India Vs South Africa: టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
India-Vs-SA (Image source X)
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

India Vs South Africa: రెండో టీ20లో టాస్ గెలిచిన భారత్.. కెప్టెన్ సూర్య ఏం ఎంచుకున్నాడంటే?

India Vs South Africa: ఛండీగఢ్‌ వేదికగా భారత్ – దక్షిణాఫ్రికా జట్ల (India Vs South Africa) మధ్య రెండో టీ20 మ్యాచ్ షురూ అయ్యింది. ఈ మ్యాచ్‌ టాస్ అప్‌డేట్ వచ్చింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పర్యాటక జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తీవ్రంగా మంచు కురుస్తుండడంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం అంత తేలికకాకపోవచ్చనే వ్యూహంతో కెప్టెన్ సూర్య ఈ నిర్ణయం తీసుకున్నాడు.

మార్పులు లేకుండానే బరిలోకి

ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండా, తొలి మ్యాచ్‌ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. టాస్ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ ఈ గ్రౌండ్‌లో ఆడడం ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఫ్రాంచైజీ క్రికెట్ (ఐపీఎల్) మ్యాచ్‌లు, ఈ మధ్యే మహిళల మ్యాచ్ కూడా ఇక్కడ జరిగాయి. ఈ గ్రౌండ్‌లో మొట్టమొదటిసారిగా పురుషుల అంతర్జాతీయ మ్యాచ్ ఇదేనని విన్నాను. ఆ విషయంలో మరింత ఉత్సాహంగా అనిపిస్తోంది. క్రికెట్ ఫ్యాన్స్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను’’ అని సూర్య పేర్కొన్నాడు.

Read Also- Indigo CEO Apology: చేతులు జోడించి దేశాన్ని క్షమాపణ కోరిన ఇండిగో సీఈవో.. కేంద్రమంత్రి సమక్షంలో ఆసక్తికర ఘటన

జట్టు కూర్పు విషయానికి వస్తే, పరిస్థితిని బట్టి జట్టుకు ఏం అవసరమో గుర్తించి, ఆటగాళ్లు తమ బాధ్యతలను తీసుకోవడం చాలా ముఖ్యమని సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించాడు. తొలి మ్యాచ్‌లో ప్లేయర్లు పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేశారని, ఆ వికెట్‌పై 175 పరుగులు సాధించడం కొంచెం పెద్ద స్కోరేనని అన్నాడు. తొలి మ్యాచ్‌లో భారత బౌలర్ల ప్రతిభను బట్టి చూస్తే అద్భుతంగా రాణించారని తాను భావిస్తున్నట్టు చెప్పాడు. ఇక, హార్దిక్ పాండ్యా జట్టుకు అందించే సమతుల్యత అద్భుతమైనదని వివరించాడు. పాండ్యా బ్యాటింగ్ చేసిన విధానం, ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా అతడు బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా మైదానంలో ప్రశాంతంగా ఉంటాడని మెచ్చుకున్నాడు. బౌలింగ్‌లో కూడా పాండ్యా ముఖ్యమని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.

తుది జట్లు ఇవే 

దక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్ ( వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యన్సెన్, లుథో సిపామ్లా, లుంగీ ఎంగిడి, ఒట్నీల్ బార్ట్‌మన్.

భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.

Read Also- CM Delhi Tour: తెలంగాణ రైజింగ్ విజన్‌కు ఫిదా.. సీఎం రేవంత్‌పై కాంగ్రెస్ అగ్రనేతలు ప్రశంసలు

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క