాటు ఇతర ఖర్చులను భరిస్తామని ప్రలోభ పెడుతున్నారని సమాచారం. పోలింగ్ తేదీన రప్పించడానికి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి ఎవరి మాటలు నమ్మకుండా స్వేచ్ఛగా ఓటేయండి. ప్రజాస్వామ్యంలో తమ ఓటు హక్కును స్వేచ్ఛగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయడం ద్వారా ఐదు సంవత్సరాలలో గ్రామానికి సేవ చేసేందుకు జవాబుదారీతనాన్ని కల్పించడం ద్వారా సమస్యలపై నిరదీసే హక్కును కలిగి ఉంటాం. లేనిపక్షంలో పెట్టిన ఖర్చును తిరిగి రాబట్టుకునేందుకు అక్రమార్జనకు పాల్పడే అవకాశం ఉంటుంది.
నేడు రెండవ విడత ఎన్నికలకు సర్వం సిద్ధం
జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటికే మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా జరిగిన సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తికాగా నేడు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండలంతో పాటు ఆలంపూర్ నియోజకవర్గ పరిధిలోని ఐజ, రాజోలి, వడ్డేపల్లి మండలాలలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నాలుగు మండలాల పరిధిలో 74 గ్రామాలు ఉండగా 716 వార్డ్ లు ఉన్నాయి. అయితే అందులో 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 474 వార్డు స్థానాలలో సైతం అభ్యర్థులను అందరి ఆమోదంతో ఏకగ్రీవమయ్యాయి. ఐజ మండలంలో ఏడు సర్పంచ్ స్థానాలకు, వడ్డేపల్లి మండలంలో ఐదు, రాజోలి మండలంలో 1, మల్దకల్ మండలంలో ఐదు గ్రామ పంచాయతీలకు సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో మిగిలిన 56 సర్పంచ్ స్థానాలకుపాటు 242 వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణకు పోలీస్ అధికారులు ప్రతిష్ట బందోబస్తును సిద్ధం చేశారు.
Also Read: Bigg Boss9 Telugu: రీతూ వెళ్లిపోయాకా డీమాన్ పవన్ పరిస్థితి ఎలా ఉందంటే?.. భరణికి నచ్చనిదెవరంటే?

