Bigg Boss9 Telugu: బుల్లి తెర ప్రేక్షకులు అమితంగా ఆదరించే రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 9’. ఈ రణరంగం దాదాపు చివరి అంకానికి చేరుకుంది. 97వ రోజుకు సంబంధించి ప్రోమో విడుదలైంది. ఇందులో నాగ్ చాలా సరదాగా కనిపించారు. చాలా జాలీగా బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించిన నాగ్ ఈ సారి ఎవరినీ ఏమీ అనదల్చుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ సారి ఇచ్చిన టాస్క్ అందిరిలో ఏదో తెలియని బాధని, సంతోషాన్ని కలిగించింది. ఇలా ఇంటి లోపలికి ప్రవేశించిన నాగార్జున పవన్ గురించి అన్న మాటలు చాలా ఫన్నీగా మారాయి. నాగార్జున మాట్లాడుతూ.. పవన్.. రీతూ వెళ్లిపోయిన తర్వాత నువ్వు చాలా మారిపోయావు.. అందిరితో చాలా బాగా కలిసిపోతున్నావు ఎందుకు అంటావు అని అన్నారు. దానికి సమాధానంగా.. పవన్ ఈ వారం చాలా సరదాగా గడిపాను సార్, చాలా ఎంజాయ్ చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆగకుండా నాగ్ ఏం అన్నారంటే.. దొరికావులే బయటకు వెళ్లిన తర్వాత అంటూ చమత్కరించారు. దీంతో ఈవారం చాలా సరదాగా సాగుతుంది అనుకుంటుండగానే బిగ్ బాస్ మరో టాస్క్ ఇవ్వడంతో అందరూ ఆడటానికి సిద్ధం అయ్యారు.
Read also-CPI Narayana: ఐబొమ్మ రవి జైల్లో ఉంటే.. అఖండ-2 పైరసీ ఎలా వచ్చింది.. సీపీఐ నారాయణ సూటి ప్రశ్న
ఈ రోజు ట్రస్ట్ కుసంబంధించిన టాస్క్ ఇవ్వబోతుంది. అందులో బిగ్ బాస్ ఇంటిలోని సభ్యులు ఎవరిని నమ్ముతున్నారు?.. ఎవరిని అసలు నమ్మడంలేదు? అనే విషయాలపై మీకు అక్కడ బోర్డు ఉంటుంది.. అందులో మీరు బాగా ట్రస్ట్ చేసేవారికి గ్రీన్ ఫ్లాగ్ ఇవ్వాలి, అసలు ట్రస్ట్ చెయ్యని వారికి రెడ్ ఫ్యాగ్ ఇవ్వాలి అని చెప్పారు. మొదటిగా సంజనా ఈ టాస్క్ లో పాల్గొన్నారు. ఎవరికి రెడ్ ఇచ్చారు. ఎవరికి గ్రీన్ ఇచ్చారు ఎందుకు అనేది తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.. అంతే కాకుండా చివరిలో భరణి, సుమన్ శెట్టి మధ్య ఉన్నబంధాన్ని చూపిస్తూ.. బిగ్ బాస్ చూపించిన వీడియో అందరి కంటా తడి చమార్చేలా చేసింది.. ఈ రోజుగురించి మరింత తెలుసుకోవాలంటే సాయంత్రం వరకూ ఆగాల్సిందే..

